( ఫైల్ ఫోటో )
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాల్లో దూసుకెళ్తోంది. తొలి రౌండ్ నుంచి కాంగ్రెస్ తన సత్తా చాటుతోంది. తెలంగాణలో చాలా చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
ఇప్పటివరకు 65 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగుతోంది. తెలంగాణలో తొలి ఫలితం వెల్లడైంది. ఖమ్మం ఆశ్వారావుపేటలో కాంగ్రెస్ విజయం సాధించింది. 28,358 ఓట్లతో ఆది నారాయణ గెలించారు. ఇల్లందులోనూ కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య విజయం సాధించారు.
ఈ నేపథ్యంలో టీపీసీసీ ఛీప్ రేవంత్‌రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. అగ్ని కీలల్లో ఆహుతవుతూ తెలంగాణ ఆకాంక్షలను ఆకాశమంత ఎత్తున నిలిపిన అమరులకు జోహార్లు. శ్రీకాంతచారి వర్ధంతి సందర్భంగా నివాళి అర్పిస్తూ… అమరుల ఆశయాలు, నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలు ఫలించే సమయం ఆసన్నమైంది’’ అంటూ రేవంత్ ట్వీట్ చేశారు.
అగ్ని కీలల్లో ఆహుతవుతూ తెలంగాణ ఆకాంక్షలను ఆకాశమంత ఎత్తున నిలిపిన అమరులకు జోహార్లు.
— Revanth Reddy (@revanth_anumula) December 3, 2023
శ్రీకాంతచారి వర్ధంతి సందర్భంగా నివాళి అర్పిస్తూ… అమరుల ఆశయాలు, నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలు ఫలించే సమయం ఆసన్నమైంది.#Srikantachary #Telangana #Martyr pic.twitter.com/juCnioj70j
Comments
Please login to add a commentAdd a comment