
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రేపు(ఆదివారం) ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇక, ఎగ్జిట్‌పోల్స్ కాంగ్రెస్‌కు ఫేవర్‌గా ఫలితాలను వెల్లడించాయి. దీంతో, కాంగ్రెస్‌లో సీఎం ఎవరు? అనే చర్చ నడుస్తోంది. ఈ తరుణంలో వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
కాగా, వైఎస్ షర్మిల శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో సమర్థులైన సీఎం అభ్యర్థులు ఎంతో మంది ఉన్నారు. భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్ రెడ్డి సీఎం పదవికి అర్హులు. బ్లాక్‌మెయిలర్స్ మాత్రం ముఖ్యమంత్రి కాకూడదు. ముఖ్యమంత్రి ఎవరూ అనేది ఆ పార్టీ నేతలు తేల్చుకుంటారు అని కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు బైబై చెప్పారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా బైబై కేసీఆర్ సూటుకేసును ఆమె ప్రదర్శించారు.
ఇదిలా ఉండగా.. తాజాగా కాంగ్రెస్ నేతలు ఎన్నికల సీఈవో వికాస్‌రాజ్‌ను కలిశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బీఆర్‌ఎస్ నేతలకు సంబంధించి కాంట్రాక్టర్లకు నిధులు మంజూరు చేయిస్తున్నారని ఫిర్యాదు చేశారు. రూ. 6వేల కోట్లను తమకు నచ్చిన కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు బీఆర్‌ఎస్ ప్రయత్నిస్తున్నదని తెలిపారు. రైతుబంధు నిధులను కాంట్రాక్టర్ల బిల్లులకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. భూరికార్డులు మారుస్తున్నట్టు కాంగ్రెస్ నేతలకు సమాచారం ఉందని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిబంధనలు పాటించడంలేదని తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు.. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు దుర్వినియోగం కాకుండా చూడాలని కోరినట్టు చెప్పారు.
YS Sharmila Sensational Comments on Congress CM Candidate | Revanth Reddy#YSSharmila #CongressCMCandidate #RevanthReddy #UttamKumarreddy #BhattiVikramarka #SakshiTV pic.twitter.com/tAcjiNrlmA
— Sakshi TV Official (@sakshitvdigital) December 2, 2023
ఇది కూడా చదవండి: ఎన్నికల ఫలితాల వేళ సీతక్క ఎమోషనల్ కామెంట్స్
Comments
Please login to add a commentAdd a comment