terror activity
-
జమ్ము కశ్మీర్లో తీవ్రవాదుల కుట్ర భగ్నం
-
ఢిల్లీ పేలుడు : ఇది ట్రైలర్ మాత్రమే
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో సంభవించిన ఐఈడి పేలుడు ఆందోళన రేపింది. దీనిపై కేంద్రం సీరియస్‌గా స్పందిస్తోంది. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రికి పూర్తి రక్షణ కల్పిస్తామని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హామీ ఇచ్చారు.అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీనియర్ పోలీసు అధికారులతో సంప్రదిస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ దాడి నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇతర దేశాల రాయబార కార్యాలయాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు అలాగే దేశంలోని పలు విమానాశ్రయాల్లో గట్టి భద్రతా జాగ్రత్తలు పాటించాలని అధికారులు ఆదేశించారు. దీంతో ఢిల్లీ, ముంబై, జైపూర్, యూపీ తదితర స్టేట్స్లో విమానాశ్రయాలకు హై అలర్ట్ ప్రకటించారు. ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినస్ రైల్వే స్టేషన్, సహా అన్ని ప్రదేశాలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. జైపూర్ నగరంలో హై అలర్ట్ ప్రకటించామని రాజస్థాన్ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. దేశ రాజధానిలో గణతంత్ర దినోత్సవం ముగింపు వేడుకలు జరిగిన ప్రదేశానికి సమీపంలో సుమారు 50 మీటర్ల దూరంలో అబ్దుల్ కలాం రోడ్డులో శుక్రవారం సాయంత్రం ఈ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. డిప్యూటీ కమిషనర్ (డిసిపి) ప్రమోద్ కుష్వాతో సహా సీనియర్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఢిల్లీలో తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో సీసీటీవీ కెమెరాలను పరిశీలన సందర్భంగా పేవ్మెంట్ కింద పేలుడు పదార్థాలను అమర్చినట్టు గుర్తించారు. పేలుడుకు అమ్మోనియం నైట్రేట్ వినియోగించినట్టు ఫోరెన్సిక్ ఆధారాలను బట్టి అధికారులు భావిస్తున్నారు. దీంతోపాటు క్యాబ్‌లో ఇద్దరు వ్యక్తులు అక్కడ దిగినట్టు గుర్తించిన పోలీస్ స్పెషల్ సెల్ అధికారులుక్యాబ్ డ్రైవర్నుంచి వివరాలను ఆరా తీస్తున్నారు. అలాగే ఇజ్రాయెల్ రాయబారికి పంపినట్టుగా భావిస్తున్న పింక్ స్కార్ఫ్, ఒక కవరును కూడా సంఘటనా స్థలానికి 12 గజాల దూరంలో స్వాధీనం చేసుకున్నారు. పేలుడును “ట్రైలర్” గా ఈలేఖలో ప్రకటించినట్టు తెలుస్తోంది. అలాగే గత ఏడాది హత్యకు గరైన ఇరాన్ టాప్ సైనికాధికారి ఖాసిం సోలైమాని, అణు శాస్త్రవేత్త మొహ్సేన్ ఫఖ్రిజాదేహ్ లను అమర వీరులుగా పేర్కొన్నట్టు సమాచారం. దీంతో ప్రతీకార చర్యగానే ఈ దాడి జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ పేలుడు 'ఉగ్రవాద దాడి' కావచ్చని రాయబారి రాన్ మాల్కా చెప్పారు. భారత అధికారులపై పూర్తి విశ్వాసాన్ని ప్రకటించారు. అటు ఈ వ్యవహారాన్ని చాలా తీవ్రంగా పరగణిస్తున్నామని ఇజ్రాయె మంత్రి గబీ అష్కెనాజీ వెల్లడించారు. తమ దౌత్యవేత్తలకు పూర్తి రక్షణ కల్పిస్తామన్నారు. దర్యాప్తు జరుగుతోందని, దోషులను క్షమించే ప్రశ్నే లేదంటూ ట్విట్ చేశారు. #WATCH | Delhi Police Special Cell team outside Israel Embassy in New Delhi where a low-intensity explosion took place yesterday. pic.twitter.com/mmpNbhDkV4 — ANI (@ANI) January 30, 2021 Blast outside Israeli Embassy could be a 'terror attack', says envoy Ron Malka Read @ANI Story | https://t.co/90BQrgcrmj pic.twitter.com/8wMfw1xWFT — ANI Digital (@ani_digital) January 30, 2021 In 2012, there was a terror attack on Israeli diplomats in Delhi not far from Embassy. It might be connected, there might be a pattern. We're investigating & this is one of the options: Ambassador of Israel to India Ron Malka on possibility of link b/w explosions in 2012&onJan 29 pic.twitter.com/1RKX6MKhVW — ANI (@ANI) January 30, 2021 -
‘ఉగ్ర నిధులకు కోత’
న్యూఢిల్లీ : ఉగ్రవాదులను మట్టికరిపించాలంటే వారి సిద్ధాంతంతో పోరాడాల్సిన అవసరం ఉందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెప్పుకొచ్చారు. ‘ఉగ్రవాదం కొత్తేమీ కాదు..ఉగ్రవాదుల నుంచి ఆయుధాన్ని..వారి భావజాలాన్ని దూరం చేసినప్పుడే ఉగ్రవాదుల స్థైర్యాన్ని దెబ్బతీయగల’మని జాతీయ దర్యాప్తు ఏజెన్సీ కార్యక్రమంలో పాల్గొన్న దోవల్ పేర్కొన్నారు. ఉగ్రవాదంతో పోరాడటం ఒక్కటే సరిపోదని ఉగ్ర నిధులను నియంత్రించి వారిని ఏకాకులుగా చేయాలని చెప్పారు. నేరస్తుడికి ప్రభుత్వ ఊతం లభిస్తే మరింత చెలరేగుతాడని, అది ఉగ్రవాదంపై పోరాటాన్ని మరింత సంక్లిష్టం చేస్తుందని అన్నారు. ఈ ప్రక్రియలో కొన్ని ప్రభుత్వాలు ఆరితేరాయని, దురదృష్టవశాత్తూ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోషించడం ప్రభుత్వ విధానంగా పెట్టుకుందని దుయ్యబట్టారు. ఉగ్రవాద నిరోధక బృందాల చీఫ్‌లు, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ హెడ్ల సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ దోవల్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
కశ్మీర్ ప్రజలపై ఉగ్ర కుట్ర
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్ ప్రజల రోజువారీ దినచర్యను అడ్డుకుని సాధారణ పరిస్థితికి భగ్నం కల్పించేందుకు పాక్ ఉగ్రసంస్ధలు లష్కరే, జైషే సహా పలు ఉగ్ర మూకలు ప్రయత్నిస్తున్నాయని జమ్ము కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ పేర్కొన్నారు. రోజువారీ విధులను విరమించాలంటూ ప్రజలపై ఈ ఉగ్రసంస్ధలు ఒత్తిడి చేస్తున్నా ప్రజలు వాటిని ఖాతరు చేయడం లేదని స్పష్టం చేశారు. కశ్మీర్లో అన్ని పెట్రోల్ పంపులు తెరిచిఉంటున్నాయని, భద్రతా బలగాలు కట్టుదిట్టమైన భద్రతను అందిస్తున్నాయని చెప్పారు. సొపోర్‌లో జైషే మహ్మద్ ఉగ్రసంస్ధ తరపున పనిచేస్తున్న ఓ గ్రూప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సింగ్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఎనిమిది మందిని అరెస్ట్ చేశారని చెప్పారు. పలు ప్రాంతాల్లో ప్రజలను బెదిరిస్తూ పోస్టర్లు అంటిస్తున్న వీరిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. సొపోర్‌లో ముగ్గురు స్ధానిక ఉగ్రవాదుల తరపున వీరు పనిచేస్తున్నట్టు గుర్తించామని అన్నారు. -
దౌత్య విజయం
మన దేశం ఐక్యరాజ్యసమితిలో ఎడతెగకుండా చేస్తున్న ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. పాకిస్తాన్ సైన్యం చెప్పుచేతల్లో నడిచే గూఢచార సంస్థ ఐఎస్ఐకు సన్నిహితుడైన జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను ‘అంతర్జాతీయ ఉగ్రవాది’గా సమితి ప్రకటించింది. భారత్ ప్రయత్నాలకు పదేళ్లనుంచి మోకాలడ్డుతున్న చైనా తన వైఖరి మార్చుకోవడంతో ఇది సాధ్యమైంది. సార్వత్రిక ఎన్నికల సమరం హోరాహోరీగా సాగుతున్న వేళ వెలువడిన ఈ నిర్ణయం సహజంగానే బీజేపీకి సంతోషాన్నిచ్చింది. ప్రధాని నరేంద్రమోదీ ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని ఆ పార్టీ ట్వీటర్ ద్వారా ప్రకటించింది. ఆ వెంటనే మసూద్ అజర్ వ్యవహారంపై బీజేపీ–విపక్షాల మధ్య వాగ్యుద్ధం మొదలైంది. ఈ పదేళ్లలో రెండుసార్లు– 2008లో ముంబైపై ఉగ్రవాది దాడి జరిగాక, 2016లో పఠాన్‌కోట్ వైమానిక దళ స్థావరంపై ఉగ్రవాదులు విరుచుకుపడినప్పుడు మన దేశం అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న తీర్మానాలను భద్రతామండలికి అనుబంధంగా ఉన్న 1267 ఆంక్షల కమిటీలో ప్రతిపాదించింది. ఆ రెండుసార్లూ చైనాకు ‘సాంకేతిక కారణాలు’ అడ్డొ చ్చాయి. 2017లో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు తీర్మానం తీసుకొచ్చినప్పుడు కూడా దాన్ని వ్యతిరేకించడానికి చైనా ఈ సాకే చెప్పింది. ఇలా మోకాలడ్డిన ప్రతిసారీ ఆ వ్యవహారాన్ని పరి శీలించడానికి తనకు ‘మరింత సమయం’ అవసరమని చెబుతూ వచ్చింది. ఈ ‘సాంకేతిక కార ణాలు’, ఇతర అభ్యంతరాలతో సంబంధం లేకుండా జైష్ సంస్థ తన పని తాను చేసుకుపోతూనే ఉంది. ఈమధ్య కశ్మీర్‌లోని పుల్వామాలో 43మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన ఉగ్రవాద దాడి తన ఘనతేనని ఆ సంస్థ ప్రకటించుకుంది. దాన్నే ప్రస్తావిస్తూ మొన్న ఫిబ్రవరి, మార్చి నెలల్లో మన దేశం మరోసారి తీర్మానాలు ప్రవేశపెట్టినప్పుడు సైతం చైనా యధాప్రకారం అడ్డుకుంది. ఆ రెండుసార్లూ ‘సంబంధిత పక్షాలన్నిటితో మాట్లాడిన అనంతరం నిర్ణయిస్తామ’ని చెప్పి తప్పించుకుంది. కానీ తాజాగా తీర్మానం ప్రవేశపెట్టిన అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్లు గట్టిగా ఒత్తిడి తీసుకురావడంతో చైనా దారికి రాక తప్పలేదు. పాత తీర్మానాలకూ, ప్రస్తుత తీర్మానానికీ వ్యత్యాసం ఉండటం వల్లే అంగీకరించానని, ‘ఆయా దేశాల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నానని ఆ దేశం చెబుతోంది. మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం దౌత్యపరంగా ఘన విజయమన డంలో సందేహమేమీ లేదు. అలాగని అందువల్ల ఏదో ఒరుగుతుందని చెప్పడం కూడా తొందర పాటే అవుతుంది. ఇప్పటికైతే ఈ చర్య పాకిస్తాన్‌ను అంతర్జాతీయ వేదికపై దోషిగా నిలబెట్టింది. దాన్ని ఒంటరిని చేసింది. అది ఇన్నేళ్లుగా మసూద్ అజర్ ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నాడ నటానికి ఆధారాలేమీ లేవని దబాయిస్తూ వస్తోంది. పఠాన్‌కోట్, పుల్వామా దాడుల్లో అతగాడి ప్రమేయం ఉన్నదని నిరూపించడానికి అవసరమైన సాక్ష్యాధారాలు అందించాలని మన దేశాన్ని సవాలు చేస్తోంది. ఇచ్చిన సాక్ష్యాధారాలు చాలవంటున్నది. అదేం చెప్పినా చైనా సమర్థిస్తూనే ఉంది. కానీ ఈసారి అది కుదరలేదు. ఇందుకు అంతర్జాతీయంగా వచ్చిన ఒత్తిళ్లు ఒక కారణమైతే, మన దేశం ఓపిగ్గా సాగించిన దౌత్య కృషి మరో కారణం. చైనాతో మన దౌత్యవేత్తలు పలుమార్లు చర్చిం చారు. దాని వైఖరిలోని లోపాలను ఎత్తిచూపారు. ఇది సత్ఫలితాన్నిచ్చిందని తాజా పరిణామం తెలియజెబుతోంది. మౌలికంగా ఐక్యరాజ్యసమితి చర్య ప్రతీకాత్మకమైనది. పాకిస్తాన్ మనస్ఫూర్తిగా సహకరించి మసూద్ కార్యకలాపాలన్నీ స్తంభింపజేస్తేనే, అతడి సంస్థపై కఠిన చర్యలు ప్రారంభిస్తేనే ఎంతో కొంత ఫలితం ఉంటుంది. కానీ పాక్ గత చరిత్ర తెలిసినవారెవరూ అది ఆ పని చేస్తుందని విశ్వసిం చరు. ఇప్పటికీ ఆ దేశంలో రహస్యంగా ఆశ్రయం పొందుతున్న నేరగాడు దావూద్ ఇబ్రహీం, బహిరంగంగా ఉంటున్న జమాత్ ఉద్ దవా(జేయూడీ) చీఫ్ హఫీజ్ సయీద్ వంటివారే ఇందుకు రుజువు. వారిద్దరూ పదేళ్లుగా అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో ఉన్నారు. సయీద్‌ను అప్ప గించినా, హతమార్చినా కోటి డాలర్లు ఇస్తానని అమెరికా 2012లో ప్రకటించింది కూడా. దావూద్ తమ వద్ద లేడని పాక్ ఇప్పటికీ బుకాయిస్తోంది. సయీద్ తరచు స్థానిక పత్రికలకు వ్యాసాలు కూడా రాస్తున్నాడు. మసూద్ జీవితం వారికి భిన్నంగా ఉంటుందని అనుకోనవసరం లేదు. మహా అయితే ఫలానా ఉగ్రదాడి తమ ఘనతేనని ఇకపై అతడు చెప్పుకోవడం మానేయొచ్చు. వాస్తవానికి భద్రతామండలికి అనుబంధంగా 1999లో ఏర్పడిన 1267 ఆంక్షల కమిటీ అల్ కాయిదాపై ఆంక్షలు విధించడానికి ఉద్దేశించింది. అల్ కాయిదాకు సహకరిస్తున్నారనుకునే వ్యక్తులనూ, సంస్థలనూ అనంతరకాలంలో దాని పరిధిలోకి తెచ్చారు. ఫలానా వ్యక్తులు, సంస్థల కార్యకలాపాలు ఉగ్ర వాదానికి ఊతమిస్తున్నాయని ఏ దేశమైనా తీర్మానం ప్రతిపాదిస్తే అది ఏకగ్రీవ ఆమోదం పొందాలి. అప్పుడు మాత్రమే అంతర్జాతీయ ఉగ్రవాదులుగా, ఉగ్రసంస్థలుగా పరిగణించడం సాధ్యపడు తుంది. అలా ప్రకటించిన సంస్థల, వ్యక్తుల ఆస్తులు ప్రపంచంలో ఏమూలనున్నా స్తంభింపజేస్తారు. ప్రపంచ ఉగ్రవాదిగా ముద్రపడిన వ్యక్తులను ఏ దేశమూ తమ గడ్డపైకి అడుగుపెట్టనీయదు. మసూద్‌కు న్యూయార్క్, లండన్ వంటిచోట ఆస్తులేమీ లేవు. బ్యాంకు ఖాతాలు కూడా లేవు. పైగా అతడు పాకిస్తాన్ దాటి బయటికెళ్లే రకం కాదు. కనుక అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రపడటం వల్ల అతగాడికి వచ్చే నష్టమేమీ లేదు. అయితే ఇదే అదునుగా మన దేశం కశ్మీర్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించి అక్కడ ఉద్రిక్తతలు ఉపశమించడానికి తగిన చర్యలన్నీ తీసుకోవాలి. మసూద్ విషయంలో పాక్‌పై మున్ముందు కూడా అమెరికా ఒత్తిడి తీసుకొచ్చేలా చేస్తే కశ్మీర్లో ఉగ్ర వాద చర్యలు కాస్తయినా తగ్గే అవకాశం ఉండొచ్చు. కేవలం నామమాత్ర ప్రకటన చేసి, ఆ తర్వాత పట్టించుకోనట్టయితే పెద్దగా ఫలితం ఉండదు. -
మదర్సాలపై షియా బోర్డ్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : మదర్సాలలో ఇంజనీర్లు, డాక్టర్లు, ఐఏఎస్ అధికారులు తయారుకావడం లేదని.. కొన్ని మదర్సాలలో ఉగ్రవాద బీజాలే పడుతున్నాయని షియా బోర్డు చీఫ్ వాసిం రిజ్వి ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌లకు రాసిన లేఖలో పేర్కొన్నారు. మదర్సాలను ప్రధాన విద్యా స్రవంతిలోకి చేరేలా చర్యలు చేపట్టాలని కోరారు. మదర్సాలను విద్యా మండళ్ల పర్యవేక్షణ కిందకు తీసుకురావాలని, వీటిని సీబీఎస్ఈ, ఐసీఎస్ఈలకు అనుబంధంగా చేర్చాలని సూచించారు. మతపరమైన విద్యను ఐచ్ఛికం చేయాలని కోరారు. కొన్ని మదర్సాలు ఉగ్ర కార్యకలాపాలకు నిలయంగా మారాయని రిజ్వి ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు రిజ్వి ప్రకటనపై పలు ఇస్లామిక్ సంస్థలు మండిపడుతున్నాయి. షియా బోర్డ్ ఛైర్మన్‌ను బఫూన్‌గా ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ అభివర్ణించారు. ‘వాసిం రిజ్వి పెద్ద జోకర్..అవకాశవాద వ్యక్తి..ఆయన తన ఆత్మను ఆర్ఎస్ఎస్కు అమ్ముకున్నార’ ని వ్యాఖ్యానించారు. మదర్సాలలో ఉగ్ర బోధనలు జరిగితే అందుకు తగిన ఆధారాలను ఆయన నేరుగా హోంమంత్రికి అందించవచ్చు కదా అని ప్రశ్నించారు. -
‘పాకిస్తాన్‌ది ఉగ్రవిధానం’
సాక్షి, న్యూఢిల్లీ : ఉగ్రవాదం.. పాకిస్తాన్ దేశ విధానం అని చెప్పడానికి ఆదేశ మాజీ అధ్యక్షుడు ముషరాఫ్ వ్యాఖ్యలే నిదర్శనమని కేంద్ర క్రీడల శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ చెప్పారు. లష్కేరే తోయిబా, హఫీజ్ సయీద్‌పై ముషారఫ్ చేసిన వ్యాఖ్యలు చాలా కీలకమని ఆయన అన్నారు. లష్కరే తోయిబా, హఫీజ్ సయీద్‌పై ముషారఫ్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఉగ్రవాదానికి ఊతమిచ్చేలా ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటున్న ముషారఫ్.. పాకిస్తాన్‌లోని ఒక న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ.. లష్కరేతోయిబా, హఫీజ్ సయీద్‌కు తాను అభిమాననింటూ చెప్పుకున్నారు. అదే సమయంలో కశ్మీర్ వేర్పాటు వాదం, ఉగ్రవాదాలను సమర్థిస్తున్నట్లు ముషారఫ్ చెప్పుకోచ్చారు. ముషారఫ్ ఇంటర్వ్యూపై రాథోర్ ట్విటర్లో స్పందించారు. పాకిస్తాన్.. ఉగ్రవాదాన్ని దేశ విధానంగా అనుసరిస్తున్నట్లు అనిపస్తోందని రాజ్యవర్ధన్ సింగ్ రాధోడ్ ట్వీట్ చేశారు. Pervez Musharraf has openly endorsed terror as state policy, says @Ra_THORe https://t.co/X59vAmqwUj — Rajyavardhan Rathore (@Rathore_Fans) November 30, 2017 -
ఐఎస్ఐ భారీ కుట్ర.. భారత్‌పైకి హంతక ముఠా
ఇస్లామాబాద్ : 'ఉగ్రవాదులను అణచివేస్తున్నామంటూ పాకిస్థాన్ ప్రభుత్వం చెబుతుంటే ఆ దేశ నిఘా సంస్థ ఐఎస్ఐ మాత్రం ఉగ్రవాదులతో సంబంధాలు నెరుపుతోంది' ఈ మాటలు స్వయంగా అగ్రరాజ్యం అమెరికా అన్నది. ఇప్పుడు తాజాగా బయటకు తెలిసిన విషయం వింటే ఆ మాటలు నిజమేనేమో అనిపించకమానదు. ఎందుకంటే భారత్‌పై దాడులకు ఉసిగొలుపుతూ ఐఎస్ఐ ఒక ముఠాను తయారు చేసింది. దానికి హలాల్ దస్తా అనే పేరు పెట్టి ఇప్పటికే ప్రారంభించింది. హలాల్ దస్తా అనగా హంతకుల ముఠా.. ఇందులో ఉన్నవాళ్లంతా బ్యాన్ చేసిన లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులని భారత్‌కు చెందిన టాప్ ఇంటెలిజెన్స్ సంస్థ హెచ్చరించింది. ఆయా వర్గాల సమాచారం ప్రకారం ఈ హంతక ముఠా ఇప్పటికే భారత్ వైపు బయలుదేరిందట. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న జమ్ముకశ్మీర్‌లోని సురాన్‌కోట్, పూంచ్ జిల్లాల్లో దాడులే లక్ష్యంగా ఈ ముఠా కదిలింది. స్వయంగా పాకిస్థాన్ ఆర్మీకి చెందిన యాక్షన్ టీం పనిచేసే ప్రాంతం నుంచే ఈ ముఠాతో భారత్‌పై దాడులు చేయించేందుకు సిద్ధం చేసి ఐఎస్ఐ భారత్‌కు పంపిస్తుంది. గతవారమే పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్ టీం భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. -
వాళ్లు ఎవరైనా కాల్చిపారేయాల్సిందే!
లక్నో: భోపాల్ సెంట్రల్ జైలు నుంచి తప్పించుకొని.. ఆ తర్వాత పోలీసుల చేతిలో హతమైన ఎనిమిది మంది సిమీ కార్యకర్తల ఎన్కౌంటర్ ఘటనపై ఎస్పీ సీనియర్ నేత, ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజంఖాన్ స్పందించారు. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనేవారందరినీ చంపేయాల్సిందేనని, వారు సిమీ ఉగ్రవాదులా? లేక వేరేవారా? అన్నది చూడకూడదని వ్యాఖ్యానించారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ విషయంలో ఆత్మహత్య చేసుకున్న మాజీ జవాను రాంకిషన్ గ్రెవాల్ నివాసాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ సందర్శించడంపైనా ఆయన తనదైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ లబ్ధి కోసమే రాహుల్ జవాను నివాసాన్ని సందర్శించారని పేర్కొన్నారు.