
సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం దారుణమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం తెలంగాణ విమోచన వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. అమరుల ఆత్మకు శాంతి కలిగేలా అధికారికంగా తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహించాలని తెలిపారు.
చరిత్రను తొక్కిపెట్టే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారని దుయ్యబట్టారు. ఎంఐఎంకు మద్దతిచ్చే పార్టీలకు మనుగడ ఉండదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment