
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలకు డీఏ విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం(ఈసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉద్యోగులకు మొత్తం మూడు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో ఒకటి రిలీజ్ చేసేందుకు అనుతివ్వాల్సిందగా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈసీని కోరింది.
డీఏ చెల్లింపులు ఎందుకు ఆలస్యమయ్యాయని, ఇప్పుడే ఎందుకివ్వాల్సి వస్తోందని ఈసీ ప్రభుత్వాన్ని అడిగినట్లు తెలిసింది. దీనికి ప్రభుత్వ సమాధానం సంతృప్తికరంగా ఉండటంతో డీఏ విడుదలకు ఈసీ ఓకే అంది.
కాగా, ప్రభుత్వంతో పాటు ఉద్యోగసంఘాలు కూడా డీఏ విడుదలపై ఈసీకి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశాయి. ఇప్పటికే రాష్ట్రంలో పోలింగ్ ముగిసినందున ఈసీ వారి విజ్ఞప్తికి అంగీకరించింది.
ఇదీచదవండి..కేటీఆర్‌ది మేనేజ్‌మెంట్ కోటా..నాది మెరిట్ కోటా : రేవంత్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment