సిద్దిపేట రూరల్, న్యూస్‌లైన్: మెదక్ జిల్లాలోని 10నియోజకవర్గాల్లో జరగని అభివృద్ధి సిద్దిపేటలో జరిగిందని, సిద్దిపేట జిల్లాకే ఆదర్శంగా నిలిచిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు పేర్కొన్నారు. ఆదివారం సిద్దిపేట మండలం నాంచారుపల్లి, గాంధీనగర్, బక్రిచెప్యాల, లింగారెడ్డిపల్లి, ఇమాంబాద్, గాడిచెర్లపల్లి, లక్ష్మిదేవిపల్లి గ్రామాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ తెలంగాణ కోసం కేసీఆర్ పదవులను సైతం లెక్కచేయకుండా పొరాటం చేశారన్నారు. 13ఎళ్ల పొరాటం ఫలితంగానే తెలంగాణ వచ్చిందని, కాంగ్రెస్ తెలంగాణపై ప్రేమతో రాష్ర్టం ఇవ్వలేదన్నారు.
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు. అధికారం మన చేతుల్లో ఉంటే ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిద్దితామని, అది ఒక్క టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమవుతుందన్నారు. ఇతర పార్టీల నాయకులు ఐదు సంవత్సరాలకు ఒక సారి ఓట్లు అడిగేందుకు ప్రజలవద్దకు వస్తారని, తాము ఎప్పుడు ప్రజల మధ్యే ఉంటు వారి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు కిషన్‌రెడ్డి, బాల్‌రంగం, రవీందర్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, పూల బాలక్రిష్ణారెడ్డి, కమలాకర్‌రావు, శ్రీనివాస్‌రావు, బూర విజయ మల్లేశం, సత్యనారాయణగౌడ్, బాలకిషన్‌రావు, మెర్గు మహేష్, అల్లం కిషన్, ప్రకాష్, జంగిటి కిషన్, భిక్షపతి, శ్రీనివాస్, రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.
పెద్దలింగారెడ్డిపల్లిలో..
మండలంలోని పెద్దలింగారెడ్డిపల్లిలో రాత్రి జరిగిన ప్రచారంలో గ్రామ ప్రజలు ఓటుతో పాటు నోటు కూడా ఇస్తామని చెబుతూ రూ. 24,600లను టీఆర్‌ఎస్ అభ్యర్థికి ఇచ్చారు.
టీఆర్‌ఎస్‌లో చేరికలు
మండలంలోని బక్రిచెప్యాల, లింగారెడ్డిపల్లి, లక్ష్మిదేవిపల్లి గ్రామాల్లో వివిధ పార్టీల నేతలు ఆదివారం టీఆర్‌ఎ్‌స్‌లో చేరారు. టీడీపీ మండల అధ్యక్షుడు మెర్గు మల్లేశంతో పాటు పలువురు కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు.
అభివృద్ధిలో జిల్లాకే ఆదర్శం సిద్దిపేట
Published Mon, Apr 21 2014 12:15 AM | Last Updated on Wed, Aug 15 2018 9:06 PM
Advertisement
Advertisement