Madhya Pradesh: చౌహాన్ చరిష్మా.. బీజేపీ ఘన విజయానికి కారణాలివే.. | Madhya Pradesh Election Results 2023: Here's The List Of 5 Key Factors That Helped For BJP Historic Win - Sakshi
Sakshi News home page

Madhya Pradesh Election Results: చౌహాన్ చరిష్మా.. బీజేపీ ఘన విజయానికి కారణాలివే..

Published Sun, Dec 3 2023 10:27 PM | Last Updated on Mon, Dec 4 2023 12:11 PM

madhya pradesh election results 2023 key factors helped for bjp historic win - Sakshi

మధ్యప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. తన అత్యుత్తమ రాజకీయ విజయాలలో ఒకటిగా నమోదు చేసుకుంది. ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీని చావుదెబ్బ  కొట్టిన విజయంగా దీన్ని రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. అయితే మధ్యప్రదేశ్‌లో బీజేపీ రికార్డు విజయానికి దోహదం చేసిన ఐదు కీలక అంశాలు ఉన్నాయి. 

క్షేత్రస్థాయిపై పట్టు
ఆటుపోట్లను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి, కేంద్ర మంత్రులతో సహా అనేక మంది ప్రాంతీయ నేతలు, ఎంపీలను ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం ఉందని బీజేపీ ప్రారంభంలోనే అర్థం చేసుకుంది. అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో తీవ్రమైన గ్రౌండ్ వర్క్‌ చేశారు. కేంద్ర మంత్రులతో సహా అనేక మంది ప్రాంతీయ నేతలు, ఎంపీలు ఎన్నికలలో పోటీ చేశారు. 

'లాడ్లీ బహ్నా' పథకం
శివరాజ్ సింగ్ చౌహాన్ తన ప్రభుత్వ పథకాలు, ముఖ్యంగా 'లడ్లీ బహనా' పథకం చుట్టూ బీజేపీ తన ప్రచారాన్ని నడిపించింది. మధ్యప్రదేశ్‌లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళలకు నెలవారీ ఆర్థిక సాయం అందించే 'లాడ్లీ బెహనా' పథకాన్ని ప్రారంభించిన బీజేపీ మహిళా కార్డు అధికార పార్టీకి బాగా పనిచేసినట్లు కనిపిస్తోంది.

సామాన్యులకు అందుబాటులో చౌహాన్‌
సామాన్యులకు అందుబాటులో ఉండే ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్‌కు పేరుంది. ఆయన్ను ఇక్కడి ప్రజలు 'మామా'గా పిలుచుకుంటారు. 

బీజేపీ సంస్థాగత బలం
బీజేపీ సంస్థాగత బలం, దాని హిందుత్వ కార్డు, ప్రధానమంత్రి అభివృద్ధి మంత్రం, ప్రచారంలో జాతీయ అహంకారం గురించి మాట్లాడటం బీజేపీకి బాగా పనిచేసినట్లు కనిపించింది.

ప్రభావవంతమైన పోల్ వ్యూహం
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భోపాల్‌లో మోదీ ప్రారంభించిన ‘మేరా బూత్ సబ్సే మజ్‌బూత్’ ప్రచారం బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి దోహదపడిందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement