మధ్యప్రదేశ్లోని భోపాల్ సెంట్రల్ జైలు నుంచి 8మంది స్టూడెంట్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా(సిమీ) ఉగ్రవాదులు తప్పించుకున్నారు. స్టీల్ కంచం, గ్లాస్తో జైలు సెక్యురిటీ గార్డుగా ఉన్న హెడ్ కానిస్టేబుల్ రమా శంకర్ గొంతు కోసి హత్య చేశారు. సిమీ ఉగ్రవాదులు బెడ్షీట్లతో తాడులా తయారు చేసి, దాని సహాయంతో ప్రహారి గోడను దూకి తప్పించుకున్నారని భోపాల్ ఎస్పీ అరవింద్ సక్సెనా తెలిపారు.