bumper
-
బంపర్ ఆఫర్ కొట్టేసిన పూజా హెగ్డే
-
ఈసారి చార్ధామ్ యాత్రకు సరికొత్త రికార్డులు?
ఉత్తరాఖండ్‌లో చార్ధామ్ యాత్ర 2024, మే 10 నుండి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా రాష్ట్ర పర్యాటక మంత్రి సత్పాల్ మహరాజ్ మాట్లాడుతూ చార్ధామ్ యాత్రకు అనూహ్య స్పందన వస్తున్నదని యాత్రా మార్గంలోని జీఎంవీఎన్ అతిథి గృహాల బుకింగ్స్ రోజురోజుకు పెరుగుతున్నాయని తెలిపారు.గత ఏడాది 56 లక్షల 31 వేల మంది భక్తులు చార్‌ధామ్‌ను సందర్శించారని, ఈ ఏడాది ఆ రికార్డు బద్దలు కానున్నదని సత్పాల్ మహరాజ్ ఆశాభావం వ్యక్తం చేశారు. యాత్ర మార్గాల్లోని 94 జీఎంవీఎన్ అతిథి గృహాల్లో వసతి కోసం ఆన్లైన్ మాధ్యమంలో 8 కోట్ల 58 లక్షల 39 వేల 892 మంది, ఆఫ్‌లైన్‌లో 3 కోట్ల 70 లక్షల 22 వేల 819 మంది బుకింగ్స్ చేశారన్నారు. ఈ సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నదన్నారు.ఇప్పటివరకు యాత్రకు సంబంధించిన జరిగిన రిజిస్ట్రేషన్ల గురించి సత్పాల్ మహరాజ్ మాట్లాడుతూ, గంగోత్రి ధామ్ సందర్శనకు 2,87,358 మంది, యమునోత్రి ధామ్‌కు 2,60,597 మంది, కేదార్నాథ్ ధామ్‌కు 5,40,999 మంది, బద్రీనాథ్ ధామ్‌కు 4,53,213 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు.అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు వాటిని ఎదుర్కొనేందుకు డెహ్రాడూన్‌లోని ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్మెంట్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేశామని, ఇది ప్రతిరోజూ ఉదయం 7 నుండి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తుందన్నారు. పర్యాటకులు, ప్రయాణికుల కోసం టోకెన్లు, స్టాళ్ల వ్యవస్థను కూడా ప్రారంభించనున్నామని తెలిపారు. ఈసారి చార్ధామ్ యాత్రలో రవాణా శాఖ, భారత ప్రభుత్వం సంయుక్తంగా ఎలక్ట్రానిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నాయి. -
MP: దూసుకెళ్తున్న ‘మామ’.. బంపర్ మెజార్టీలో సీఎం చౌహాన్
భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దూసుకెళ్తున్నారు. తన నియోజకవర్గం బుధ్నిలో ముందంజలో ఉండగా, కాంగ్రెస్ అభ్యర్థి కమల్ నాథ్ చింద్వారాలో వెనుకంజలో ఉన్నారు. 9 రౌండ్లు ముగిసేసరికి శివరాజ్ సింగ్ చౌహాన్ 56,124 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అధికార వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పటికీ, నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చౌహాన్ విజయం సాధిస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్య మంత్రి లాడ్లీ బెహనా యోజన పథకం బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించిందని నమ్ముతున్నారు. మధ్యప్రదేశ్‌లోని మహిళలు చౌహాన్‌పై విశ్వాసం ఉంచినట్లు స్పష్టమవుతోంది. రాష్ట్రంలో బీజేపీ పూర్తి మెజారిటీతో గెలుస్తుందని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఇదివరకే ధీమా వ్యక్తం చేశారు. -
బంపర్ ఆఫర్ వచ్చిందంటూ..
చింతపల్లి : మీకు బంపర్ ఆఫర్ వచ్చింది.. రూపాయలు వేలు విలువ చేసే దేవతల విగ్రహాలు తక్కువ ధరకే వస్తాయని నమ్మబలకడంతో రూ. 3500 కట్టిన వ్యక్తి చివరకు పార్సిల్లో కనీసం రూ.వంద కూడా విలువ చేయని వస్తువులు రావడంతో అవాక్కయ్యాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం... చింతపల్లి మండలం కుర్మేడ్ గ్రామానికి చెందిన కానుగుల ఆనంద్ సెల్‌కు 10 రోజుల క్రితం ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది. మీ సెల్ నంబర్‌కు బంపర్ ఆఫర్ వచ్చిందని, తక్కువ ధరకు ఎక్కువ విలువ చేసే సెల్‌ఫోన్ వస్తుందని తెలిపారు. వాళ్లు చెప్పిన మాటలు విన్న ఆనంద్‌కు మరుసటి రోజు మరోసారి ఫోన్ కాల్ వచ్చింది. మీ సెల్ నంబర్‌కు లాటరీ తగిలిందని, మీకు అదృష్టం కలిసి వచ్చిందని, రూ. 15వేలు విలువ చేసే ఓ సెల్‌నంబర్‌తో పాటు దేవతల విగ్రహాలు వస్తాయని రూ. 3500 మాత్రమే చెల్లిస్తే ఆ వస్తువులు మీ సొంతమవుతాయని మరోసారి నమ్మించారు. వాళ్లు చెప్పిన మాటలు నమ్మిన ఆనంద్ తక్కువ ధరకే రూ.వేలు విలువ చేసే కొత్త సెల్‌ఫోన్ వస్తుందనే ఆశతో శనివారం తపాలా కార్యాలయానికి వెళ్లి రూ. 3500 చెల్లించి పార్సిల్ విప్పి చూశాడు. అందులో కేవలం రూ.50 విలువ చేసే నకిలీ వస్తువులు ఉండటంతో ఆందోళనకు గురయ్యాడు. -
తాజ్ వివాంతలో ఘనంగా గ్రోమోర్ రైతు సంబరాలు