
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో దొరల పాలన పోయిందని, ప్రజల తెలంగాణ వచ్చిందని కాంగ్రెస్ కీలక నేత, సీఎల్పీ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ ఫలితాల్లో కాంగ్రెస్ జోరు కొనసాగుతున్న వేళ.. ఆయన మీడియాతో మాట్లాడారు.
ఇది ప్రజల విజయం. తెలంగాణలో దొరల పాలన పోయింది. ప్రజా తెలంగాణ వచ్చింది. గెలిచిన అభ్యర్థులందరికీ అభినందనలు. కాంగ్రెస్ తరఫున ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తాం. సీఎం పదవి ఇస్తే బాధ్యతగా భావిస్తా అని అన్నారాయన.
Comments
Please login to add a commentAdd a comment