సాక్షి,హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి సూట్‌కేసులు మోస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ కోసం కాంగ్రెస్ నేతలు బిల్డర్లను బెదిరిస్తున్నారన్నారు. తెలంగాణ ఎన్నికలకు కర్ణాటక నుంచి సూట్‌కేసులు వస్తే ఇప్పుడు తెలంగాణ నుంచి ఢిల్లీకి సూట్‌కేసులు వెళుతున్నాయని చెప్పారు.
సనత్‌నగర్‌కు చెందిన వెల్లాల రామ్మోహన్ శుక్రవారం కిషన్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఆరు గ్యారెంటీల అమలు ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీఆర్ఎస్, కేసీఆర్ అక్రమాలపై రాష్ట్ర సర్కారు చర్యలేవని నిలదీశారు. మాజీ ప్రధాని పీవీని కాంగ్రెస్ అవమానిస్తే మోదీ గౌరవించారని చెప్పారు. బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. దేశం కోసం బీజేపీలో చేరాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి.. ముందు ఆరు గ్యారెంటీలు అమలు చేయండి: అక్బరుద్దీన్
Comments
Please login to add a commentAdd a comment