న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కబేళాలను మూసివేయించడాన్ని ఎస్పీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆజం ఖాన్ తప్పుపట్టారు. దేశ వ్యాప్తంగా కబేళాలపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు.
'కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో కబేళాలు నిర్వహించడాన్ని ఎందుకు చట్టబద్ధం చేశారు? మిగిలిన రాష్ట్రాల్లో ఎందుకు చేయలేదు? దేశ వ్యాప్తంగా కబేళాలపై నిషేధం విధించాలి. ఇలాంటి అంశాలపై దేశమంతా ఒకే చట్టం ఉండాలి' అని ఆజం ఖాన్ అన్నారు. యూపీలో లైసెన్స్ ఉన్న కబేళాల నిర్వహణకు ప్రభుత్వం అనుమతించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. లైసెన్స్ ఉన్న కబేళాలలో గోవులను వధించవచ్చని, అనుమతి లేని చోట్ల ఈ పని చేయరాదనేది ప్రభుత్వం ఉద్దేశమని అర్థమవుతోందని అన్నారు. లైసెన్స్ ఉన్న, లైసెన్స్ లేని కబేళాలు అన్న పద్దతికి స్వస్తి చెప్పి, అన్నింటినీ మూసివేయించాలని, ఏ జంతువునూ సంహరించరాదని చెప్పారు. కొన్ని మతాలకు చెందిన వారు కోడి, మేక మాంసం కూడా తినరని పేర్కొన్నారు. గొడ్డు మాంసం తినడం మానేయాలని ముస్లింలకు ఆజం ఖాన్ సూచించారు.
దేశవ్యాప్తంగా వాటిపై నిషేధం విధించండి
Published Tue, Mar 28 2017 9:03 AM | Last Updated on Tue, Sep 5 2017 7:20 AM
Advertisement
Advertisement