కాంగ్రెస్‌ మేనిఫెస్టో.. రాహుల్‌గాంధీపై కిషన్‌రెడ్డి ఫైర్‌ | Central Minister Kishanreddy Challenge To Rahulgandhi | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ మేనిఫెస్టో.. రాహుల్‌గాంధీపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఫైర్‌

Published Sat, Apr 6 2024 9:28 PM | Last Updated on Sat, Apr 6 2024 9:32 PM

Central Minister Kishanreddy Challenge To Rahulgandhi - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణలో వంద రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు ఏమైందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ కొత్తగా మ్యానిఫెస్టో విడుదల చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. దమ్ము ధైర్యం ఉంటే ఆరు గ్యారంటీ ల అమలుపై చర్చించడానికి రావాలని రాహుల్ గాంధీకి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. 

‘దేశంలో ఉన్న ప్రతి మహిలకు లక్ష రూపాయల భృతి ఇస్తామని అంటున్నారు. తెలంగాణ లో ఇస్తామని చెప్పిన నాలుగు వేల నిరుద్యోగ భృతి ఏమైంది ? ఉట్టికి ఎగరనివాడు ఆకాశానికి ఎగిరినట్లు ఉంది. రాహుల్ గాంధీ అవగాహన లేకుండా మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఇస్తామని చెప్పిన రైతు రుణ మాఫీ ఏమైంది ? రుణమాఫీ చేయకుండా.. గిట్టుబాటు ధర గురించి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు’ అని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. 

ఇదీ చదవండి.. ప్రతి మహిళ ఖాతాలో రూ.లక్ష వేస్తాం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement