భద్రాచలం(ఖమ్మం జిల్లా): తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం మంగళవారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. భద్రాచలం వద్ద పుష్కర స్థానాలు చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మంగళవారం తెల్లవారుజామున పవిత్ర గోదావరిలో పుష్కర స్థానమాచరించి, స్వామివారిని దర్శించుకున్నారు. అంతేకాకుండా స్వామివారి ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో చినజీయర్‌స్వామి పాల్గొన్నారు.