న్యూఢిల్లీ : ముంబూ దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌ని ఆయన అల్లుడు వెనుకోసుకొచ్చాడు. ముంబూ దాడులకు సంబంధించి భారత్ వద్ద ఆధారాలుంటే బయటపెట్టాలని హఫీజ్ సయీద్ అల్లుడు వాలీద్ డిమాండ్ చేశారు. లష్కరే తోయిబా, హఫీజ్ సయీద్ భారత్‌కు వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తున్నట్లు రుజువులు ఉంటే ప్రపంచం ముందూ చూపించిండి.. అవి లేకుంటే మా మీద పడి ఏడవడం మానుకోండి.. అని వాలీద్ భారత్‌కు చెప్పారు. పాకిస్తాన్, హఫీజ్ సయీద్ విషయంలో భారత్ ప్రతిసారి అమెరికా భుజాల మీద పడి ఏడవడం పరిపాటిగా మారిందన్నారు. భారత్ ఒత్తిడికి తగ్గట్లే అమెరికా కూడా ప్రవర్తిస్తోందని చెప్పారు. అందులో భాగంగానే హఫీజ్ సయీద్‌ను మరోసారి గృహనిర్భంధంలో ఉంచాలని అమెరికా డిమాండ్ చేస్తోందని చెప్పారు.
ఇదిలా ఉండగా పాకిస్తాన్‌లో ఉగ్రవాద దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే హఫీజ్ సయీద్‌కు అనుకూలంగా మాజీ సైన్యాధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషరాఫ్ సహా పలుపురు రాజకీయ నేతలు మద్దతు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment