వినాయక్‌నగర్, న్యూస్‌లైన్ : హిందూ,ముస్లింలకు తగాదాలు పెడుతూ దేశంలో అశాంతి నెలకొనడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు హనీఫ్ అలీ ఆరోపించారు. నగరంలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం మైనార్టీ మెర్చా జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సంసదర్భంగా హనీఫ్ మాట్లాడారు. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడి ముస్లింల వ్యతిరేకులని కాంగ్రెస్ ఆరోపిస్తూ ముస్లింలలో భయాందోళన రేపుతోందన్నారు. గుజరాత్ ముస్లిం వ్యక్తిని డీజీపీగా నియమించిన ఘనత మోడీదేనని గుర్తుచేశారు. రాజస్థాన్‌లో ఇద్దరు ముస్లింలు ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు. ఛత్తీస్‌గఢ్, కర్ణాటకలో అన్యాక్రంతమైన వక్ఫ్‌బోర్డు ఆస్తులను వంద శాతం రికవరీ చేసిన ఘనత బీజేపీదేనని హనీఫ్ అన్నారు.
కర్మాగారాన్ని స్వాధీనం చేసుకోవాలి..
ఆసియాలో అతి పెద్దదైన బోధన్ చక్కెర కార్మాగారాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని రైతులకు న్యాయం చేయాలని అర్బన్ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో హనీఫ్‌తో కలిసి ఆయన మాట్లాడారు. డిప్యూటీ సీఎం దామోందర, మంత్రులు గీతారెడ్డి, సుదర్శన్‌రెడ్డిని కలిసి ఫ్యాక్టరీని ప్రభుత్వ పరం చేయాలని కోరామన్నారు. మంత్రి సుదర్శన్‌రెడ్డి అనుచరులు రైతుల ముసుగులో ఫ్యాక్టరీని కైవసం చేసుకోవాలని చూస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు యూసుఫ్‌బేగ్, మునీర్, జిల్లా అధ్యక్షుడు రషీద్, నగర అధ్యక్షుడు గజం ఎల్లప్ప, బద్దం కిషన్, మల్లేష్‌యాదవ్, తోట గోపాల్, కొడూరు నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
దేశంలో అశాంతికి కారణం కాంగ్రెస్సే
Published Mon, Dec 23 2013 3:46 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement