Babulal Gaur
-
MP: చారిత్రక విజయం మాదే.. మాజీ సీఎం కోడలు ధీమా
భోపాల్: మధ్యప్రదేశ్అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. 230 స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో ఇప్పటికే 160 స్థానాల్లో బీజేపీ లీడింగ్‌లో ఉంది. కాంగ్రెస్ 67 నియోజకవర్గాల్లో ముందంజలో ఉంది. కాగా మధ్యప్రదేశ్‌లో తాము చారిత్రక విజయం సాధిస్తున్నట్లు మాజీ సీఎం బాబూలాల్ గౌర్ కోడలు, గోవింద్‌పురా నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిని కృష్ణ గౌర్ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం కౌంటింగ్ ప్రారంభమైన వెంటనే ఆమె భోపాల్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మధ్య ప్రదేశ్‌లో బీజేపీ పూర్తి మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, 2024 లోక్‌సభ ఎన్నకలలో రాష్ట్రంలోని 29 స్థానాల్లోనూ విజయం సాధించడమే తమ తదుపరి లక్ష్యమని కృష్ణ గౌర్ పేర్కొన్నారు. -
మధ్యప్రదేశ్ మాజీ సీఎం కన్నుమూత
భోపాల్ : మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బాబులాల్ గౌర్ (89) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 2004 నుంచి 2005 వరకు బాబులాల్ మధ్యప్రదేశ్ సీఎంగా పనిచేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్ఘర్లో 1930, జూన్ 2న ఆయన జన్మించారు. కార్మిక సంఘాల నేతగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన జనతా పార్టీ సహకారంతో మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం బీజేపీలో చేరి మధ్యప్రదేశ్‌లో బీజేపీ విస్తరించడానికి కృషి చేశారు. గోవింద్‌పురా అసెంబ్లీ స్థానం నుంచి బాబులాల్ 10 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వయసు పైబడటంతో 2018 నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2018లో ఆయన కోడలు కృష్ణాగౌర్ గోవింద్‌పురా నుంచి పోటీ చేసి విజయం సాధించారు. -
బీజేపీ మాజీ సీఎంకు టికెట్ ఆఫర్ చేసిన కాంగ్రెస్
భోపాల్ : రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీని గద్దె దించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం మరింత ఉత్సాహంగా సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో బీజేపీ నాయకులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నాయకుడు బాబులాల్ గౌర్ చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకుడు దిగ్విజయ్ సింగ్.. తనను భోపాల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయమని కోరినట్లు బాబులాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ నన్ను కలిశారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున భోపాల్ నుంచి పోటి చేయమని కోరిన’ట్లు బాబులాల్ తెలిపారు. అయితే ఈ విషయం గురించి ఇప్పుడే ఏమి చెప్పలేనని.. ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని దిగ్విజయ్‌తో చెప్పినట్లు తెలిపారు బాబులాల్. మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో భంగపడిన బీజేపీ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు కోసం కొత్త వ్యూహాలు రచిస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భాగంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సీనియర్లను పక్కన పెట్టాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. గెలిచే అవకాశం ఉన్నవారికే టికెట్ ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్లు తెలిస్తోంది. -
మహిళ పట్ల మంత్రి అసభ్య ప్రవర్తన
భోపాల్: ఆయన వయస్సు 85 ఏళ్లు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు మంత్రిగా చేస్తున్నారు. కానీ ఆయన ఓ మహిళను అసభ్యంగా తాకారనే వివాదం ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో పెనుదుమారం రేపుతున్నది. మధ్యప్రదేశ్ మంత్రి బాబూలాల్ గౌర్ మహిళను అసభ్యంగా తాకుతున్నట్టు కెమెరా కంటికి చిక్కింది. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండటంతో పెద్ద వివాదమే రేపుతున్నది. అయితే మంత్రి బాబూలాల్ ఆ వీడియోలో ఏమాత్రం నిజం లేదని, తానెలాంటి తప్పు చేయలేదని చెప్తున్నారు. ఆయన గురువారం బార్ఖేదా నాథ్ ప్రాంతంలో బీజేపీ కార్యకర్తల బస్సును జెండా ఊపి ప్రారంభించారు. బీజేపీ కార్యకర్తలు బస్సు ఎక్కుతున్న సందర్భంగా ఆయన ఓ మహిళను వెనుకవైపు నుంచి చేయితో కొట్టడం కెమెరా కంటికి చిక్కింది. ఆయన కావాలనే మహిళను తాక్కినట్టు ఈ వీడియోలో కనిపించడం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో మధ్యప్రదేశ్ న్యూస్ చానెళ్లలోనూ ఇదే వివాదం ప్రముఖంగా ప్రసారమవుతున్నది. అయితే ఈ వివాదంపై స్పందించిన మంత్రి బాబూలాల్ 'మహిళలు తొందరగా బస్సు ఎక్కేలా నేను ప్రోత్సహించాను. వాళ్ల కోసమే నేను ఇది చేశాను. అంతేకానీ వీడియోలో కనిపించినదానిలో నిజం లేదు' అని వివరణ ఇచ్చారు. అయితే 85 ఏళ్ల బాబూలాల్‌కు వివాదాలు కొత్త కాదు. తనదైన పంచ్ డైలాగులతో కామెంట్లు చేసి గతంలోనూ ఆయన బీజేపీని ఇరకాటంలో నెట్టారు. పదిసార్లు ఎమ్మెల్యే అయిన బాబూలాల్ మద్యం తాగడం ప్రజల మౌలిక హక్కు అని, స్టేటస్ సింబల్ అని గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
'తాగడం ప్రాథమిక హక్కు'
భోపాల్: ''మద్యం తాగడం ప్రాథమిక హక్కు. అదొక స్టేటస్ సింబల్. మద్యం తాగినంత మాత్రాన నేరాల సంఖ్య పెరగదు. ఎందుకంటే తాగిన తర్వాత వారు విచక్షణ కోల్పోతారు. ఇక నేరాలు ఎలా చేస్తారు.. విడ్డూరం కాకపోతేనూ....'' ఈ మాటలు అన్నది మరెవ్వరో కాదు. సాక్షాత్తూ మధ్యప్రదేశ్ హోం మంత్రి బాబూలాల్ గౌర్. ''మరీ విపరీతంగా తాగకండి.. ఇది మన ప్రాథమిక హక్కు.. మన గౌరవానికి సంబంధించిన అంశం'' అంటూ ఒక ఉచిత సలహా కూడా పడేశారట. రాష్ట్రంలో మద్యం అమ్మకాల సమయాన్ని పొడిగించడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా బాబూలాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఈయనే గతంలో మహిళలపై జరుగుతున్నఅత్యాచారాలకు ప్రభుత్వం బాధ్యత వహించదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మహిళా సంఘాల ఆగ్రహానికి గురయ్యారు. తమిళనాడు మహిళలు నిండుగా బట్టలు కట్టుకుంటారు అందుకే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే వారిపై హింస, నేరం కేసులు తక్కువగా నమోదవుతున్నాయని గతంలో కామెంట్ చేశారు. ఒక రష్యన్ మహిళనుద్దేశించి అనుచితంగా వ్యాఖ్యానించి విమర్శల పాలయ్యారు. -
'ఐటెం సాంగ్స్ వల్లే అత్యాచారాలు'
పుణ్యధరిత్రిలో పడతులపై అత్యాచారాలకు అంతేలేకుండా పోతోంటే, పాశుపతాస్త్రం లాంటి కఠిన చట్టాలతో మానవ మృగాలకు కళ్లాలు వేయాల్సిన పాలకులు చేతులు ముడుచుకూర్చున్నారు. తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు వంకలు వెతుకుతూ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. దేశంలో అతిపెద్ద రాష్ట్రంగా కొనసాగుతున్న ఉత్తరప్రదేశ్ లో ఆగకుండా జరుగుతున్న అత్యాచారాల పర్వంపై పాలకగణం చేస్తున్న వ్యాఖ్యలు వారి బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతున్నాయి. యూపీ పాలకుడు అఖిలేష్ యాదవ్, ఆయన తండ్రి ములాయం సింగ్ యాదవ్ ఇప్పటికే పలు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. వీరిని బీజేపీ నేత, మధ్యప్రదేశ్ హోం మంత్రి బాబూలాల్ గౌర్ వెనుకేసుకురావడం పాలకశ్రేణుల దిగజారుడుతనాన్ని కళ్లకుగడుతోంది. ఏ ప్రభుత్వమూ అత్యాచారాల్ని నిరోధించలేదని, ఆ ఘటన జరిగిన తరువాతే చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుందంటూ యాదవ్ ద్వయాన్ని వెనుకేసుకొచ్చారు. అక్కడితో ఆగకుండా.. రేప్ అనేది కొన్నిసార్లు ఒప్పవుంది, కొన్నిసార్లు తప్పువుతుదంటూ వివాదస్పద వాఖ్యలు చేశారు. అత్యాచారం అనేది ఒక సామాజిక నేరమని.. అది స్త్రీ, పురుషులపై ఆధారపడి ఉంటుందన్నారు. పురుషుడు మానసిక సమతుల్యం తప్పినప్పుడే అత్యారానికి పాల్పడతాడని విశ్లేషించారు. మహిళలు కరాటే, జూడో లాంటి స్వీయరక్షణ విద్యలు నేర్చుకోవాలని ఉచిత సలహాయిచ్చారు. సినిమాల్లోని ఐటం నెంబర్ పాటల వల్ల కూడా వతావరణం పాడవుతోందని తెగ బాధపడిపోయారు. సినిమాలు, టీవీల్లోని అంగాంగ ప్రదర్శనలు కూడా అత్యాచారాలకు కారణమవుతున్నాయన్నది మంత్రిగారి ఉవాచ. గౌర్ బాధ్యతారహిత వ్యాఖ్యలపై వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. -
అత్యాచారాల నిరోధానికి వారేం చేయగలరు?
న్యూఢిల్లీ: బాదౌన్ హత్యాచార ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ఆయన తండ్రి ములాయంను బీజేపీ నేత, మధ్యప్రదేశ్ హోంమంత్రి బాబూలాల్ గౌర్ వెనకేసుకొచ్చారు. తండ్రీకొడుకులను ఆయన నిస్సహాయులుగా వర్ణించారు. అత్యాచారాల నిరోధానికి వారేం చేయగలరు అంటూ ఎదురు ప్రశ్నించారు. పురుషుడు మానసిక సమతుల్యం తప్పినప్పుడే అత్యాచారానికి పాల్పడతాడని సూత్రీకరించారు. గత నెల 27న ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ సమీపంలో కాట్రా గ్రామంలో అక్కాచెల్లెళ్లు అయిన ఇద్దరు బాలికలపై కిరాతకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వారిని చెట్టుకు ఉరేసి ప్రాణాలను బలి తీసుకున్నారు.