మార్చినాటికల్లా అనేక మార్పులు: కిషన్ రెడ్డి
రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయడానికే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తోందని, కానీ వచ్చే మార్చినాటికల్లా అనేక మార్పులు వస్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ మోసాలను చూస్తూ ఊరుకునేది లేదని, వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయమని అయన అన్నారు. కరీంనగర్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 1100 మంది తెలంగాణ బిడ్డలు చనిపోతే తెలంగాణ ఇవ్వలేదుగానీ, కేవలం రాహుల్ను ప్రధాని చేయడానికి ఇప్పుడు ఇస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలకు సిగ్గు ఉంటే సోనియాకు గుడి కట్టడం కాదని ఆయన అన్నారు.
కాంగ్రెస్ కుట్రల పార్టీ అని, అధికారంలో కొనసాగడానికి అనేక రకాలుగా కుట్రలు పన్నుతోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ నాయకులకు భరతమాతను స్మరించడం చేతకాదని, అందుకే వాళ్లంతా సోనియా మాతను స్మరిస్తారని ఆయన అన్నారు.