musilm
-
ఈసారి లోక్‌సభలో ముస్లిం ఎంపీలు ఎందరు?
దేశంలోని అన్ని రంగాల్లో ముస్లింల ప్రాతినిధ్యం కనిపిస్తుంది. రాజకీయాల్లోనూ దీనికి మినహాయింపేమీ లేదు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి పోటీచేసిన ముస్లిం అభ్యర్థులలో ఎందరు విజయం సాధించారు? వీరిలో ఏ పార్టీకి లేదా కూటమికి చెందినవారు ఎందరున్నారు?2024 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 24 మంది ముస్లిం అభ్యర్థులు ఎంపీలుగా ఎన్నికయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే ఈ సంఖ్య ఈ ఏడాది రెండుకు తగ్గింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే, వీరిలో ఒక్క ఎంపీ కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకి చెందినవారు లేరు. ఈ 24 మంది లోక్‌సభ ఎంపీలలో 21 మంది ఇండియా అలయన్స్‌కు చెందిన వారే కావడం విశేషం.ఈ జాబితాలో తొమ్మిది మంది ముస్లిం ఎంపీలతో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఐదుగురు ముస్లిం ఎంపీలు ఉన్నారు. నలుగురు ముస్లిం ఎంపీలు సమాజ్‌వాదీ పార్టీకి, ఇద్దరు ఇండియన్ ముస్లిం లీగ్‌కు, ఒకరు నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందినవారున్నారు. అలాగే అసదుద్దీన్ ఒవైసీ ఏఐఎంఐఎంకు చెందిన ముస్లిం ఎంపీ. ఇద్దరు ముస్లిం ఎంపీలు స్వతంత్రులుగా ఎన్నికయ్యారు.ఈసారి లోక్‌సభలో ముస్లింల వాటా కేవలం 4.42 శాతానికి తగ్గింది. 1980 లోక్‌సభ ఎన్నికల్లో అత్యధికంగా 49 మంది ముస్లిం ఎంపీలు విజయం సాధించారు. 1984 లోక్‌సభ ఎన్నికల్లో 45 మంది ముస్లిం ఎంపీలుగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ముస్లిం ఎంపీల సంఖ్య 40కి మించలేదు. 2014లో 11 ప్రధాన పార్టీలు మొత్తం 82 మంది ముస్లిం అభ్యర్థులను నిలబెట్టాయి. వీరిలో 16 మంది అభ్యర్థులు విజయం సాధించారు. 2019లో ఈ పార్టీలు 115 మంది అభ్యర్థులను నిలబెట్టగా, అప్పుడు 16 మంది అభ్యర్థులు మాత్రమే గెలుపొందారు. -
ముస్లిం ఓటు బ్యాంకు ప్రభావమెంత? ఏ పార్టీకి ప్రయోజనం?
2024 లోక్‌సభ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. ఆరు దశల ఓటింగ్ పూర్తయ్యింది. ఏడో దశకు జూన్ ఒకటిన పోలింగ్ జరగనుంది. దేశంలో హిందువుల జనాభా 80 శాతం. ముస్లిం జనాభా 14 శాతం. అసోం, పశ్చిమ బెంగాల్‌లలో అత్యధిక ముస్లిం ఓటు బ్యాంకు ఉంది. ఈ సారి జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ముస్లిం ఓటు బ్యాంకు ప్రభావం ఏ మేరకు ఉండనుంది?గత మూడు లోక్‌సభ ఎన్నికల్లో ముస్లిం ఓట్లకు సంబంధించిన సీఎస్డీఎస్ లోక్‌నీతి అందించిన డేటా ప్రకారం 2009 ఎన్నికలలో బీజేపీకి నాలుగు శాతం ముస్లిం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 38 శాతం ముస్లిం ఓట్లు వచ్చాయి. 58 శాతం ముస్లిం ఓటర్లు ఇతర పార్టీలకు ఓటు వేశారు. 2014 ఎన్నికల్లో బీజేపీకి ఎనిమిది శాతం ముస్లిం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 38శాతం ముస్లిం ఓట్లు, ఇతర పార్టీలకు 54 శాతం ముస్లిం ఓట్లు వచ్చాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఎనిమిది శాతం ముస్లిం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 33 శాతం, ఇతరులకు 59 శాతం ముస్లిం ఓట్లు వచ్చాయి.2014 ఎన్నికల్లో 882 మంది ముస్లిం అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో 23 మంది మాత్రమే విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో 819 మంది ముస్లిం అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో 28 మంది మాత్రమే గెలుపొందారు. 2019 ఎన్నికల్లో 27 మంది ముస్లిం ఎంపీలు పార్లమెంటుకు చేరుకున్నారు.ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అమితాబ్ తివారీ తెలిపిన వివరాల ప్రకారం గత రెండు ఎన్నికలను పరిశీలిస్తే ముస్లిం ఓటర్లు తటస్థంగా మారిపోతున్నారు. ఇందుకు పలు కారణాలున్నాయి. 2014కు ముందు అసోంలో ముస్లిం ఓట్లు కేంద్రీకృతమై ఉండేవి. హిందూ ఓట్లు కులాల ప్రాతిపదికన చెల్లాచెదురయ్యాయి. ఫలితంగా అసోం, యూపీ, బీహార్ రాష్ట్రాల్లో బీజేపీకి తక్కువ సీట్లు వచ్చాయి. 2014, 2019 ఎన్నికలను పరిశీలిస్తే ఈ రాష్ట్రాల్లో బీజేపీకి తొమ్మది సీట్లు వచ్చాయి. మొత్తంగా చూస్తే మైనారిటీ ఆధిపత్య స్థానాల్లో బీజేపీ పరిస్థితి బాగానే ఉందని తివారీ పేర్కొన్నారు. -
అబూదాబి హిందూ ఆలయంలో సామాన్య భక్తుల సందడి!
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో రాతితో నిర్మించిన మొదటి హిందూ దేవాలయాన్ని సామాన్యుల కోసం తెరిచారు. దీంతో ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. అబుదాబిలోని ఈ హిందూ దేవాలయాన్ని ఫిబ్రవరి 14న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దుబాయ్-అబుదాబి షేక్ జాయెద్ హైవేపై అల్ రహ్బా సమీపంలో 27 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.700 కోట్లతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయం కోసం భూమిని యూఏఈ ప్రభుత్వం విరాళంగా ఇచ్చింది. అబుదాబిలోని ఈ తొలి హిందూ దేవాలయం నాగర్ శైలిలో నిర్మితమయ్యింది. ఇదే శైలిలో అయోధ్యలోని రామాలయాన్ని నిర్మించారు. అబూదాబి ఆలయ వాలంటీర్ ఉమేష్ రాజా తెలిపిన వివరాల ప్రకారం రాజస్థాన్‌లో 20 వేల టన్నులకు పైగా సున్నపురాళ్లను 700 కంటైనర్లలో అబుదాబికి తీసుకువచ్చారు. అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ (బీఏపీఎస్)తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో.. ‘నిరీక్షణ ముగిసింది! అబుదాబి ఆలయం ఇప్పుడు సందర్శకులు , సామాన్య భక్తుల కోసం తెరిచారు. సోమవారం మినహా అన్ని రోజుల్లో ఈ ఆలయం ఉదయం 9 నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుందని’ పేర్కొంది. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ ‘ఆలయంలో శాంతియుత వాతావరణాన్ని కొనసాగించడానికి, ఈ ప్రాంగణాన్ని క్రమబద్ధంగా నిర్వహించడానికి భక్తులు ఆలయ మార్గదర్శకాలను పాటించడం అవసరం’ అని పేర్కొన్నారు. -
పేద ముస్లింలకు వరంగా రిజర్వేషన్లు
-
దేశ సంస్కృతిలో ‘పరదా’ కూడా భాగమే
అయోధ్య: భారతదేశ సంస్కృతిలో ‘పరదా’ ఒక భాగమేనని ఆర్ఎస్ఎస్ ముస్లిం విభాగం ముస్లిం రాష్ట్రీయ మంచ్(ఎంఆర్ఎం) నేత అరుణ్‌సింగ్ అభిప్రాయపడ్డారు. హిజాబ్ ధరించే హక్కును ముస్కాన్ ఖాన్‌కు రాజ్యాంగం కల్పించిందన్నారు. హిజాబ్ అనేది దేశ సంస్కృతిలో భాగమైన పరదా లాంటిదేనని స్పష్టం చేశారు. అయితే సింగ్ వ్యాఖ్యలు వ్యక్తిగతమని ఎంఆర్ఎం పేర్కొంది. తామెవరికీ మద్దతు ఇవ్వలేదని, కొందరు కావాలనే గొడవలు సృష్టిస్తున్నారని ఎంఆర్ఎం ప్రతినిధి షాహీద్ సయ్యద్ చెప్పారు. విద్యాసంస్థల్లో యూనిఫామ్‌కు తాము మద్దతిస్తామని ఎంఆర్ఎం వ్యవస్థాపకుడు ఇంద్రేశ్ కుమార్ చెప్పారు. శాంతియుత వాతావరణాన్ని కాపాడండి కర్ణాటక ప్రజలు శాంతి, సామరస్యంతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై పిలుపునిచ్చారు. ప్రజలను రెచ్చగొట్టేలా ప్రకటనలు చేయొద్దని రాజకీయ పార్టీలను కోరారు. స్కూళ్లు, కాలేజీలు తెరిచిన తర్వాత విద్యార్థులు నిర్దేశిత యూనిఫామ్ ధరించి, తరగతులకు హాజరు కావాలని కర్ణాటక విద్యాశాఖ మంత్రి బి.సి.నగేష్ చెప్పారు. మరోవైపు ముస్లిం విద్యార్థులపై దాడులను 1000కి పైగా సంఘాలు ఖండించాయి. ఈ మేరకు 1,850 మంది ప్రముఖులు ఒక బహిరంగ లేఖ రాశారు. నేను సమర్థ్ధించను హిజాబ్‌ను తాను సమర్థించనని ప్రముఖ సినీ రచయిత జావెద్ అక్తర్ చెప్పారు. అయితే హిజాబ్ వేసుకునే ముస్లిం విద్యార్థినులను వేధించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిజాబ్ వ్యవహారంలో రాజకీయ లబ్ధి కోసం పాకులాడొద్దని పార్టీలకు మహారాష్ట్ర హోంమంత్రి దిలీప్ వాల్సే పాటిల్ గురువారం సూచించారు. మహారాష్ట్రలోని పుణేలో నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నేతలు, కార్యకర్తలు హిజాబ్‌కు అనుకూలంగా గురువారం ర్యాలీ నిర్వహించారు. పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఆందోళన ఇండియాలోని కర్ణాటక రాష్ట్రంలో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించకుండా నిషేధం విధించడం పట్ల పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. పాక్‌లో భారత్‌కు చెందిన ‘చార్జ్ ద అఫైర్స్’ను పిలిపించి, హిజాబ్ వ్యవహారం పట్ల తన నిరసనను తెలియజేసింది. -
భార్య ఉండగానే రెండోపెళ్లి
వరంగల్: భార్య ఉండగానే రెండో పెళ్లి చేసుకొని ఓ ప్రబుద్ధుడు దుబాయ్ వెళ్లడంతో అతడి ఇంటి ఎదుట మొదటి భార్య న్యాయం కావాలంటూ ధర్నా చేపట్టిన సంఘటన వరంగల్ ఎల్బీనగర్లో చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హన్మకొండ కాకాజీకాలనీకి చెందిన అమీనా అనే యువతికి వరంగల్ ఎల్బీనగర్కు చెందిన నజీంతో మూడేళ్ల క్రితం వివాహమైంది. వివాహ సమయంలో అమీనా తండ్రి జహీర్‌ఖాన్ సుమారు రూ.10లక్షల వరకు కట్న కానుకలు అల్లుడు నజీంకు ముట్టజెప్పారు. పెళ్లయిన తర్వాత అమీనాను దుబాయ్‌కు తీసుకుపోయిన నజీం అదనపు కట్నం కావాలంటూ తరచూ వేధించేవాడు. అమీనా తల్లిదండ్రులు ఫోన్ చేసిన ప్రతీసారి తాను వ్యాపారం చేసేందుకు రూ.10 లక్షలు కట్నం, 20 లక్షలు ఇన్వెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేసేవాడు. చివరకు కొన్ని రోజుల క్రితం వరంగల్‌కు తీసుకొచ్చి అమీనాను తల్లిగారింట్లో వదిలేశాడు. దుబాయ్‌కి వెళ్లిన నజీద్ ఫోన్ చేసిన ప్రతిసారి అదనపు కట్నం తీసుకువస్తేనే కాపురానికి తీసుకుపోతానని అనేవాడు. నజీద్ తల్లి దండ్రులు సైతం కట్నం వేధింపులకు గురిచేసే వారు. ఇటీవల తనకు రెండో పెళ్లి అయినట్లు నజీద్ అమీనాకు వాట్సాప్ పోస్ట్ చేశాడు. ఈ విషయంపై నజీద్ అమ్మానాన్నలను ప్రశ్నించగా అవును .. నా కొడుకు రెండో పెళ్లి చేసుకున్నాడు.. ఏం చేస్తావో చేసుకో పో అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో అమీనా కుటుంబ సభ్యులు శనివారం నజీం ఇంటి ఎదుట టెంట్ వేసి న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగారు. వీరికి మహిళా సంఘాలు, ముస్లిం మహిళలు సంఘీభావం వ్యక్తం చేయడమే కాకుండా రెండో పెళ్లి చేసుకున్న నజీంను దుబాయ్ నుంచి రప్పించి అమీనాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నజీంకు రెండో పెళ్లి చేసిన అమీనా అత్తమామలను అరెస్టు చేసి న్యాయం చేయాలని మైనార్టీ మహిళా నాయకురాలు రహిమున్నీసా పోలీసుల ను కోరారు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో అమీనా మామ అజహర్‌పై దాడికి ప్రయత్నించగా పోలీసులు రంగ ప్రవేశం చేసి ఎలాంటి గొడవలు కాకుండా భద్రత ఏర్పాటు చేశారు. బాధితురాలికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. బాధితులు ఫిర్యాదు చేయనందున కేసు ఫైల్ కాలేదని ఇంతేజార్గంజ్ పోలీసులు తెలిపారు. -
దేశంలో అశాంతికి కారణం కాంగ్రెస్సే
వినాయక్‌నగర్, న్యూస్‌లైన్ : హిందూ,ముస్లింలకు తగాదాలు పెడుతూ దేశంలో అశాంతి నెలకొనడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు హనీఫ్ అలీ ఆరోపించారు. నగరంలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం మైనార్టీ మెర్చా జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సంసదర్భంగా హనీఫ్ మాట్లాడారు. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడి ముస్లింల వ్యతిరేకులని కాంగ్రెస్ ఆరోపిస్తూ ముస్లింలలో భయాందోళన రేపుతోందన్నారు. గుజరాత్ ముస్లిం వ్యక్తిని డీజీపీగా నియమించిన ఘనత మోడీదేనని గుర్తుచేశారు. రాజస్థాన్‌లో ఇద్దరు ముస్లింలు ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు. ఛత్తీస్‌గఢ్, కర్ణాటకలో అన్యాక్రంతమైన వక్ఫ్‌బోర్డు ఆస్తులను వంద శాతం రికవరీ చేసిన ఘనత బీజేపీదేనని హనీఫ్ అన్నారు. కర్మాగారాన్ని స్వాధీనం చేసుకోవాలి.. ఆసియాలో అతి పెద్దదైన బోధన్ చక్కెర కార్మాగారాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని రైతులకు న్యాయం చేయాలని అర్బన్ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో హనీఫ్‌తో కలిసి ఆయన మాట్లాడారు. డిప్యూటీ సీఎం దామోందర, మంత్రులు గీతారెడ్డి, సుదర్శన్‌రెడ్డిని కలిసి ఫ్యాక్టరీని ప్రభుత్వ పరం చేయాలని కోరామన్నారు. మంత్రి సుదర్శన్‌రెడ్డి అనుచరులు రైతుల ముసుగులో ఫ్యాక్టరీని కైవసం చేసుకోవాలని చూస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు యూసుఫ్బేగ్, మునీర్, జిల్లా అధ్యక్షుడు రషీద్, నగర అధ్యక్షుడు గజం ఎల్లప్ప, బద్దం కిషన్, మల్లేష్‌యాదవ్, తోట గోపాల్, కొడూరు నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.