MP: చారిత్రక విజయం మాదే.. మాజీ సీఎం కోడలు ధీమా | MP Elections Results 2023: Will Be Historic Win For Us, Says Krishna Gaur Daughter In Law Of Former CM Babulal Gaur - Sakshi
Sakshi News home page

MP Election Results 2023: చారిత్రక విజయం మాదే.. మాజీ సీఎం కోడలు ధీమా

Published Sun, Dec 3 2023 12:54 PM | Last Updated on Sun, Dec 3 2023 1:28 PM

will be historic win for us Krishna Gaur daughter in law of former CM Babulal Gaur - Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‌అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. 230 స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో ఇప్పటికే 160 స్థానాల్లో బీజేపీ లీడింగ్‌లో ఉంది. కాంగ్రెస్‌ 67 నియోజకవర్గాల్లో ముందంజలో ఉంది. 

కాగా మధ్యప్రదేశ్‌లో తాము చారిత్రక విజయం సాధిస్తున్నట్లు మాజీ సీఎం బాబూలాల్‌ గౌర్‌ కోడలు, గోవింద్‌పురా నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిని కృష్ణ గౌర్‌ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం కౌంటింగ్‌ ప్రారంభమైన వెంటనే ఆమె భోపాల్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

మధ్య ప్రదేశ్‌లో బీజేపీ పూర్తి మెజార్టీతో  ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, 2024 లోక్‌సభ ఎన్నకలలో రాష్ట్రంలోని 29 స్థానాల్లోనూ విజయం సాధించడమే తమ తదుపరి లక్ష్యమని కృష్ణ గౌర్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement