సాక్షి, న్యూఢిల్లీ : ఉగ్రవాదం.. పాకిస్తాన్ దేశ విధానం అని చెప్పడానికి ఆదేశ మాజీ అధ్యక్షుడు ముషరాఫ్ వ్యాఖ్యలే నిదర్శనమని కేంద్ర క్రీడల శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ చెప్పారు. లష్కేరే తోయిబా, హఫీజ్ సయీద్‌పై ముషారఫ్ చేసిన వ్యాఖ్యలు చాలా కీలకమని ఆయన అన్నారు. లష్కరే తోయిబా, హఫీజ్ సయీద్‌పై ముషారఫ్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఉగ్రవాదానికి ఊతమిచ్చేలా ఉన్నాయని అన్నారు.
ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటున్న ముషారఫ్.. పాకిస్తాన్‌లోని ఒక న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ.. లష్కరేతోయిబా, హఫీజ్ సయీద్‌కు తాను అభిమాననింటూ చెప్పుకున్నారు. అదే సమయంలో కశ్మీర్ వేర్పాటు వాదం, ఉగ్రవాదాలను సమర్థిస్తున్నట్లు ముషారఫ్ చెప్పుకోచ్చారు.
ముషారఫ్ ఇంటర్వ్యూపై రాథోర్ ట్విటర్‌లో స్పందించారు. పాకిస్తాన్.. ఉగ్రవాదాన్ని దేశ విధానంగా అనుసరిస్తున్నట్లు అనిపస్తోందని రాజ్యవర్ధన్ సింగ్ రాధోడ్ ట్వీట్ చేశారు.
Pervez Musharraf has openly endorsed terror as state policy, says @Ra_THORe https://t.co/X59vAmqwUj
— Rajyavardhan Rathore (@Rathore_Fans) November 30, 2017
Comments
Please login to add a commentAdd a comment