Factors trigar
-
ఆదాయాన్ని నిర్ధారించేవి.. ఈ మూడే..
మీ ట్యాక్సబుల్ ఆదాయాన్ని నిర్ధారించేవి ముఖ్యంగా మూడు అంశాలు. అవేంటంటే.. 1. రెసిడెన్షియల్ స్టేటస్ 2. ఆదాయం వచ్చే సమయం 3. ఆదాయానికి మూలం (సోర్స్) ఇక వివరాల్లోకి వెళ్దాం.1. రెసిడెన్షియల్ స్టేటస్ .. ఆదాయపు పన్ను చట్టంలో పన్ను భారాన్ని నిర్ధారించేది మీ రెసిడెన్షియల్ స్టేటస్ .. అంటే మీరు భారత్‌లో ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఎన్ని రోజులు ఉన్నారనే విషయం. పౌరసత్వానికి, పన్ను భారానికి ఎటువంటి సంబంధం లేదు. పౌరుడైనా, పౌరుడు కాకపోయినా ఆ వ్యక్తి స్టేటస్ .. అంటే ఇండియాలో ఎన్ని రోజులున్నాడనే అంశంపై ఆధారపడి ఉంటుంది.ఆదాయానికి మూలం కింద .. జీతం, ఇంటి మీద అద్దె, వ్యాపారం మీద ఆదాయం .. మొదలైనవి ఉంటాయి. ఈ స్టేటస్ ప్రతి సంవత్సరం మారొచ్చు. మారకపోవచ్చు. అందుకని ప్రతి సంవత్సరం ఈ షరతుని లేదా పరిస్థితిని లేదా కొలబద్దని కొలవాలి. లెక్కించాలి. వ్యక్తి విషయానికొస్తే.. 182 రోజులు లేదా అంతకన్నా ఎక్కువ రోజులుంటే, అటువంటి వ్యక్తిని రెసిడెంట్ అంటారు. సాధారణంగా మనందరం రెసిడెంట్లమే.మరో ప్రాతిపదిక ఏమిటంటే, గడిచిన నాలుగు సంవత్సరాల్లో 365 రోజులు లేదా పైగా ఉంటూ, ఆ ఆర్థిక సంవత్సరంలో 60 రోజులు ఉండాలి. ఇలాంటి వ్యక్తిని రెసిడెంట్ అంటారు. ఈ లెక్కింపులకు మీ పాస్‌పోర్ట్‌లలో ఎంట్రీలు ముఖ్యం. రెసిడెంటుకు, నాన్–రెసిడెంటుకు ఎన్నో విషయాల్లో భేదాలు ఉన్నాయి. మిగతా వారి విషయంలో ఇండియాలో ఉంటూ ‘‘నిర్వహణ, నియంత్రణ’’ చేసే వ్యవధి మీద స్టేటస్ ఆధారపడి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి.2. ఆదాయం ఏర్పడే సమయం సాధారణంగా ఆ ఆర్థిక సంవత్సరంలో మీ చేతికి వచ్చినది, మీరు పుచ్చుకున్నది, మీ ఖాతాలో జమ అయినదాన్ని మీ ఆదాయం అంటారు. దీన్నే రావడం ... అంటే ARISE అంటారు. కానీ చట్టంలో ఒక చిన్న ఇంగ్లీష్ పదం ‘ACCRUE’ మరో అర్థాన్ని సూచిస్తుంది. ‘‘ఆదాయాన్ని’’ నిర్వచించే విధానం చూస్తే, వాడే భాష చూస్తే, ఆదాయ పరిధిని ‘‘వామన అవతారం’’లో ‘‘మూడు అడుగుల’’ను స్ఫురింపచేస్తుంది. ఎన్నో వివరణలు, తీర్పులు, పరిధులు ఉంటాయి. ‘‘ఇందుగలడందు కలడు’’ అనే నరసింహావతారం గుర్తుకు రాక తప్పదు.స్థూలంగా చెప్పడం అంటే మేము ‘సాహసం’ చేయడమే! పాతాళభైరవిలో నేపాల మాంత్రికుడి మాటల్ని స్ఫూర్తిగా తీసుకుంటూ, చేతికొచ్చింది .. చేతికి రావాల్సినది, హక్కు ఏర్పడి రానిది, హక్కు ఉండి అందనిది, ఆదాయంలా భావించేది, భావించతగ్గది, భావించినది, ఆదాయం కాకపోయినా తీసుకోక తప్పనిది (Deemed), కొన్ని సందర్భాల్లో మీకు కలిపేది (Included) అని చెప్పొచ్చు.3. ముచ్చటగా మూడోది..మూలం. అంటే Source. చట్టప్రకారం మనకు ఏర్పడే ఆదాయాల్ని ఐదు రకాలుగా, 5 శీర్షికల కింద వర్గీకరించారు. a) జీతాలు, వేతనాలు b) ఇంటి మీద ఆదాయం c) వ్యాపారం/వృత్తి మీద లాభనష్టాలు d) క్యాపిటల్ గెయిన్స్ e) పై నాలుగింటిలోకి విభజించలేక మిగిలినవి .. ఏ మూలమైనా, ఏ మూల నుంచి వచ్చినా ఈ శీర్షిక కింద పరిగణనలోకి తీసుకుంటారు. అవశేష ఆదాయం అని అనొచ్చు. ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకుని ట్యాక్స్ ప్లానింగ్‌కి శ్రీకారం చుడదాం.పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ–మెయిల్ పంపించగలరు. -
ముస్లిం ఓటు బ్యాంకు ప్రభావమెంత? ఏ పార్టీకి ప్రయోజనం?
2024 లోక్‌సభ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. ఆరు దశల ఓటింగ్ పూర్తయ్యింది. ఏడో దశకు జూన్ ఒకటిన పోలింగ్ జరగనుంది. దేశంలో హిందువుల జనాభా 80 శాతం. ముస్లిం జనాభా 14 శాతం. అసోం, పశ్చిమ బెంగాల్‌లలో అత్యధిక ముస్లిం ఓటు బ్యాంకు ఉంది. ఈ సారి జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ముస్లిం ఓటు బ్యాంకు ప్రభావం ఏ మేరకు ఉండనుంది?గత మూడు లోక్‌సభ ఎన్నికల్లో ముస్లిం ఓట్లకు సంబంధించిన సీఎస్డీఎస్ లోక్‌నీతి అందించిన డేటా ప్రకారం 2009 ఎన్నికలలో బీజేపీకి నాలుగు శాతం ముస్లిం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 38 శాతం ముస్లిం ఓట్లు వచ్చాయి. 58 శాతం ముస్లిం ఓటర్లు ఇతర పార్టీలకు ఓటు వేశారు. 2014 ఎన్నికల్లో బీజేపీకి ఎనిమిది శాతం ముస్లిం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 38శాతం ముస్లిం ఓట్లు, ఇతర పార్టీలకు 54 శాతం ముస్లిం ఓట్లు వచ్చాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఎనిమిది శాతం ముస్లిం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 33 శాతం, ఇతరులకు 59 శాతం ముస్లిం ఓట్లు వచ్చాయి.2014 ఎన్నికల్లో 882 మంది ముస్లిం అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో 23 మంది మాత్రమే విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో 819 మంది ముస్లిం అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో 28 మంది మాత్రమే గెలుపొందారు. 2019 ఎన్నికల్లో 27 మంది ముస్లిం ఎంపీలు పార్లమెంటుకు చేరుకున్నారు.ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అమితాబ్ తివారీ తెలిపిన వివరాల ప్రకారం గత రెండు ఎన్నికలను పరిశీలిస్తే ముస్లిం ఓటర్లు తటస్థంగా మారిపోతున్నారు. ఇందుకు పలు కారణాలున్నాయి. 2014కు ముందు అసోంలో ముస్లిం ఓట్లు కేంద్రీకృతమై ఉండేవి. హిందూ ఓట్లు కులాల ప్రాతిపదికన చెల్లాచెదురయ్యాయి. ఫలితంగా అసోం, యూపీ, బీహార్ రాష్ట్రాల్లో బీజేపీకి తక్కువ సీట్లు వచ్చాయి. 2014, 2019 ఎన్నికలను పరిశీలిస్తే ఈ రాష్ట్రాల్లో బీజేపీకి తొమ్మది సీట్లు వచ్చాయి. మొత్తంగా చూస్తే మైనారిటీ ఆధిపత్య స్థానాల్లో బీజేపీ పరిస్థితి బాగానే ఉందని తివారీ పేర్కొన్నారు. -
Madhya Pradesh: చౌహాన్ చరిష్మా.. బీజేపీ ఘన విజయానికి కారణాలివే..
మధ్యప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. తన అత్యుత్తమ రాజకీయ విజయాలలో ఒకటిగా నమోదు చేసుకుంది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని చావుదెబ్బ కొట్టిన విజయంగా దీన్ని రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. అయితే మధ్యప్రదేశ్‌లో బీజేపీ రికార్డు విజయానికి దోహదం చేసిన ఐదు కీలక అంశాలు ఉన్నాయి. క్షేత్రస్థాయిపై పట్టు ఆటుపోట్లను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి, కేంద్ర మంత్రులతో సహా అనేక మంది ప్రాంతీయ నేతలు, ఎంపీలను ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం ఉందని బీజేపీ ప్రారంభంలోనే అర్థం చేసుకుంది. అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో తీవ్రమైన గ్రౌండ్ వర్క్ చేశారు. కేంద్ర మంత్రులతో సహా అనేక మంది ప్రాంతీయ నేతలు, ఎంపీలు ఎన్నికలలో పోటీ చేశారు. 'లాడ్లీ బహ్నా' పథకం శివరాజ్ సింగ్ చౌహాన్ తన ప్రభుత్వ పథకాలు, ముఖ్యంగా 'లడ్లీ బహనా' పథకం చుట్టూ బీజేపీ తన ప్రచారాన్ని నడిపించింది. మధ్యప్రదేశ్‌లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళలకు నెలవారీ ఆర్థిక సాయం అందించే 'లాడ్లీ బెహనా' పథకాన్ని ప్రారంభించిన బీజేపీ మహిళా కార్డు అధికార పార్టీకి బాగా పనిచేసినట్లు కనిపిస్తోంది. సామాన్యులకు అందుబాటులో చౌహాన్ సామాన్యులకు అందుబాటులో ఉండే ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్‌కు పేరుంది. ఆయన్ను ఇక్కడి ప్రజలు 'మామా'గా పిలుచుకుంటారు. బీజేపీ సంస్థాగత బలం బీజేపీ సంస్థాగత బలం, దాని హిందుత్వ కార్డు, ప్రధానమంత్రి అభివృద్ధి మంత్రం, ప్రచారంలో జాతీయ అహంకారం గురించి మాట్లాడటం బీజేపీకి బాగా పనిచేసినట్లు కనిపించింది. ప్రభావవంతమైన పోల్ వ్యూహం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భోపాల్‌లో మోదీ ప్రారంభించిన ‘మేరా బూత్ సబ్సే మజ్బూత్’ ప్రచారం బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి దోహదపడిందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. -
ఆ అంశాలతో కాంగ్రెస్‌కు కలిసొచ్చేనా?
రాజస్థాన్‌లో అసెంబ్లీ సమరం తుది అంకానికి చేరుకుంది. మరో రెండు రోజుల్లో అక్కడ పోలింగ్ జరగనుంది. ఇరుపక్షాలు తమ ఆధిపత్యాన్ని చాటుకునేలా ప్రచారాలను హోరెత్తించాయి. ఇప్పటి వరకు రాజస్థాన్‌లో ఒకదఫా బీజేపీ, మరోదఫా కాంగ్రెస్‌లు అధికారం చేపడుతూ వచ్చాయి. కానీ, ఆ సంప్రదాయానికి పుల్‌స్టాప్ వేయాలని కాంగ్రెస్.. ఆ సంప్రదాయామే కొనసాగాలని బీజేపీ కోరుకుంటున్నాయి. కానీ, కాంగ్రెస్ అనుహ్యమైన రీతీలో వ్యవహరించింది. అంతర్గత విభేదాలకు చెక్ పెట్టి.. ప్రజలకు ఎన్నో రకాల వెల్ఫైర్ స్కీమ్‌లు అందించి మెజార్టీ ఓట్లను కొల్లగొట్టేలా పావులను కదిపింది. మరి కాంగ్రెస్ మళ్లీ అధికారాన్ని దక్కించుకోగలదా? మైనస్‌గా ఉన్న ప్రతికూల అంశాలు పాజిటివ్‌గా మారి కాంగ్రెస్‌కి విజయాన్ని తెచ్చిపెడతాయా? విశ్లేషిస్తే.. రాజస్థాన్‌లో మరోసారి అధికారంలో పాగావేసేందుకు యత్నిస్తున్న కాంగ్రెస్‌కు కొన్ని సవాళ్ల తోపాటు అనుకూల అంశాలు కూడా ఉన్నాయి. ప్రతి ఐదేళ్లకొకసారి ప్రభుత్వాలు మారుతున్న రాజస్థాన్‌లో చరిత్రను తిరిగే రాసేలా.. కాంగ్రెస్ శతవిధాల యత్నించింది. కానీ ఆ ఆ పార్టీకి ప్రతికూలాంశాల నడుమ సవాళ్లు ఎదురయ్యాయి. ఎగ్జామ్ పేపర్ లీకేజ్.. కాంగ్రెస్ నేతృత్వంలోని విద్యామంత్రిగా ఉన్న గోవింద్ సింగ్ దోతస్రా సారథ్యంలో జరిగిన పేపర లీకేజ్‌లు, పరీక్షల రద్దు, అరెస్టులు తదితరాలు విద్యావ్యవస్థ పరంగా కాంగ్రెస్‌కి అతి పెద్ద మాయని మచ్చ అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పేపర్ లీక్ కుంభకోణం కాంగ్రెస్ రాజకీయ భవితవ్యాన్ని పూర్తిగా మార్చేసే ప్రమాదం ఉందని అంటున్నారు. ఈ అంశమే కాంగ్రెస్‌కి మైనస్ అయ్యి..ప్రజలు అధికారం పట్టకట్టాలా? లేదా అనే మీమాంసంలో పడే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతర్గత విభేదాలు.. కాంగ్రెస్‌లో తరచుగా తెరపైకి అంతర్గత విభేధాలు తారస్థాయిలో వచ్చాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ల మధ్య నువ్వా-నేనా? అనే స్థాయికి వచ్చాయి. ఆఖరికి సొంత పార్టీలో తిరుగుబాటు జెండా ఎగురవేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు సచిన్. ఆఖరికి తమ అధికార పార్టీ పాలనే బాగోలేదంటూ సచిన్ బయటకు వచ్చి మరీ నిరాహారదీక్ష చేపట్టి అందర్నీ విస్తుపోయాలా చేశారు. చివరికి కాంగ్రోస్ అధిష్టానం దిగొచ్చి జోక్యం చేసుకునేంత వరకు అంతర్గత విభేదాలు సద్దుమణగలేదు. ఇది ఒకరంగా ప్రజలకు భరోసా ఇవ్వలేని కాంగ్రెస్ పాలన అనే సందేహాలకు తావిచ్చిందనేది విశ్లేషకుల అభిప్రాయం. అవినీతి, అల్లర్లు, నేరాలు.. ముఖ్యంగా రిక్రూట్మెంట్లో జరిగిన అవతవకలు పాలనలోని డొల్లతనాన్ని చూపాయి. పారదర్శకతకు తిలోదకాలు వదిలి రాష్ట్రంలో అల్లర్లు చెలరేగేందుకు కారణమైంది. పైగా గహ్లోత్ ప్రభుత్వం వాటిని నియంత్రించడంలో విఫలమైంది కూడా. ఇక మహిళలకు భద్రత లేకపోవడం, విపరితంగా పెరిగిన నేరాలు, నిరుద్యోగం, వ్యవసాయ కష్టాలు తదితరాలు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దిగజార్చాయి. ఇవే ప్రజల్లో కాంగ్రెస్ పట్ల తీవ్ర అసంతృప్తిని పెంచేందుకు దోహదం చేస్తుందని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక అనుకూలమైన విషయాల వద్దకు వస్తే ఎన్నికలు సమీపిస్తుండగా ఒకరంటే ఒకరికి పడని గహ్లోత్, సచిన్ పైలట్ ఊహించని రీతిలో ఐక్యతను చాటడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక పైలెట్ కూడా తమ పార్టీ ఐక్యతను చాటి చెప్పలా ఆయన ప్రవర్తన తీరు తోపాటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఊహకందని రీతిలో కాంగ్రెస్ వెల్ఫైర్ స్కీమ్‌లు, గ్యారంటీలు వంటి హామీలతో రసవత్తరంగా దూసుకొచ్చింది. కాంగ్రెస్‌పై సానుకూల పవనాలు వీచేలా తన తీరుని మార్చి బీజేపీనే విస్తుపోయేలా చేసింది. ఈ గ్యారంటీ గేమ్, కాంగ్రెస్ వ్యూహం ఎంతవరకు ప్లస్ అవుతుందా? వాటిల్లో కాంగ్రెస్‌కి ఎంతవరకు సానూకూల అంశాలు ఉన్నాయి అంటే.. సానూకూలమైన అంశాలు యునైటెడ్ ఫ్రంట్ అశోక్ గెహ్లోత్, సచిన్ పైలట్లు తామెప్పుడూ ఒకటేనని పార్టీని నిలబెట్లుకోవడమే లక్ష్యం అని ప్రకటించారు. అలాగే సచిన్ పైలట్ కూడా రాజస్తాన్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలోకి తనను పిలవకపోయినా పట్టించుకోలేదు. గహ్లోత్ ఒక్కరే అన్ని తానై పార్టీని నడిపిస్తున్నట్లు ప్రచారం చేసుకున్న సంయమనాన్ని పాటించి సచిన్ అందర్నీ ఆకర్షించారు. ఇక వరుసగా రాజస్తాన్‌లో కాంగ్రెస్ ఎందుకు గెలవడం లేదో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని పార్టీకి సూచించారు. అదే సమయంలో తమ పార్టీ గెలుస్తుందని కూడా ధీమాగా చెప్పి తామంత ఐక్యంగా ఉన్నామని చెప్పకనే చెప్పారు. పైగా గతంలో చేసిన వ్యాఖ్యల విషయం కూడా రాజకీయ పరంగా వచ్చినవే "క్షమించడం, మరచిపోవడం" అనే మంత్రాలని పాటిస్తున్నానంటూ నాయకులు ఐక్యతకు పీఠం వేశారు. ఇది ఒకరకంగా కాంగ్రెస్‌కి ప్లస్ అవ్వొచ్చు. పైగా తన తీరుని మార్చుకుని ప్రజలకు సుపరిపాలన ఇచ్చే దిశగా కాంగ్రెస్ తన గత వైభవాన్ని తీసుకొస్తుందనే ఆలోచన ప్రజలకు కలిగించింది. ఓట్లును కొల్లగొట్టేందుకు ఇది మంచి సానుకూలం అంశమే అని చెబుతున్నారు విశ్లేషకులు. గ్యారంటీల గేమ్ అశోక్ గహ్లోత్ ఓటర్లను ఆకర్షించేలా.. ఏడు గ్యారంటీలు, పాత పెన్షన్ స్కీమ్, మహిళలకు రూ.10 వేల భృతి మొదలుకుని రూ.25 లక్షల వైద్య సాయం దాకా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న, అందించబోయే పథకాలను ముమ్మరంగా ప్రచారం చేశారు. ఓటర్లను ప్రసన్నం చేసుకనేలా సుడిగాలిలో రాష్టం అంతటా పర్యటించారు. తన హామీలు ప్రజల్లో బలంగా నాటుకునేలా చేసే ప్రయత్నాలు కూడా ఓటర్లను ప్రభావితం చేసి కాంగ్రెస్‌కి గెలుపులో కీలకం అవ్వోచని భావిస్తున్నారు విశ్లేషకులు. కాంగ్రెస్ ఓటర్ల నాడికి తగ్గట్టుగా వ్యూహం మార్చి తన ముందున్న సవాళ్లను సానూకూలంగా మార్చుకుంటూ ప్రత్యర్థులనే షాక్ గురి చేసింది. ఎలాంటి స్కీమ్, హామీలు ప్రజల్లోకి చేరతాయి, ఏ విధంగా పాలనలో మార్పులు చేయాలనే దిశగా అడగులు వేస్తూ గెలుపే లక్ష్యం దూసుకుపోతుంది. బీజేపీ వ్యూహం ఇలా.. ఇదిలా ఉండగా బీజేపీనేమో కాంగ్రెస్ మైనస్‌లను హైలెట్ చేస్తూ ప్రజల్లో వెళ్లింది. అలాగే రాజస్థాన్‌లో ఆనవాయితీగా ఒకసారి గెలిచిన పార్టీ మరోసారి గెలవదనే సెంటిమెంట్‌ను బీజేపీ నమ్ముతూ.. విజయావకాశాలపై ధీమాతో ఉంది. పైపెచ్చు.. తాము అధికారంలో ఉండగా రాజస్థాన్‌కి చేసిన నిధుల కేటాయింపు ఓటర్లకు గుర్తుచేస్తూ.. వాళ్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించింది. అన్నింటికంటే ముఖ్యంగా.. కాంగ్రెస్‌లోని ఐక్యత లోపాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని ప్రచారంలో దూసుకెళ్లింది. ఈ తరుణంలో.. ఓటర్ తీర్పు.. అందునా కొత్తగా ఓటు హక్కును వినియోగించుకునే వాళ్ల నిర్ణయం ఎలా ఉండబోతుందా? అనేది తెలియాలంటే డిసెంబర్ 3వ తేదీదాకా వేచి చూడాల్సిందే. (చదవండి: కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలన్నీ బౌండరీలు దాటేశాయి! అమిత్ షా!) -
మెడనొప్పి చేతికి పాకుతూ ఉంటే..?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 23. ఇటీవల తీవ్రమైన పార్శ్వపు నొప్పి వస్తోంది. దీనికి హోమియోలో చికిత్స సూచించండి. - మహేశ్వరి, నిర్మల్ పార్శ్వపునొప్పి ఒక దీర్ఘకాలికమైన నరాలకు సంబంధించిన వ్యాధి. తలలో ఒకవైపు నొప్పి రావడం ఈ వ్యాధికి సంబంధించిన సాధారణ లక్షణం. ఇది మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే వికారం, ఒక్కోసారి వాంతులు, వెలుతురునూ, శబ్దాలను భరించలేకపోవడం మరికొన్ని లక్షణాలు. శారీరక శ్రమతో తలనొప్పి పెరుగుతుంది. నొప్పి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ప్రశాంతంగా నిద్రించడం వల్ల నొప్పి నుంచి కొంత ఉపశమనం ఉంటుంది. పార్శ్వపునొప్పికి కచ్చితమైన కారణాల నిర్ధారణ జరగలేదు. అయితే కొన్ని అంశాలు ఈ నొప్పికి దారితీయవచ్చు. జన్యుపరమైన కారణాలు, మానసిక ఒత్తిడి వంటివి ముఖ్యమైన కారణాలుగా భావించవచ్చు. అయితే ప్రత్యేక కారణాల నిర్ధారణ జరగనప్పటికీ నొప్పిని తీవ్రతరం చేసే అంశాలు ఉంటాయి. వీటిని ట్రిగర్ ఫ్యాక్టర్స్ అంటారు. ఇవి నొప్పిని ప్రేరేపించవచ్చు. అవి... విపరీతమైన ఆకలి, నీరసం, శారీరక శ్రమ, మహిళలల్లో హార్మోన్ హెచ్చుతగ్గులు, రుతుక్రమం, కుటుంబ నియంత్రణ మందులు వాడటం మొదలైనవి. నొప్పి ప్రారంభం కాబోయే ముందు కొన్ని దశలు కనిపిస్తాయి. అవి... 1. ప్రోడ్రోమల్ స్టేజ్: ఇది నొప్పి ఆరంభం కావడానికి రెండు రోజుల ముందు నుంచి రెండు గంటల ముందు కనిపిస్తుంది. మానసిక ఆందోళన, చిరాకు, కోపం, ప్రత్యేకమైన ఆహారంపట్ల పెరిగే ఇష్టం, కండరం బిగబట్టడం (ముఖ్యంగా మెడ కండరాలు), మలబద్దకం లేదా విరేచనాలు వంటి లక్షణాలు ఈ దశలో కనిపిస్తాయి. 2. ఆరా స్టేజ్: చూపు మసగ్గా ఉండటం, చేయి లేదా భుజం దగ్గర పొడిచినట్లుగా ఉండటం వంటి లక్షణాలు ఈ దశలో ఉంటాయి. 3. నొప్పి దశ: తలలోని ఏదో ఒక పక్క నుంచి నొప్పి ఆరంభమవుతుంది. క్రమేణా తీవ్రమవుతుంది. సాధారణంగా ఇది 4 నుంచి 72 గంటల పాటు ఉంటుంది. వికారంతో కూడిన వాంతులు, కాంతిని భరించలేకపోవడం, శబ్దాలను తట్టులేకపోవడం వంటి లక్షణాలు ఉండి, చికటి గదిలో విశ్రాంతి తీసుకోవడం వల్ల తలనొప్పి కొంత తగ్గవచ్చు. 4. పోస్ట్ డ్రోమ్ దశ: తలనొప్పి తీవ్రత తగ్గిన తర్వాత ఉండే స్థితి ఇది. దీనిలో నీరసం, జీర్ణాశయ సంబంధ సమస్యలు, మానసిక అలజడి తదితర లక్షణాలు కనబడతాయి. హోమియో విధానంలో పార్శ్వపునొప్పికి చక్కటి వైద్యం అందుబాటులో ఉంది. బెల్లడోనా, నక్స్‌వామికా, సాంగ్యునేరియా, ఐరస్ వెరిసికోలర్ లాంటి చాలా రకాల మందులు సమర్థంగా పనిచేస్తాయి. డాక్టర్ టి. కిరణ్ కుమార్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్ ఫిజియోథెరపీ కౌన్సెలింగ్ నా వయసు 45 ఏళ్లు. ఇటీవల మెడ నొప్పి వస్తూ, అది చేతికి పాకుతుంటే డాక్టర్‌ను సంప్రదించాను. మెడలోని వెన్నుపూసలు చేతికి వెళ్లే నరాలను నొక్కడం వల్ల ఇలా జరుగుతోందని చెప్పారు. ఫిజియోథెరపీతో పాటు ఇంటర్ఫెరిన్షియల్ థెరపీ తీసుకొమ్మని సూచించారు. ఫిజియోథెరపీ, ఇంటర్‌ఫెరెన్షియల్ థెరపీలో అవలంబించే ప్రక్రియల గురించి వివరించండి. - జీవన్, హైదరాబాద్ మీ మెడలోని వెన్నుపూసలు చేతికి వెళ్లే నరాన్ని మూలం (రాడికిల్)లో నొక్కుతున్నందు వల్ల మీ మెడలోనూ, చేతిలోనూ నొప్పి వస్తోంది. ఫిజియోథెరపిస్టులు చేయించే కొన్ని రకాల వ్యాయామాల వల్ల మెడ కండరాలు బలంగా రూపొందుతాయి. మెడ కండరాలను బలంగా అయ్యేలా చేసే ఈ వ్యాయామాల వల్ల తల భారమంతా వెన్నుపూసలపై పడకుండా చేయవచ్చు. ఆ భారాన్ని వెన్నుపూసలకు బదులు, మెడకండరాలు తీసుకోవడం వల్ల నరం నొక్కుకుపోవడం కూడా తగ్గుతుంది. దీంతోపాటు మెడ కండరాలపై అసమతౌల్యమైన రీతిలో భారం పడకుండా ఉంచుకోవడం ఎలాగో, సరైన పోశ్చర్ ఏమిటో కూడా ఫిజియోథెరపిస్టులు చెబుతారు. అంటే కంప్యూటర్ చూస్తున్నప్పుడు, ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మెడను నిటారుగా ఉంచకుండా... ఒకపక్కకు వంచడం వంటివి చేయ ఒత్తిడి పడకుండా చూసుకోవడం వంటి జాగ్రత్తలను వివరిస్తారు. ఇక ఇంటర్‌ఫెరెన్షియల్ థెరపీ (ఐఎఫ్‌టీ)లో ఒకరకమైన విద్యుత్తరంగాలను ఉపయోగించి నొప్పి నివారణ జరిగేలా చూస్తారు. అయితే ఒంటిపై గాయం, పుండు ఉన్నవాళ్లకు ఈ చికిత్స చేయరు. ఇక అల్ట్రాసోనిక్ థెరపీలో శబ్దతరంగాలను ఉపయోగించి నొప్పి నివారణ జరిగేలా చూస్తారు. వాటితో పాటు మెడపైన వేడి నీటి కాపడం, ఐస్ కాపడం (హాట్ ప్యాక్, కోల్డ్ ప్యాక్) వంటి ప్రక్రియలను కూడా ఫిజియోథెరపిస్ట్‌లు అనుసరిస్తూ నొప్పి నుంచి ఉపశమనం కలిగించేందుకు ప్రయత్నిస్తారు. ఎన్. మేరీ ఫిజియోథెరపిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ డర్మడాలజీ కౌన్సెలింగ్ నా వయసు 33 ఏళ్లు. రెండు రోజుల క్రితం పొరపాటున వేడిగా ఉన్న పాత్రను చేత్తో పట్టుకున్నాను. వేడిగా ఉందని చూసుకోకపోవడంతో బాగా కాలాయి. బొబ్బలు కూడా వచ్చాయి. అప్పుడు వాటిపై మచ్చలు పడతాయని ఆందోళనగా ఉంది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. - సురేఖ, తెనాలి మీ అరచేతుల్లో బొబ్బలు వచ్చాయంటే ఆ తీవ్రత సెకండ్ డిగ్రీ బర్న్స్‌ను సూచిస్తోంది. ఒకవేళ ఈ బొబ్బలు చాలా పెద్దవిగా ఉంటే మీరు దగ్గర్లోని డర్మటాలజిస్ట్‌ను కలిసి, క్రమం తప్పకుండా డ్రస్సింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు మీరు మూడు రోజుల పాటు అజిథ్రోమైసిన్ వంటి యాంటీబయాటిక్స్ కూడా వాడాల్సి ఉంటుంది. ఇక గాయాలపై రోజుకు రెండుసార్లు మ్యూపిరోసిన్ అనే యాంటీబయాటిక్ పూతమందు వాడాలి. ఇది వారంరోజుల పాటు పూయాల్సి ఉంటుంది. మీ బొబ్బలు ఆ తర్వాత మచ్చలుగా మారకుండా ఉండాలంటే సిల్వర్ సల్ఫాడైజీన్తో పాటు మైల్డ్ కార్టికోస్టెరాయిడ్ వాడాల్సి ఉంటుంది. గాయం మానిన తర్వాత కూడా మచ్చలు వస్తే క్లిగ్మాన్స్ రెజీమ్ వంటి స్కిన్ లెటైనింగ్ క్రీమ్స్‌ను రెండుమూడు వారాలపాటు వాడాల్సి ఉంటుంది. ఆ తర్వాత కోజిక్ యాసిడ్, ఆర్బ్యుటిన్, నికోటినమైడ్ వంటివి ఉన్న నాన్‌స్టెరాయిడ్ క్రీమ్స్ వాడాల్సి ఉంటుంది. ఆ తర్వాత కూడా మచ్చలు వస్తే ఫ్రాక్షనల్ లేజర్ లేదా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుంది. నా వయసు 40 ఏళ్లు. నా కుడిచెంప మీద మూడువారాల క్రితం ఒక మొటిమ వచ్చింది. దాన్ని చిదిమేయడానికి ప్రయత్నించాను. అప్పట్నుంచి దాని పరిమాణం పెరిగి నల్ల మచ్చలా మారిపోయింది. నాకు తగిన సలహా ఇవ్వండి. - రాంబాబు, హైదరాబాద్ మీరు చెప్పిన లక్షణాలను బట్టి అది ‘యాక్నే వల్గారిస్’అలా అనిపిస్తోంది. దాన్ని గిల్లకండి. అలా చేస్తే ఇన్ఫెక్షన్ మరింత పెరిగే అవకాశం ఉంది. మీరు కొన్నిరోజులు అజిథ్రోమైసిన్ 500 ఎంజీ వంటి యాంటీబయాటిక్ మాత్రలను మూడురోజులకు ఒకసారి చొప్పున మూడు వారాల పాటు వాడాలి. అలాగే క్లిండామైసిన్, అడాపలిన్ కాంబినేషన్ ఉండే జెల్‌ను రోజూ రాత్రివేళ మొటిమపై రాయండి. ఎస్పీఎఫ్ 40 లేదా అంతకంటే ఎక్కువగా ఉన్న సన్‌స్క్రీన్‌లోషన్‌ను ప్రతి మూడు గంటలకోసారి చొప్పున ప్రతిరోజూ ముఖంపై రాసుకోండి. డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ చీఫ్ డర్మటాలజిస్ట్, త్వచ స్కిన్ క్లినిక్, గచ్చిబౌలి, హైదరాబాద్