వాళ్లు ఎవరైనా కాల్చిపారేయాల్సిందే!
లక్నో: భోపాల్ సెంట్రల్ జైలు నుంచి తప్పించుకొని.. ఆ తర్వాత పోలీసుల చేతిలో హతమైన ఎనిమిది మంది సిమీ కార్యకర్తల ఎన్‌కౌంటర్ ఘటనపై ఎస్పీ సీనియర్ నేత, ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజంఖాన్ స్పందించారు. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనేవారందరినీ చంపేయాల్సిందేనని, వారు సిమీ ఉగ్రవాదులా? లేక వేరేవారా? అన్నది చూడకూడదని వ్యాఖ్యానించారు.
వన్ ర్యాంక్ వన్ పెన్షన్ విషయంలో ఆత్మహత్య చేసుకున్న మాజీ జవాను రాంకిషన్ గ్రెవాల్ నివాసాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ సందర్శించడంపైనా ఆయన తనదైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ లబ్ధి కోసమే రాహుల్ జవాను నివాసాన్ని సందర్శించారని పేర్కొన్నారు.