Five States Assembly Elections 2023: బీజేపీ తీన్మార్‌ | Five States Assembly Elections 2023: BJP secures victory in MP, Rajasthan and Chhattisgarh | Sakshi
Sakshi News home page

Five States Assembly Elections 2023: బీజేపీ తీన్మార్‌

Published Mon, Dec 4 2023 6:26 AM | Last Updated on Mon, Dec 4 2023 6:26 AM

Five States Assembly Elections 2023: BJP secures victory in MP, Rajasthan and Chhattisgarh - Sakshi

ఉత్కంఠభరితంగా సాగిన సెమీఫైనల్స్‌ పోరులో బీజేపీ ఘనవిజయం సాధించింది. ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు కీలక రాష్ట్రాలను సొంతం చేసుకుంది. మధ్యప్రదేశ్‌లో భారీ విజయంతో అధికారాన్ని నిలుపుకోగా రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లను కాంగ్రెస్‌ నుంచి చేజిక్కించుకుంది. తద్వారా ఉత్తరాది హిందీ బెల్టులో తన ప్రాబల్యాన్ని మరింత పెంచుకుంది. కీలకమైన 2024 లోక్‌సభ ఎన్నికల ముంగిట్లో లభించిన ఈ సానుకూల ఫలితాలతో బీజేపీలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి.

మూడు రాష్ట్రాల్లోనూ ఘోరమైన ఓటమి మూటగట్టుకుని కాంగ్రెస్‌ చతికిలపడింది. తెలంగాణలో పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనకు తెర దించుతూ విజయం సాధించడం ఒక్కటే ఈ ఎన్నికల్లో దానికి ఊరట. మధ్యప్రదేశ్‌లో 230 స్థానాలకు గాను బీజేపీ ఏకంగా 164 సీట్లతో ఘనవిజయం సాధించింది. కాంగ్రెస్‌ 65 స్థానాలతో సరిపెట్టుకుంది. రాజస్తాన్‌లో పోలింగ్‌ జరిగిన 199 స్థానాల్లో బీజేపీ 115 చోట్ల గెలిచింది.

కాంగ్రెస్‌కు 69 సీట్లు దక్కాయి. 90 స్థానాలున్న ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ 54 సీట్లు సాధించగా కాంగ్రెస్‌కు 35 దక్కాయి. ఇక తెలంగాణలో 119 సీట్లకు కాంగ్రెస్‌ 64 చోట్ల నెగ్గి మెజారిటీ సాధించగా అధికార బీఆర్‌ఎస్‌ 39 సీట్లకు పరిమితమైంది. ఐదో రాష్ట్రమైన మిజోరంలో సోమవారం ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెలువడనున్నాయి. ప్రధానంగా స్థానిక పార్టీలైన ఎంఎన్‌ఎఫ్, జెడ్‌పీఎం మధ్యే పోరు సాగిందన్న అంచనాల నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీలకు అక్కడ పెద్దగా ఆశలేమీ లేవు.
 
ఆద్యంతమూ ఆధిక్యమే...
ఫలితాల వెల్లడిలో తెలంగాణ మినహా మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ హవాయే సాగింది. ఆదివారం ఉదయం ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచే మధ్యప్రదేశ్‌లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్లింది. రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌ల్లో తొలుత కాంగ్రెస్‌ గట్టి పోటీ ఇస్తున్నట్టు కని్పంచినా కాసేపటికే పరిస్థితి బీజేపీకి అనుకూలంగా మారుతూ వచ్చింది. కాంగ్రెస్‌ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని చాలామంది భావించిన ఛత్తీస్‌గఢ్‌లో కూడా స్పష్టమైన ఆధిక్యం కని్పస్తుండటం పార్టీలో జోష్‌ నింపింది. దాంతో ఒకవైపు లెక్కింపు కొనసాగుతుండగానే బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.

జై శ్రీరాం, మోదీ నాయకత్వం వరి్ధల్లాలి అంటూ నేతలు, కార్యకర్తలు హోరెత్తించారు. మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రధాన కార్యాలయాల వద్ద బాణాసంచా కాలుస్తూ, మిఠాయిలు పంచుతూ సంబరాలు చేసుకున్నారు. ఏ రాష్ట్రంలోనూ సీఎం అభ్యర్థిని ప్రకటించకపోవడం బీజేపీకి కలిసొచ్చింది. ఈ నిర్ణయం ద్వారా మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రభుత్వంపై నెలకొన్న వ్యతిరేకత ప్రభావం నుంచి తప్పించుకోవడంతో పాటు రాజస్తాన్‌లో నేతల మధ్య కుమ్ములాటలకు కూడా పార్టీ చెక్‌ పెట్టిందని చెబుతున్నారు. మోదీ కేంద్రంగా సాగించిన ప్రచారం ఫలించింది. అంతిమంగా బీజేపీ మీద ప్రజల విశ్వాసానికి ఈ ఫలితాలు అద్దం పట్టాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొనగా, కాంగ్రెస్‌ మత, విభజన రాజకీయాలను వారు తిరస్కరించారని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చెప్పారు.

నిరుత్సాహంలో కాంగ్రెస్‌
గత మేలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించిన ఊపులో ఉన్న కాంగ్రెస్‌లో తాజా ఫలితాలు నిరుత్సాహం నింపాయి. ఇది తాత్కాలిక వెనుకంజేనని కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే, ప్రజా తీర్పును శిరసావహిస్తున్నామని ఆ పార్టీ అగ్ర నేత రాహుల్‌గాంధీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో కలిపి 84 లోక్‌సభ స్థానాలున్నాయి. తాజా విజయాలతో ఉత్తర, పశి్చమ భారతంలో అత్యధిక రాష్ట్రాలు బీజేపీ అధికారంలోకి వెళ్లాయి. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘనవిజయానికి ఆ ప్రాంతాల్లో మెరుగైన ప్రదర్శనే ప్రధాన కారణంగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో ఆశించినన్ని సీట్లు నెగ్గకపోవడం బీజేపీకి నిరాశ కలిగించగా అక్కడ తొలిసారిగా అధికారం చేపట్టనుండటం కాంగ్రెస్‌కు ఊరటనిచ్చే అంశం.  

రాజస్తాన్‌ బీజేపీదే
115 అసెంబ్లీ స్థానాల్లో విజయం
69 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్‌

జైపూర్‌:  రాజస్తాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సొంతం చేసుకుంది. రాష్ట్రంలో మొత్తం 200 శాసనసభ స్థానాలకు గాను 199 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. బీజేపీ ఏకంగా 115 స్థానాల్లో జెండా ఎగురవేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన మెజార్టీని సాధించింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోవడం గత మూడు దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తుంది. ఈ ఆనవాయితీని కాంగ్రెస్‌ బద్దలు కొట్టలేకపోయింది. ఈసారి ఎన్నికల్లో 69 సీట్లకు పరిమితమైంది.

ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆ పార్టీని గెలిపించలేకపోయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా బీజేపీ అగ్రనేతలు దూకుడుగా సాగించిన ప్రచారం ముందు కాంగ్రెస్‌ చేతులెత్తేసింది. ప్రజల తీర్పును గౌరవిస్తున్నామంటూ ముఖ్యమంత్రి  గెహ్లోత్‌ ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ఈ పరాజయాన్ని ఊహించలేదని పేర్కొన్నారు. తమ ప్రణాళికలు, పథకాలను ప్రజల వద్దకు చేర్చడంలో కొన్ని లోపాలు చోటుచేసుకున్నాయని అంగీకరించారు.

సీఎం  గెహ్లోత్‌ తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రాకు సమరి్పంచారు. రాజస్తాన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొన్నా చిన్నాచితక పారీ్టలు సైతం ప్రభావం చాటాయి. భారత ఆదివాసీ పార్టీ, బహుజన సమాజ్‌ పార్టీ, రా్రïÙ్టయ లోక్‌తాంత్రిక్‌ పార్టీ, రా్రïÙ్టయ లోక్‌దళ్‌ కొన్ని సీట్లు గెలుచుకున్నాయి. పలువురు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. పలువురు కాంగ్రెస్‌ మంత్రులు ఓడిపోయారు. అసెంబ్లీ స్పీకర్, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సి.పి.జోïÙకి సైతం పరాజయం తప్పలేదు. ముఖ్యమంత్రి అశోక్‌  గెహ్లోత్‌  జోద్‌పూర్‌ జిల్లాలోని సర్దార్‌పురా నుంచి వరుసగా ఆరోసారి విజయం సాధించడం విశేషం. గత ఎన్నికల్లో ఆయనకు 45,597 ఓట్ల ఆధిక్యం లభించగా, ఈసారి 26,396కు తగ్గింది.

మధ్యప్రదేశ్‌లో మళ్లీ కాషాయమే
163 స్థానాలు బీజేపీ కైవసం  
66 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్‌

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయ బావుటా ఎగురవేసింది. మొత్తం 230 స్థానాలకు గాను ఏకంగా 163 స్థానాలను సొంతం చేసుకుంది. మూడింట రెండొంతుల మెజారిటీ సాధించింది. ఈసారి బీజేపీని ఎలాగైనా గద్దె దించాలన్న అధికార కాంగ్రెస్‌ వ్యూహాలు ఫలించలేదు. ఆ పార్టీ కేవలం 66 సీట్లకే పరిమితమైంది. బీజేపీ గెలుపు నేపథ్యంలో రాజధాని భోపాల్‌లోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం సంబరాలు హోరెత్తాయి. కాంగ్రెస్‌ కార్యాలయం బోసిపోయింది.

ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా వల్లే విజయం సాధ్యమైందని బీజేపీ నాయకులు చెప్పగా పరాజయానికి కారణాలను సమీక్షించుకుంటున్నామని కాంగ్రెస్‌ నేతలు తెలిపారు. బుద్నీ అసెంబ్లీ స్థానంలో సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఏకంగా లక్షకు పై చిలుకు ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. ఈసారి బీజేపీ మధ్యప్రదేశ్‌తో పాటు ఏ రాష్ట్రంలోనూ ముఖ్యమంత్రి అభ్యరి్థని ముందుగా ప్రకటించకపోవడం తెలిసిందే. అయినా పార్టీ ఘనవిజయం నేపథ్యంలో శివరాజ్‌ ఐదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని భావిస్తున్నారు.

అయితే బీజేపీ ఇంతటి ఘనవిజయం సాధించినా ఏకంగా 12 మంది మంత్రులు ఓటమి పాలవడం విశేషం! అయితే అసెంబ్లీ బరిలో దిగిన కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్‌ తోమర్, ప్రహ్లాద్‌ పటేల్, బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాస్‌ విజయ వర్గీయ మాత్రం విజయం సాధించారు. 2013 ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో బీజేపీకి 165 స్థానాలొచ్చాయి. కాంగ్రెస్‌ 58 సీట్లకు పరిమితమైంది. బీజేపీకి 44.88 శాతం, కాంగ్రెస్‌కు 36.38 శాతం ఓట్లు లభించాయి. ఇక 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ 40.89 శాతం ఓట్లతో 114 స్థానాలు సాధించింది. బీజేపీ 41.02 శాతం ఓట్లు సాధించినా 109 సీట్లే నెగ్గింది. బీఎస్పీ, స్వతంత్రుల మద్దతుతో కాంగ్రెస్‌ అధికార పగ్గాలు చేపట్టింది. కమల్‌నాథ్‌ ముఖ్యమంత్రి అయ్యారు. 15 నెలలకే కాంగ్రెస్‌ అగ్ర నేత జ్యోతిరాదిత్య తన వర్గం ఎమ్మెల్యేలతో బీజేపీలోకి ఫిరాయించారు. దాంతో కమల్‌నాథ్‌ సర్కారు కుప్పకూలింది. శివరాజ్‌ సీఎంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది.  

ఛత్తీస్‌గఢ్‌లో విరబూసిన కమలం
54 సీట్లతో బీజేపీ విజయహాసం
35 స్థానాలతో కాంగ్రెస్‌ ఓటమి

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం భారతీయ జనతా పార్టీని వరించింది. మొత్తం 90 శాసనసభ స్థానాలకు గాను బీజేపీ 54 స్థానాలు దక్కించుకుంది. అధికార కాంగ్రెస్‌కు 35 స్థానాలే లభించాయి. 2018 ఎన్నికల్లో ఓడిపోయిన కమలం పార్టీ ఐదేళ్ల తర్వాత మళ్లీ అధికార పీఠం సొంతం చేసుకుంది. ‘మోదీ కీ గ్యారంటీ–2023’ పేరిట బీజేపీ ఇచి్చన హామీలను ప్రజలు విశ్వసించినట్లు కనిపిస్తోంది.

క్వింటాల్‌ రూ.3,100 చొప్పున ధరకు ఎకరాకు 21 క్వింటాళ్ల చొప్పున ధాన్యం కొనుగోలు, మహతారీ వందన్‌ యోజన కింద వివాహమైన మహిళలకు ఏటా రూ.12,000 చొప్పున ఆర్థిక సాయం వంటి హామీలు ప్రజలను ఆకర్శించాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకత కూడా బీజేపీ గెలుపునకు తోడ్పడింది. కాగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత విభేదాలు ఆ పారీ్టకి ప్రతికూలంగా మారాయి. స్వయానా సీఎం బఘెల్, డిప్యూటీ సీఎం సింగ్‌దేవ్‌ మధ్య స్పర్థలుండటం కూడా బాగా చేటు చేసింది. 15 ఏళ్ల బీజేపీ పాలనకు తెర దించి 2018లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ఈసారి చతికిలపడింది.

సీఎం బఘెల్‌ తన సొంత నియోజకవర్గం పటన్‌లో నెగ్గినా రాష్ట్రంలో మాత్రం పార్టీని గెలిపించుకోలేకపోయారు. డిప్యూటీ సీఎం టీఎస్‌ సింగ్‌దేవ్‌ కూడా ఓటమి చవిచూశారు! అంబికాపూర్‌ అసెంబ్లీ స్థానంలో సమీప బీజేపీ ప్రత్యర్థి రాజేశ్‌ అగర్వాల్‌ చేతిలో కేవలం 94 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ నుంచి సీఎం బఘెల్‌ ముడుపులు స్వీకరించారంటూ పోలింగ్‌ సమీపించిన వేళ వచి్చన ఆరోపణలు కూడా కాంగ్రెస్‌కు బాగా నష్టం చేసినట్టు కనబడుతోంది.   మరోవైపు బీజేపీ ఈసారి వ్యూహాత్మకంగా సీఎం అభ్యరి్థని ప్రకటించకుండానే ఎన్నికల్లో పోటీకి దిగింది. అయినా ప్రధాని మోదీకి ఉన్న జనాదరణ, ఆయన పేరుతో ఇచి్చన హామీల ఆసరాతో పార్టీ విజయ తీరాలకు చేరింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement