2024 లోక్‌సభ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. ఆరు దశల ఓటింగ్ పూర్తయ్యింది. ఏడో దశకు జూన్ ఒకటిన పోలింగ్ జరగనుంది. దేశంలో హిందువుల జనాభా 80 శాతం. ముస్లిం జనాభా 14 శాతం. అసోం, పశ్చిమ బెంగాల్‌లలో అత్యధిక ముస్లిం ఓటు బ్యాంకు ఉంది. ఈ సారి జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ముస్లిం ఓటు బ్యాంకు ప్రభావం ఏ మేరకు ఉండనుంది?
గత మూడు లోక్‌సభ ఎన్నికల్లో ముస్లిం ఓట్లకు సంబంధించిన సీఎస్‌డీఎస్ లోక్‌నీతి అందించిన డేటా ప్రకారం 2009 ఎన్నికలలో బీజేపీకి నాలుగు శాతం ముస్లిం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 38 శాతం ముస్లిం ఓట్లు వచ్చాయి. 58 శాతం ముస్లిం ఓటర్లు ఇతర పార్టీలకు ఓటు వేశారు. 2014 ఎన్నికల్లో బీజేపీకి ఎనిమిది శాతం ముస్లిం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 38శాతం ముస్లిం ఓట్లు, ఇతర పార్టీలకు 54 శాతం ముస్లిం ఓట్లు వచ్చాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఎనిమిది శాతం ముస్లిం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 33 శాతం, ఇతరులకు 59 శాతం ముస్లిం ఓట్లు వచ్చాయి.
2014 ఎన్నికల్లో 882 మంది ముస్లిం అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో 23 మంది మాత్రమే విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో 819 మంది ముస్లిం అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో 28 మంది మాత్రమే గెలుపొందారు. 2019 ఎన్నికల్లో 27 మంది ముస్లిం ఎంపీలు పార్లమెంటుకు చేరుకున్నారు.
ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అమితాబ్ తివారీ తెలిపిన వివరాల ప్రకారం గత రెండు ఎన్నికలను పరిశీలిస్తే ముస్లిం ఓటర్లు తటస్థంగా మారిపోతున్నారు. ఇందుకు పలు కారణాలున్నాయి. 2014కు ముందు అసోంలో ముస్లిం ఓట్లు కేంద్రీకృతమై ఉండేవి. హిందూ ఓట్లు కులాల ప్రాతిపదికన చెల్లాచెదురయ్యాయి. ఫలితంగా అసోం, యూపీ, బీహార్ రాష్ట్రాల్లో బీజేపీకి తక్కువ సీట్లు వచ్చాయి. 2014, 2019 ఎన్నికలను పరిశీలిస్తే ఈ రాష్ట్రాల్లో బీజేపీకి తొమ్మది సీట్లు వచ్చాయి. మొత్తంగా చూస్తే మైనారిటీ ఆధిపత్య స్థానాల్లో బీజేపీ పరిస్థితి బాగానే ఉందని తివారీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment