
ఇస్లామాబాద్ : 'ఉగ్రవాదులను అణచివేస్తున్నామంటూ పాకిస్థాన్ ప్రభుత్వం చెబుతుంటే ఆ దేశ నిఘా సంస్థ ఐఎస్‌ఐ మాత్రం ఉగ్రవాదులతో సంబంధాలు నెరుపుతోంది' ఈ మాటలు స్వయంగా అగ్రరాజ్యం అమెరికా అన్నది. ఇప్పుడు తాజాగా బయటకు తెలిసిన విషయం వింటే ఆ మాటలు నిజమేనేమో అనిపించకమానదు. ఎందుకంటే భారత్‌పై దాడులకు ఉసిగొలుపుతూ ఐఎస్‌ఐ ఒక ముఠాను తయారు చేసింది. దానికి హలాల్ దస్తా అనే పేరు పెట్టి ఇప్పటికే ప్రారంభించింది. హలాల్ దస్తా అనగా హంతకుల ముఠా.. ఇందులో ఉన్నవాళ్లంతా బ్యాన్ చేసిన లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులని భారత్‌కు చెందిన టాప్ ఇంటెలిజెన్స్ సంస్థ హెచ్చరించింది.
ఆయా వర్గాల సమాచారం ప్రకారం ఈ హంతక ముఠా ఇప్పటికే భారత్ వైపు బయలుదేరిందట. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న జమ్ముకశ్మీర్‌లోని సురాన్‌కోట్, పూంచ్ జిల్లాల్లో దాడులే లక్ష్యంగా ఈ ముఠా కదిలింది. స్వయంగా పాకిస్థాన్ ఆర్మీకి చెందిన యాక్షన్ టీం పనిచేసే ప్రాంతం నుంచే ఈ ముఠాతో భారత్‌పై దాడులు చేయించేందుకు సిద్ధం చేసి ఐఎస్‌ఐ భారత్‌కు పంపిస్తుంది. గతవారమే పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్ టీం భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment