flee
-
దేశం విడిచి పారిపోయిన పూజా ఖేద్కర్?
న్యూఢిల్లీ: వరుస వివాదాలతో వార్తల్లోకి ఎక్కిన ఏఐఎస్ మాజీ ప్రొబెషనరీ అధికారిణి పరారీలో ఉన్నారా?. ఆమె కోసం పోలీసులు గాలింపు చేపట్టారా?. ఢిల్లీ కోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించడం వెంటనే.. ఆమె దేశం విడిచి పారిపోయారా?. ముందస్తు బెయిల్ విషయంలో పూజా ఖేద్కర్‌కు గురువారం చుక్కెదురైంది. ఓబీసీ కోటా, అలాగే దివ్యాంగుల కోటా విషయంలో ఆమె మోసం చేశారని, ఈ అంశాల్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకున్న యూపీఎస్సీ ఆమెను సర్వీస్ నుంచి డిస్మిస్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనపై అభియోగాల దృష్ట్యా అరెస్ట్ తప్పదని ఆమె భావించారు. వెంటనే తన లాయర్ ద్వారా ఢిల్లీ పాటియాలా హౌజ్ కోర్టులో ఒక పిటిషన్ వేశారు. కానీ, కోర్టు అందుకు నిరాకరించింది. పూజాను కస్టోడియల్ విచారణ జరిపితేనే వాస్తవాలు బయటకు వస్తాయని బెయిల్ తిరస్కరణ సందర్భంగా న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. అయితే.. జులై 31న అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సీ నిర్ణయం ప్రకటించిన నాటి నుంచి ఆమె ఫోన్ స్విచ్చాఫ్ వస్తోంది. అంతకు ముందు ముస్సోరీలోని అకాడమీ ఎదుటా హాజరై ఆమె తన వివరణ ఇచ్చుకోలేదు. దీంతో యూపీఎస్సీ ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే.. నోటీసులకు స్పందించేందుకు ఆగష్టు 4వ తేదీ వరకు ఆమె గడువు కోరారు. కానీ, యూపీఎస్సీ మాత్రం జులై 30 దాకా అవకాశం ఇచ్చింది. అయినా ఆమె గైర్హాజరయ్యారు. దీంతో ఆమె దుబాయ్‌కి వెళ్లిపోయి ఉండొచ్చని జాతీయ మీడియా కథనాలు ఇస్తోంది. దీనిపై పూజా తరఫు స్పందన రావాల్సి ఉంది. మరోవైపు.. పుణే పోలీసులు సైతం ఆమె పరారైన విషయాన్ని ధృవీకరించాల్సి ఉంది. -
దక్షిణ గాజాను వీడండి.. పాలస్తీనాకు ఇజ్రాయెల్ హెచ్చరికలు
ఖాన్ యూనిస్: హమాస్ అంతమే ధ్యేయంగా ఇజ్రాయెల్ సైన్యం పాలస్తీనాపై విరుచుకుపడుతోంది. ఇప్పటికే గాజా ఉత్తర ప్రాంతాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుంది. తాజాగా దక్షిణ ప్రాంతంపై కూడా గురిపెట్టింది. దక్షిణ గాజాలో పౌరులందరూ పశ్చిమ ప్రాంతానికి వెళ్లాలని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరికలు చేసింది. 'దక్షిణ గాజాను ఖాలీ చేయాల్సిందిగా పౌరులకు సూచించాం. వెంటనే సాధ్యం కాదని మాకు తెలుసు. కానీ కాల్పుల్లో పౌరులు మరణించకూడదని కోరుకుంటున్నాం. పశ్చిమ ప్రాంతంలో మానవతా సహాయం అందుతుంది.' అని ప్రధాని నెతన్యాహు సన్నిహితుడు మార్క్ రెగెవ్ తెలిపారు. ఇజ్రాయెల్ యుద్ధంతో ఉత్తర గాజా నుంచి ఇప్పటికే లక్షల్లో జనాభా దక్షిణ ప్రాంతానికి వలస వెళ్లింది. ప్రస్తుతం దక్షిణ ప్రాంతంలోని ఖాన్ యూనిస్ నగరంలో దాదాపు 4 లక్షల జనాభా ఉంటుంది. ప్రస్తుతం వీరందర్ని పశ్చిమం వైపు వెళ్లాల్సిందిగా ఇజ్రాయెల్ ఆదేశిస్తోంది. ఇజ్రాయెల్ దూకుడుతో పాలస్తీనీయులకు పశ్చిమానికి వెళ్లడం తప్పేలా కనిపించడం లేదు. 24 మంది మృతి.. అల్-షిఫా ఆస్పత్రిని హమాస్ ఉగ్రవాదులు రక్షణ కవచంగా ఉపయోగిస్తున్నారని ఆరోపిస్తున్న ఇజ్రాయెల్ సైన్యం.. ఆస్పత్రి కేంద్రంగా దాడులు చేస్తోంది. దీంతో ఆస్పత్రికి ఆక్సిజన్, ఇంధనం, కరెంట్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆస్పత్రిలో తాజాగా 24 మంది రోగులు మృతి చెందారని పాలస్తీనా వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు దాడి చేయడంతో యుద్ధం ప్రారంభమైంది. హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు ఇజ్రాయెల్ వైపు 1200 మంది మరణించగా.. పాలస్తీనా మధ్య 12,000పైగా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: Israel-Hamas war: అల్–షిఫాలో మృత్యుఘోష -
‘అమృత్‌పాల్ సింగ్ పాక్‌కు పారిపోవాలి’
‘‘నేనేం పరారీలో లేను. ఎక్కడికీ పారిపోలేదు. పోలీసుల ఎదుట లొంగిపోయే ఉద్దేశమూ లేదు. త్వరలోనే ప్రజల ముందుకు వస్తా. అన్ని వాస్తవాలను వివరిస్తా. ఓపిక పట్టండి. సిక్కు సంఘాలన్నీ ఐక్యం కావాల్సిన తరుణం వచ్చింది’’ అంటూ అమృత్‌పాల్ సింగ్ ఓ వీడియో, ఆడియో క్లిప్ విడుదల చేయడం తెలిసిందే. అయితే.. ఈ ఖలీస్తానీ సానుభూతిపరుడి వ్యవహారంపై శోరోమణి అకాలీ దళ్(అమృత్సర్) చీఫ్, లోక్‌సభ ఎంపీ సిమ్రన్‌జిత్ సింగ్ మాన్ మరోలా స్పందించారు. అతను(అమృత్‌పాల్‌ను ఉద్దేశించి.. ) లొంగిపోకూడదని, పారిపోవాలని ఎంపీ సిమ్రన్‌జిత్ సింగ్ సూచించారు. ‘‘అమృత్‌పాల్ సింగ్ పోలీసులకు లొంగిపోకూడదు. రావి నది దాటేసి.. పాకిస్తాన్‌కు పారిపోవాలి. 1984లో మేం(సిక్కులం) అలాగే పాకిస్తాన్‌కు పారిపోలేదా? అలాగే ఇప్పుడు అమృత్‌పాల్ సింగ్ కూడా అలాగే పారిపోవాలి. అప్పుడే అతను తన ప్రాణాలను నిలబెట్టుకోగలడు’’.. అంటూ వ్యాఖ్యానించారాయన. నాటి పరిస్థితుల తరహాలోనే సిక్కు చరిత్రకు న్యాయం జరగాలంటే.. అతను పాక్‌కు పారిపోవడమే సరైన పని అంటూ సిమ్రన్‌జిత్ వ్యాఖ్యానించారు. ఇక ప్రభుత్వాలు సిక్కులను అణచివేస్తోందని, హక్కులను కాలరాజేసే కుట్ర చేస్తోందని మండిపడ్డారాయన. ఇదిలా ఉంటే.. వివాదాలకు సిమ్రన్‌జిత్ సింగ్ మాన్ కేరాఫ్. కిందటి ఏడాది పంజాబ్ సంగ్రూర్ నిజయోకవర్గ ఎంపీగా నెగ్గిన ఆయన.. మొదటి నుంచి ఖలీస్తానీ అనుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతెందుకు.. తన విజయాన్ని ఖలీస్థానీ మిలిటెంట్ జర్నైల్ సింగ్ భింద్రావాలేకు అంకితం చేస్తున్నానని, కశ్మీర్లో భారత ఆర్మీ అకృత్యాలను పార్లమెంట్లో వినిపిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గిరిజన అమాయకులను నక్సలైట్ల పేరుతో చంపుతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు కూడా. ఆపై భగత్ సింగ్‌ను ఉగ్రవాదిగా పేర్కొంటూ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. ఇదిలా ఉంటే.. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లను ఉద్దేశించి సిమ్రన్‌జిత్ వ్యాఖ్యలు చేశారు. ఆసమయంలో ఇందిరా గాంధీ దేశప్రధానిగా ఆపరేషన్ బ్లూస్టార్‌కు ఆదేశాలు ఇచ్చారు. సిక్కు ఉగ్రవాదిగా పేరున్న జర్నైల్ సింగ్ భింద్రావాలే, ఇతర ఖలీస్తానీ తీవ్రవాదుల ఏరివేత కోసం ఈ ఆపరేషన్ కొనసాగింది. అయితే.. సిక్కుల ఊచకోతకు ప్రతీకారగానే అదే ఏడాదిలో ఇందిరాగాంధీ తన సిక్కు బాడీగార్డుల చేతిలో దారుణంగా హత్యకు గురయ్యారు. మరోవైపు ఆపరేషన్ బ్లూస్టార్ పర్యవేక్షకుడైన లెప్టినెట్ జనరల్ కేఎస్ బ్రార్.. ఖలీస్తానీ వేర్పాటు వాదుల ఉద్యమం వెనుక పాక్ హస్తం ఉండొచ్చని, ప్రత్యేక దేశం కోసం డిమాండ్‌తో వాళ్లు ముందుకు సాగొచ్చని అభిప్రాయపడ్డారు కూడా. పాక్ సాయంతో పంజాబ్‌లో అలజడి, అల్లకల్లోలం సృష్టించేందుకు ఖలీస్తానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ ప్రణాళిక రచించాడని కేంద్ర నిఘా వర్గాలతో పాటు పంజాబ్ పోలీసులు కూడా ప్రకటించారు. ఈ క్రమంలోనే వారిస్ పంజాబీ దే అనే సిక్కు విభాగం నెలకొల్పాడని, కానీ అది ఖలీస్తానీ అనుకూల విభాగమని అధికారులు చెప్తున్నారు. అమృత్‌సర్‌కు దగ్గర్లోని అజ్నాలా పోలీస్ స్టేషన్ దగ్గర వందలాది మంది అమృత్‌పాల్ సింగ్ అనుచరులు మారణాయుధాలతో దాడి చేసి.. సింగ్ ప్రధాన అనుచరుడిని విడిపించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం, పంజాబ్ పోలీసుల సమన్వయతో అమృత్‌పాల్ సింగ్‌ను పట్టుకునేందుకు ఆపరేషన్ చేపట్టాయి. ఒకవైపు 30 ఏళ్ల అమృత్‌పాల్ సింగ్ తప్పించుకుంటూ తిరుగుతూ పంజాబ్ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. దాదాపు 13 రోజుల నుంచి అతని ఆచూకీని పోలీసులు కనిపెట్టలేకపోగా.. పంజాబ్-హర్యానా ఉమ్మడి హైకోర్టు సైతం పంజాబ్ పోలీసులపై మండిపడింది. మరోవైపు పంజాబ్‌లోని పలు రాజకీయ పార్టీలు సహా సిక్కు సంఘాలు అమృత్‌పాల్ సెర్చ్ ఆపరేషన్‌పై మండిపడుతున్నాయి. అమృత్‌పాల్ అనుచరుల పేరుతో అమాయకులను జైల్లో పెడుతూ.. సిక్కుల హక్కులను కాలరాస్తున్నారంటూ ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇంకోవైపు జతేదర్ ఆఫ్ అకాల్ తక్త్ అనే సిక్కు సంఘం.. పరారీలో ఉన్న అమృత్‌పాల్ సింగ్‌ను లొంగిపోవాలంటూ పిలుపు ఇచ్చింది. ఈ తరుణంలో వైశాఖి సందర్భంగా జరిగే కార్యక్రమం ద్వారా పోలీసులకు లొంగిపోవచ్చనే ప్రచారం తెర మీదకు వచ్చింది. కానీ, అదే వేదికగా సిక్కు సంఘాలు ఒక్కచోట చేరి తమ ఐక్యతను ప్రదర్శించాల్సిన అవసరం ఉందని చెబుతూ.. వీడియో సందేశం ద్వారా తనకు లొంగిపోయే ఉద్దేశం లేదని అమృత్‌పాల్ సింగ్ ప్రకటించాడు. ఇదీ చదవండి: డ్రోన్ ద్వారా గాలింపు.. వర్కవుట్ అవుతుందా? -
భర్తల కొంప ముంచిన ‘పీఎంఏవై’ రుణాలు.. లవర్లతో భార్యలు పరార్!
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం డబ్బులు తీసుకున్న నలుగురు వివాహితలు.. తమ భర్తలను వదిలేసి ప్రియుళ్లతో పరారయ్యారు. భార్యలు చేసిన ఊహించని ఘనకార్యం తెలుసుకొని ఆశ్చర్యపోవడం భర్తల వంతైంది. ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’ అనేది కేంద్ర ప్రభుత్వ పథకం.. దీని ద్వారా దేశంలోని పేదలు, మధ్యతరగతి ప్రజలు సొంతంగా ఇల్లు కట్టుకునేందుకు రుణాలు మంజూరు చేస్తుంది. ఈ పథకం కింద వివిధ వర్గాల వారికి మూడు నుంచి 18 లక్షల వరకు రుణాలు అందిస్తుంది. అయితే పీఎంఏవై కింద ఇచ్చే రుణాలను కేంద్రం మహిళల పేరు మీదనే అందిస్తుంది. అంటే ఇంటి యజమాని తప్పనిసరిగా మహిళనే అయి ఉండాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద దరఖాస్తు చేసుకున్న 40 మందికి రుణాలు మంజూరయ్యాయి. అందులో మొదటి విడతగా ఒక్కో లబ్ధిదారు బ్యాంకు ఖాతాలో రూ.50,000 చొప్పున నగదును జమచేశారు. అయితే ఈ పథకం కింద రుణాలు పొందిన వారిలో నలుగురు మహిళలు తమ అకౌంట్లకు చేరిన 50 వేల రుపాయలతో కనిపించకుండా పోయారు. భర్తలు వారి కోసం ఆరా తీయగా షాకింగ్ విషయం తెలిసింది. వారి భార్యలు తాము ప్రేమించిన వ్యక్తులతో పరారైనట్లు తెలింది. ఇలా పారిపోయిన వాళ్లలో జిల్లాలోని బెల్హారా, బంకీ, జైద్పూర్, సిద్ధౌర్ నగర పంచాయతీల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. కాగా భార్యలు పారిపోవడం భర్తల పాలిట శాపంగా మారింది. ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవడంతో ఈ వింత ఉదంతం అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో రుణాలు తీసుకొని ఇంటి నిర్మాణం చేపట్టకపోతే ఇచ్చిన డబ్బులను రికవరీ చేస్తామని జిల్లా అధికారులు బాధిత భర్తలను హెచ్చరించారు. నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని అధికారులు నోటీసులు పంపారు. దీంతో కంగుతిన్న భర్తలకు ఏమి చేయాలో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. చివరికి ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో తమ భార్యలు ప్రేమించిన వారితో వెళ్లిపోయారని.. వారి బ్యాంక్ ఖాతాలలోకి పీఎంఏవై రెండో విడత రుణాలను జమచేయవద్దని అధికారులకు మొరపెట్టుకున్నారు. మరోవైపు పారపోయిన లబ్ధిదారుల నుంచి సొమ్మును ఎలా రికవరీ చేయాలో తెలియక జిల్లా అధికారులు తలపట్టుకుంటున్నారు. చదవండి: పార్లమెంట్లో మోదీ ప్రసంగం.. రాహుల్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్.. -
దేశం వీడి పారిపోతున్న రష్యన్లు.. లక్షలు వెచ్చించి విమాన టికెట్లు కొనుగోలు
మాస్కో: యుద్ధానికి సిద్ధం కావాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల అధికారిక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ మరునాటి నుంచే చాలా మంది రష్యన్లు దేశం వీడి పారిపోతున్నారు. కొద్ది రోజుల్లో దేశ సరిహద్దులు మూసివేస్తారని తెలిసి రూ.లక్షలు ఖర్చు చేసి మరీ విమాన టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా సంపన్నులు ఎంత ఖర్చయినా లెక్క చేయకుండా ఇతర దేశాలకు వెళ్లిపోతున్నారు. ఇదే అదనుగా భావించిన విమాన సంస్థలు టికెట్ల ధరలు, ప్రైవేటు జెట్ల ఛార్జీలను భారీగా పెంచాయి. ఆర్మేనియా, టర్కీ, అజర్బైజన్ వంటి దేశాలకు రష్యా పౌరులు వీసా లేకుండానే వెళ్లవచ్చు. దీంతో ఆయా దేశాలకు ఛార్జీలను ఏకంగా 20వేల పౌండ్ల(రూ.17.5లక్షలు) నుంచి 25వేల పౌండ్ల(రూ.22లక్షలు) మధ్య నిర్ణయించాయి విమానయాన సంస్థలు. 8 సీట్ల ప్రైవేటు జెట్ విమానానికి ఏకంగా రూ.75 లక్షల నుంచి రూ.కోటి వరకు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. సాధారణ ఛార్జీలతో పోల్చితే ఇది చాలా రెట్లు అధికం. ఛార్జీలు ఇంత అధికంగా ఉన్నా రష్యన్లు మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. యుద్ధంలో పాల్గొనకుండా హాయిగా బతికేందుకు డబ్బు గురించి ఆలోచించకుండా దేశం వీడి పారిపోతున్నారు. పుతిన్ ప్రకటన తర్వాత ఇప్పటికే 2.6లక్షల మంది రష్యన్లు దేశాన్ని వీడినట్లు కీవ్‌కు చెందిన వార్తా సంస్థ తెలిపింది. ఇంతకుముందు తమకు రోజుకు 50 మంది నుంచి మాత్రమే విజ్ఞప్తులు వచ్చేవని, కానీ ఇప్పుడు రోజుకు 5వేల మంది టికెట్ల కోసం ఫోన్లు చేస్తున్నారని ఓ జెట్ కంపెనీ డైరెక్టర్ తెలిపాడు. తమ జెట్లలో అత్యంత చౌకైన టికెట్ ధర రూ.2.6లక్షలు అని చెప్పాడు. డిమాండ్ విపరీతంగా ఉందని, ప్రస్తుత పరిస్థితి క్రేజీగా అనిపిస్తోందని పేర్కొన్నాడు. ఐరోపా విమానయాన సంస్థలు ప్రస్తుతం సేవలు అందించడం లేదని, అందుకే డిమాండ్ ఇంతగా పెరిగిందని వివరించాడు. చదవండి: 'గే' మ్యారేజెస్‌కు ఆ దేశంలో చట్టబద్దత -
సిద్ధూ హత్య కేసు: వెలుగులోకి వస్తున్నకీలక విషయాలు
న్యూఢిల్లీ: పంజాబ్ సింగర్ సిద్ధూ హత్య కేసుకి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు మాట్లాడుతూ...పంజాబ్ సింగర్ సిద్ధూని హత్యకు సంబంధించిన కుట్రదారుల్లో ఒక వ్యక్తి హత్యకు నెలరోజుల మందుగానే నకిలీ పాస్పోర్టుతో భారత్ వదిలి పారిపోయాడని చెప్పారు. ఆ వ్యక్తి సచిన్ బిష్ణోయ్ అని, అతను జైల్లో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సన్నిహిత సహచరుడని పేర్కొన్నారు. ఈ హత్యకు ప్లాన్ చేసి తర్వాతే నకీలీ పాస్‌పోర్ట్ సహాయంతో ఇండియా వదిలి పారిపోయాడని చెప్పారు. ఈ విషయాన్ని తాము ముందుగానే గుర్తించి ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదని పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు సచిన్ బిష్ణోయ్ ఏప్రిల్ 21 వరకు భారత్‌లోనే ఉన్నాడని తెలిపారు. నిందితుడు కెనడాకు చెందిన గోల్డీ బ్రార్‌తో పాటు రాపర్‌ని హత్య చేసిన ఇద్దరు ప్రధాన కుట్రదారులలో ఒకరుగా భావిస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీలోని సంగమ్ విహార్ చిరునామాతో తిలక్ రాజ్ తోటేజా పేరుతో సచిన్ బిష్ణోయ్ నకిలీ పాస్‌పోర్ట్‌ను పొందినట్లు పోలీసులు గుర్తించారు. సిద్ధూ మూసే వాలేని హత్య చేసింది మే 29న అయితే సచిన్ బిష్ణోయ్ ఏప్రిల్ 21నే భారత్‌ని వదలి దూబాయ్ పారిపోయాడని అక్కడి నుంచి అజర్బైజాన్ వెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకాదు సచిన్ బిష్ణోయ్ ఢిల్లీలో ఉన్నప్పుడే మూస్ వాలా హత్యకు సంబంధించిన మొత్తం ప్లాన్‌ని సిద్ధం చేసి, షూటర్లకు షెల్టర్లు, డబ్బు, వాహనాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదీగాక సిద్ధూ మూసే వాలేకి ఉన్న 424 భద్రతా సిబ్బంది తొలగించిన తర్వాత ఈ హత్య జరగడం గమనార్హం. (చదవండి: Sidhu Moose Wala Murder Case: మాస్టర్ మైండ్ అతనేనన్న ఢిల్లీ పోలీసులు) -
షాకింగ్: కోవిడ్ నిబంధనలు గాలికొదిలి 300 మంది పరార్
గువహటి: ఒకవైపు దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రకంపనలు రేపుతోంది. మరోవైవు అసోంలోని సిల్చార్ విమానాశ్రయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తప్పనిసరిగా కోవిడ్ టెస్ట్ చేయించు కోవాల్సిన విమాన ప్రయాణికులు అధికారుల కళ్లుగప్పి దొడ్డి దారిన ఉడాయించారు. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 300 మంది ప్రయాణికులు పరారయ్యారు. నిబంధనలను గాలికి ఒదిలి బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిన ఈ ఘటన రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన కాచర్ జిల్లా అధికారులు సీరియస్‌గా స్పందించారు. విమాన ప్రయాణికులందరి వివరాలను సేకరిస్తున్నామని, అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా అదనపు డిప్యూటీ కమిషనర్ సుమిత్ సత్తవన్ వెల్లడించారు. (వ్యాక్సిన్ తరువాత పాజిటివ్ : ఐసీఎంఆర్ సంచలన రిపోర్టు) అసోంలోని సిల్చార్ ఎయిర్‌పోర్టుకు నిన్న(బుధవారం, ఏప్రిల్ 21) మొత్తం ఆరు విమానాలు చేరుకున్నాయి. ఇలా వచ్చిన మొత్తం 690 మంది ప్రయాణికుల్లో 189 మంది మాత్రమే కరోనా టెస్టులు చేయించు కున్నారు. వీరిలో ఆరుగురికి పాజిటివ్ రావడం గమనార్హం. ఇందులో కొందరు రాష్ట్రంలోని గువహతి నుంచి రావడం, మరికొందరు ఇతరు ఈశాన్య రాష్ట్రాల(ట్రాన్సిట్)కు ప్రయాణిస్తున్నవారున్నారు. ఈ నేపథ్యంలో 200 మందికి పైగా ప్రయాణికులను పరీక్షించాల్సిన అవసరం లేదని విమానాశ్రయం, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. అయితే ప్రభుత్వ ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలును ఉల్లంఘించి 300 మందికి పైగా ప్రయాణికులు టెస్టులు చేయించుకోకుండా తప్పించుకున్నారని అధికారులు వెల్లడించారు. సంబంధిత ప్రయాణికుల వివరాలన్నీ తమ దగ్గర ఉన్న నేపథ్యంలో తొందరలోనే వీరి వివరాలు సేకరిస్తామని చెప్పారు. కాగా కరోనా ఉధృతి నేపథ్యంలో అసోం ప్రభుత్వం మునుపటి నిబంధనలను పాక్షికంగా సవరించి, కోవిడ్ పరీక్ష ఫలితం ప్రతికూలంగా వచ్చినప్పటికీ, విమానాలు, రైళ్ల ద్వారా అసోంకు వచ్చే వారికి 7 రోజుల గృహ నిర్బంధాన్ని తప్పనిసరి చేసింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ ప్రధాన కార్యదర్శి సమీర్ కుమార్ సిన్హా జారీ చేసిన ఆదేశాల ప్రకారం ప్రభుత్వ అధికారులు, అత్యవసర వైద్యంకోసం ప్రయాణించేవారు, ఇతర ఈశాన్య రాష్ట్రాల పౌరులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నవారికి దీన్నుంచి మినహాయింపు ఇచ్చింది. చదవండి : జొమాటో కొత్త ఫీచర్, దయచేసి మిస్ యూజ్ చేయకండి! ఎన్నిసార్లు గెలుస్తావ్ భయ్యా..! నెటిజన్లు ఫిదా -
కనవాటి జైలు నుంచి నలుగురు ఖైదీల పరారీ
-
పోలీసుల నుంచి పారిపోతూ..
లక్నో: పోలీసుల నుంచి పారిపోతూ ఓ యువకుడు ప్రమాదవశాత్తూ బావిలో పడి మృతిచెందాడు. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం చిత్రాకోట్ జిల్లాలో గురువారం జరిగింది. పేకాటాడుతున్న శిబిరంపై పోలీసులు ఒక్కసారిగా దాడి చేయడంతో భయంతో యువకులు పరిగెత్తారు. ఇందులో భోలా(19) అనే యువకుడు గందరగోళంలో పక్కనున్న బావిలో పడిపోయాడు. బాధితుడిని బావిలో నుంచి తీసి స్థానిక ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయాడు. భోలా శరీరంపై గాయాలు ఉన్నాయని, అతన్ని తోటి స్నేహితులే బాగా కొట్టారని బోలా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
8 మంది సిమి కార్యకర్తల ‘ఎన్కౌంటర్’
- భోపాల్ జైలులో సెంట్రీని చంపి పరారైన సిమి కార్యకర్తలు - తర్వాత కొన్ని గంటలకే పోలీసు కాల్పుల్లో హతం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్న 8 మంది ‘సిమి’ కార్యకర్తలు పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యారు. పటిష్ట భద్రతగల ఈ జైలు నుంచి సిమి(స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా)కి చెందిన 8 మంది ఆదివారం అర్ధరాత్రి దాటాక జైలు సెక్యూరిటీ గార్డును చంపి తప్పించుకున్నారు. ఆ తర్వాత కొన్ని గంటలకే పోలీసులతో ఎదురుకాల్పుల్లో చనిపోయారు. అయితే.. ఇది బూటకపు ఎన్కౌంటర్ అని, సిమి కార్యకర్తలను పట్టుకుని కాల్చిచంపారని ఆరోపణలొచ్చాయి. ఎన్కౌంటర్ తర్వాత సామాజిక మీడియాలో, టీవీ చానళ్లలో ప్రసారమైన వీడియో క్లిప్‌లో.. నిర్జీవంగా పడివున్న సిమి కార్యకర్తలపైకి అతి సమీపం నుంచి తుపాకీతో కాలుస్తున్న దృశ్యం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్న 8 మంది ‘సిమి’ కార్యకర్తలు పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యారు. పటిష్ట భద్రతగల ఈ జైలు నుంచి సిమి(స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా)కి చెందిన 8 మంది ఆదివారం అర్ధరాత్రి దాటాక జైలు సెక్యూరిటీ గార్డును చంపి తప్పించుకున్నారు. ఆ తర్వాత కొన్ని గంటలకే పోలీసుల ఎదురుకాల్పుల్లో చనిపోయారు. అయితే.. ఇది బూటకపు ఎన్కౌంటర్ అని, సిమి కార్యకర్తలను పట్టుకుని కాల్చిచంపారని ఆరోపణలొచ్చాయి. ఎన్కౌంటర్ తర్వాత సామాజిక మీడియాలో, టీవీ చానళ్లలో ప్రసారమైన వీడియో క్లిప్‌లో.. నిర్జీవంగా పడివున్న సిమి కార్యకర్తల శరీరాలపైకి అతి సమీపం నుంచి తపాకీతో బుల్లెట్లు కాలుస్తున్న దృశ్యం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. సిమి కార్యకర్తలు 8 మంది విచారణ ఖైదీలుగా జైలులో ఒకే సెల్లో ఉండేవారని.. ఆదివారం దీపావళి సంబరాల్లో మునిగివున్న సమయంలో అర్ధరాత్రి దాటాక 2-3 గంటల మధ్య వారు సెంట్రీని హతమార్చి జైలు నుంచి తప్పించుకున్నారని భోపాల్ డీఐజీ రామన్‌సింగ్ తెలిపారు. స్పూన్లు, ప్లేట్లను పదునైన ఆయుధాలుగా వాడి ఒక సెంట్రీని కట్టివేసి, మరొక సెంట్రీని చంపేశారని.. తమ దుప్పట్లను తాడుగా కట్టి, దాని సాయంతో జైలు గోడలు ఎక్కి తప్పించుకున్నారని చెప్పారు. ఈ 8 మందిలో ఇద్దరు మూడేళ్ల కిందట ఖాంద్వాలోనూ ఇదేవిధంగా జైలు నుంచి తప్పించుకుని, ఆ తర్వాత పట్టుబడ్డట్లు తెలిపారు. ఈ ఘటనతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం గాలింపు చేపట్టింది. తప్పించుకున్న వారి ఊహాచిత్రాలను విడుదల చేసి, ఒక్కొక్కరి తలపై రూ. 5 లక్షల చొప్పున రివార్డు ప్రకటించింది. ఆ తర్వాత కొద్ది గంటలకే సెంట్రల్ జైలుకు 10 కిలోమీటర్ల దూరంలోని మాలిఖేదా గ్రామంలో ఈ 8 మందీ దాక్కున్నట్లు స్థానికుల ద్వారా సమాచారం అందిందని.. పోలీసు విభాగానికి చెందిన ఉగ్రవాద వ్యతిరేక బృందం(సీటీజీ), ఉగ్రవాద వ్యతిరేక స్క్వాడ్లు సోమవారం ఉదయం వారిని చుట్టుముట్టగా వారు ఎదురుదాడికి దిగారని.. పోలీసులు ఆత్మరక్షణ కోసం వారిని కాల్చిచంపారని డీఐజీ చెప్పారు. ఉగ్రవాదులు టూత్‌బ్రష్‌లు, చెక్కతో చేసిన తాళంచెవులతో జైలు గదుల తాళాల్ని తెరిచారని చెప్పారు. సిమి కార్యకర్తలు జైలు నుంచి తమ వెంట తెచ్చుకున్న పదునుదేర్చిన స్పూన్లు, ప్లేట్లు వంటి వాటిని పోలీసులపై దాడికి ఉపయోగించారని రాష్ట్ర హోంమంత్రి భూపేంద్రసింగ్ తెలిపారు. అయితే.. వారు కరడుగట్టిన ఉగ్రవాదులని, సెమీ-ఆటోమేటిక్ తుపాకులు, పదునైన మారణాయుధాలు ఉపయోగించారని, పోలీసులపై కాల్పులు జరిపారని ఐజీ యోగేష్చౌదరి తెలిపారు. హోంమంత్రి, ఐజీ ప్రకటనల్లో తేడా ఉండటంతో ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు తలెత్తాయి. మృతులపై తుపాకీ కాల్పులు...: ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత టీవీ చానళ్లలో ప్రసారమైన వీడియో దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఎన్కౌంటర్ ఘటనకు సంబంధించినదిగా భావిస్తున్న ఆ వీడియోలో.. సిమి కార్యకర్తలు అచేతనంగా నేలపై పడి ఉండగా, వారిపై ఒక పోలీసు.. రైఫిల్‌తో అతి సమీపం నుంచి గురి చూసి కాల్పులు జరుపుతున్న దృశ్యం కనిపించింది. చనిపోయివున్న ఒక వ్యక్తి జేబులో నుండి కొత్తదిగా కనిపిస్తున్న కత్తిని మరొక పోలీసు బయటకు తీయటం, మళ్లీ అదే స్థానంలో పెట్టేయడం వీడియోలో ఉంది. ‘ఇటువంటి పనులను వీడియో తీస్తారా?’ అని ఓ పోలీసు అనడం కూడా వినిపించింది. మరో వీడియోలో.. ఉగ్రవాదులు ఒక రాతిగుట్టపై ఉండగా, వారిని చుట్టుముట్టాలని పోలీసులు చెప్పడం వినిపించింది. ఈ వీడియోల వాస్తవికత నిర్ధారణ కాకపోయినప్పటికీ.. సిమి కార్యకర్తలను పట్టుకుని కాల్చిచంపేసి, ఎదురుకాల్పుల్లో చనిపోయినట్లు నాటకం అల్లుతున్నారన్న అనుమానాలను బలపరుస్తున్నాయి. అయితే.. వారు ఎదురు కాల్పుల్లోనే చనిపోయారని హోంమంత్రి భూపీందర్‌సింగ్ పునరుద్ఘాటించారు. అది ఎన్కౌంటర్ అని, వారిని తుదముట్టించటం మినహా పోలీసులకు ప్రత్యామ్నాయం లేకపోయిందన్నారు. సిమి ఉగ్రవాదులు జైలు నుంచి తప్పించుకోవడంపై జాతీయ దర్యాప్తు బృందం విచారణ జరుపుతుందని ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ చెప్పారు. మృతుల వివరాలు ఇవీ...: ఎన్కౌంటర్ మృతులను అమ్జాద్, జాకిర్ హుస్సేన్ సాదిక్, మొహమ్మద్ సాలిక్, ముజీబ్ షేక్, మెహ్బూద్ గుడ్డు, మొహమ్మద్ కాలిద్ అహ్మద్, అకీల్, మాజిద్‌లుగా గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. వారి నుంచి తుపాకులు, ఇతర మారణాయుధాలతో పాటు, జీపీఎస్ సౌకర్యం గల రిస్ట్ వాచీలు, బెల్టులు, రన్నింగ్ షూస్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వీరు మధ్యప్రదేశ్, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు, బ్యాంకు దోపిడీలు, దొంగతనాలు వంటి నేరాలకు పాల్పడ్డారన్నారు. సిమి కార్యకర్తలు జైలు నుంచి తప్పించుకున్న ఘటనకు సంబంధించి.. రాష్ట్ర జైళ్ల డీఐజీ, భోపాల్ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్, డిప్యూటీ జైల్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ జైల్ సూపరింటెండెండ్లను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. జైలు నుంచి తప్పించుకోవడంపై నివేదిక ఇవ్వాలని కేంద్రం రాష్ట్రాన్ని కోరింది. సుప్రీం పర్యవేక్షణలో దర్యాప్తు: ఒవైసీ ఎన్కౌంటర్ వాస్తవికతను నిర్ధారించటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఎఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తప్పుపట్టారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలన్నారు. హోంమంత్రి, పోలీసుల కథనాలు భిన్నంగా ఉన్నందున న్యాయ విచారణ జరపాలని మాజీ సీఎం, కాంగ్రెస్ నేత దిగ్విజయ్ డిమాండ్ చేశారు. నెలలో కూతురి పెళ్లి.. భోపాల్: సిమి కార్యకర్తలు భోపాల్ జైలు నుంచి తప్పించుకునేందుకు హత్య చేసిన హెడ్ కానిస్టేబుల్ రమాశంకర్యాదవ్ కుమార్తె వివాహం డిసెంబర్ 9వ తేదీన జరగాల్సి ఉంది. ఆయన తన కుమార్తె పెళ్లి ఏర్పాట్లలో తలమునకలై ఉండగా సిమి కార్యకర్తల చేతిలో చనిపోయాడని.. దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయిందని ఆయన బంధువులు పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. రమాశంకర్ ఇద్దరు కుమారులు శంభునాథ్ (36) గువాహటిలో, ప్రభునాథ్ (32) హిస్సార్‌లో సైన్యంలో పనిచేస్తున్నారని వివరించారు. సిమి చరిత్ర ఇదీ మొహమ్మద్ అహ్మదుల్లా అధ్యక్షుడిగా ‘సిమి’ 1977లో ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ఏర్పాటైంది. మొదట్లో ఇది జమాతే ఇస్లామీ హింద్‌కు విద్యార్థి విభాగం. అమెరికాపై సెప్టెంబర్11 దాడుల తర్వాత అదే నెలలో దీన్ని నిషేధించారు. 2008 ఆగస్ట్‌లో నిషేధాన్ని ఎత్తేసి, భద్రత దృష్ట్యా ఆ ఏడాది మళ్లీ నిషేధం విధించారు. మరో ఐదేళ్లపాటు నిషేధించాలని 2014లో కేంద్రం నిర్ణయించింది. టాడా, మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల చట్టం వంటి చట్టాల కింద సిమి సభ్యులపై కేసులు నమోదయ్యాయి. కొన్నాళ్లకు సిమి పంథాను మార్చుకుని ఉగ్రవాదం బాటపట్టింది. ఉత్తరప్రదేశ్‌లో సిమీకి ఎక్కువ పట్టుంది. ధార్వాడ టు హైదరాబాద్ వయా భోపాల్! సాక్షి, బెంగళూరు: ఎన్కౌంటర్ హతుల్లో ముగ్గురు కొద్దికాలం పాటు కర్ణాటకలోని ధార్వాడాలో ఉన్నట్లు సమాచారం. పోలీసు వర్గాల కథనం ప్రకారం.. అబుల్ఫైజల్ గ్యాంగ్ సభ్యులైన ఈ ముగ్గురు 2014లో ధార్వాడ తేజశ్వినీ నగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకున్నారు. ఈ సమయంలోనే చెన్నై రైల్వేస్టేషన్‌తో పాటు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో పేలుళ్లకు పథకాలు రచించినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి మధ్యప్రదేశ్‌కు చేరి అక్కడ బాంబుపేలుళ్లకు పాల్పడ్డారు. తిరిగి బీదర్‌కు చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్‌కు వెళ్లారు. అక్కడ ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కారు. -
జైలు నుంచి 8మంది ఉగ్రవాదుల ఎస్కేప్
-
జైలు నుంచి 8మంది ఉగ్రవాదుల ఎస్కేప్
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని భోపాల్ సెంట్రల్ జైలు నుంచి 8మంది స్టూడెంట్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా(సిమీ) ఉగ్రవాదులు తప్పించుకున్నారు. స్టీల్ కంచం, గ్లాస్‌తో జైలు సెక్యురిటీ గార్డుగా ఉన్న హెడ్ కానిస్టేబుల్ రమా శంకర్ గొంతు కోసి హత్య చేశారు. సిమీ ఉగ్రవాదులు బెడ్షీట్లతో తాడులా తయారు చేసి, దాని సహాయంతో ప్రహారి గోడను దూకి తప్పించుకున్నారని భోపాల్ ఎస్పీ అరవింద్ సక్సెనా తెలిపారు. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామన్నారు. యూపీ, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడులో జరిగిన పేలుళ్ల వెనుక వీరి హస్తం ఉంది. మరోపైపు ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు జైలు ఉన్నతాధికారులను సస్పెండ్ చేస్తున్నట్టు మధ్య ప్రదేశ్ హోం మంత్రి భూపేంద్రసింగ్ వెల్లడించారు. సిమీ ఉగ్రవాదుల పరారీకి సంబంధించి పూర్తిసమాచారాన్ని అందించవల్సిందిగా కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కోరారు. ఇంతకుమందు కూడా ఇదే తరహాలో సిమీ ఉగ్రవాదులు జైలు నుంచి తప్పించుకున్నారు. 2013లో ఏడుగురు సిమీ ఉగ్రవాదులు ఖాంద్వా జైలు మరుగుదొడ్డి కిటికీ ఇనుప రాడ్డులను తొలిగించి పరారయ్యారు. ఇద్దరు జైలు సెక్యురిటీ సిబ్బందిపై దాడి చేసి రైఫిళ్లు, వైర్లెస్ సెట్లను తస్కరించారు. పరారైన వారిలో ఇద్దరు ఉగ్రవాదులు నల్లగొండ జిల్లా ఎన్కౌంటర్లో హతమయ్యారు. -
ఖైరతాబాద్ గణేశుని చూడాలని పారిపోయారు
-
వీళ్లు పోలీసులేనా..!
అసలే దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉంది. ఉగ్రవాదులు, విద్రోహశక్తులు ఏక్షణమైనా విరుచుకుపడొచ్చని, ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్ వర్గాలు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీచేస్తూనేఉన్నాయి. ఇక నిత్యం అసాధారణ స్థితిలో కొనసాగే జమ్ముకశ్మీర్ లోనైతే ఇంచు ఇంచూ వదలకుండా సోదాలు, 24x7 కాపలా తప్పనిసరి. అయితే క్షేత్రస్థాయి పోలీసులు ఇవేవీ పట్టనట్లు.. తమకు అలవాటైన సోమరితనంలోనే జోగుతున్నారు సరిహద్దు రాష్ట్రంలో. అనుమానిత ఉగ్రవాదులు గుట్టుగా వచ్చి, తుపాకులు లాక్కుపోయినా చలనంలేని వ్యవస్థను ఏమనాలి? జమ్ముకశ్మీర్ లోని కుల్గాం జిల్లా అడిజన్ చెక్ పోస్టు వద్ద కాపలాకాస్తున్న పోలీసుల చేతుల్లోనుంచి నాలుగు తుపాకులు లాక్కొన్న ఉగ్రవాదులు అడవిలోకి పరారయ్యారు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సయంలో చోటుచేసుకున్న ఈ సంఘటనలో నిందితులకోసం ఇంకా గాలిస్తూనేఉన్నారు. మైనారిటీలు ఉండే ప్రాంతంలో చెక్ పోస్ట్ ను ఏర్పాటుచేసిన పోలీస్ శాఖ అక్కడ నిరంతరం నలుగురు సిబ్బందిని కాపలాగా ఉంచుతుంది. వాళ్ల పనితీరు ఎలా ఉందో నేటి ఘటనతో వెలుగులోకి వచ్చింది. దుండగులు ఎత్తుకెళ్లినవాటిల్లో రెండు ఎస్ఎల్ ఆర్ లు, రెండు ఐఎన్ఎస్ఏఎస్ రైఫిళ్లు ఉన్నాయని, దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తామని ఉన్నతాధికారులు చెప్పారు. -
బెడ్ షీట్లే తాళ్లుగా బాలనేరస్తుల పరారీ
గట్టిగా కొలిస్తే ఐదున్నర అడుగుల ఎత్తైనాలేని నలుగురు బాలనేరస్తులు.. 10 అడుగుల గోడ దూకి జువెనైల్ హోమ్ నుంచి పరారైన సంఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ లో చోటుచేసుకుంది. గతేడాది సంచలన రీతిలో ఒకేసారి 91 మంది బాలనేరస్తులు పారిపోయింది కూడా ఇదే వసతి గృహం నుంచి కావడం గమనార్హం. బెడ్ షీట్లు, బ్లాంకెట్లను తాళ్లుగా మలిచిన బాలనేరస్తులు గురువారం రాత్రి వసతి గృహం గోడదూకి పారిపోయారని, ఆ గోడ ఎత్తు10 అడుగులని నిర్వాహకులు చెప్పారు. పరారీ విషయం తెలుసుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బాలనేరస్తుల కోసం వేట ప్రారంభించారు. కాగా, గతేడాది హోమ్ నుంచి తప్పించుకున్న91 మంది జువెనైల్స్ లో 80 మంది పోలీసులకు చిక్కగా.. మరో 11 మంది ఇప్పటికీ పట్టుబడలేదు. ఇంతలోనే మరోసారి బాలనేరస్తులు పారిపోవటంతో వసతి గృహం నిర్వాహకులపై ఉన్నతాధికారులు మండిపడుతున్నారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు మీరట్ జిల్లా పోలీసు అధికారి పుష్పేంద్ర సింగ్ తెలిపారు. -
అనాథ శరణాలయంపై 'లవ్ అటాక్'..
► తుపాకితో గార్డును బెదిరించి పరారైన ప్రేమికులు ► అదనుగా భావించి తప్పించుకున్న మరో 20 మంది మహిళలు మథుర: కారాగారంలో ఉంటున్న తమవాళ్లను విడిపించుకునేందుకు తాలిబన్లు ఏకంగా జైళ్లనే బద్దలుకొట్టిన సంఘటనలు అఫ్ఘానిస్థాన్‌లో తరచూ జరుగుతుండటం తెలిసిందే. ఆ రేంజ్లో కాకున్నా ప్రేమించిన అమ్మాయిలను తమతో తీసుకెళ్లేందుకు ఏకంగా అనాథ శరణాలయం గేట్లను బద్దలుకొట్టింది ఓ ప్రేమికుల గ్యాంగ్. వివరాల్లోకి వెళితే.. మథుర పట్టణంలోని నారి నికేతన్ అనే అనాథ శరణాలయంలో దాదాపు 30 మంది మహిళలు ఆశ్రయం పొందుతున్నారు. వీరిలో అన్ని వయస్కుల వారూ ఉన్నారు. గురువారం రాత్రి సమయంలో ముసుగులు ధరించిన కొందరు యువకులు తుపాకులతో అక్కడికి చేరుకుని, గార్డుపై కాల్పులు జరిపి గేట్లను బద్దలుకొట్టారు. శరణాలయంలోకి ప్రవేశించి గాలిలోకి కాల్పులు జరిపి అక్కడున్నవారిని భయభ్రాంతలకు గురిచేశారు. సీన్ కట్ చేస్తే.. నిర్వహకులు అందించిన సమాచారంతో పది నిమిషాల తర్వాత శరణాలయానికి చేరుకున్న పోలీసులు.. మొత్తం 22 మంది మహిళలు తప్పించుకున్నట్లు గుర్తించారు. అప్పటికప్పుడే ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి గాలింపుచర్యలను ముమ్మరం చేశారు. కొద్ది గంటల్లోనే 19 మంది మహిళలు పోలీసులకు చిక్కారు. వారి నుంచి సేకరించిన సమాచారం ప్రకారం ఇంకా పరారీలోనే ఉన్న పూజ, శిల్ప అనే యువతుల కోసమే శరణాలయంపై దాడి జరిగినట్లు పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. శరణాలయంలో సౌకర్యాలు కల్పించడంతో సదరు యువతులకు బయటికి వెళ్లే అవకాశం ఉండదని, అందుకే వారి ప్రేమికులు దాడి చేసి మరీ పూజ, శిల్పలను తీసుకెళ్లారని, సందట్లో సడేమియాలా మరో 19 మంది పారిపోయారని ప్రాధమిక దర్యాప్తులో తేలింది. ఆ ఇద్దరి వెంట ఓ రెండేళ్ల చిన్నారి కూడా ఉన్నట్లు శరణాలయం ప్రతినిధులు చెబుతున్నారు. అయితే ఇది కేవలం లవ్ అటాకేనా లేక దీని వెనుక మహిళల అక్రమరవాణా ముఠాల హస్తమేమైనా ఉందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.