Allegations of corruption
-
TS: కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి సూట్‌కేసులు మోస్తున్నారు: కిషన్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి సూట్‌కేసులు మోస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ కోసం కాంగ్రెస్ నేతలు బిల్డర్లను బెదిరిస్తున్నారన్నారు. తెలంగాణ ఎన్నికలకు కర్ణాటక నుంచి సూట్‌కేసులు వస్తే ఇప్పుడు తెలంగాణ నుంచి ఢిల్లీకి సూట్‌కేసులు వెళుతున్నాయని చెప్పారు. సనత్‌నగర్‌కు చెందిన వెల్లాల రామ్మోహన్ శుక్రవారం కిషన్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఆరు గ్యారెంటీల అమలు ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీఆర్ఎస్, కేసీఆర్ అక్రమాలపై రాష్ట్ర సర్కారు చర్యలేవని నిలదీశారు. మాజీ ప్రధాని పీవీని కాంగ్రెస్ అవమానిస్తే మోదీ గౌరవించారని చెప్పారు. బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. దేశం కోసం బీజేపీలో చేరాలని పిలుపునిచ్చారు. ఇదీ చదవండి.. ముందు ఆరు గ్యారెంటీలు అమలు చేయండి: అక్బరుద్దీన్ -
భారీ అవినీతి ఆరోపణలు: పెదవి విప్పిన మారుతీ ఛైర్మన్
సాక్షి,ముంబై: దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీలోని ఎగ్జిక్యూటివ్స్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై తొలిసారి స్పందించారు సంస్థ ఛైర్మన్ ఆర్సీ భార్గవ. ఈ ఆరోపణలపై సమగ్రమైన దర్యాప్తు చేయిస్తున్నట్లు చెప్పారు. ఈమేరకు విచారణకు ఆదేశించినట్లు ఛైర్మన్ చెప్పారు. కంపెనీ పాలసీ ప్రకారం తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వెండర్స్‌కు కోట్లాది రూపాయల విలువైన ప్రయోజనాలు చేకూర్చడంతో పాటు అధిక ధరకు విడి భాగాలను కొందరు ఎగ్జిక్యూటివ్స్ సరఫరా చేసి వ్యక్తిగత లబ్ది పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై సమగ్ర దర్యాప్తునకు మారుతీ సిద్ధమైంది. అవినీతి ఆరోపణలు రుజువైతే.. చట్టపరమైన చర్యలు తప్పవని సంస్థ ఛైర్మన్ హెచ్చరించారు. పర్చేజ్ డిపార్టమెంట్ లో కొందరు కీలక అధికారులు అవకతవకలకు పాల్పడి కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదు నేపథ్యంలో కంపెనీ తొలిసారిగా స్పందించింది. దీనికి సంబంధించి ఫోరెన్సిక్ ఆడిట్ బాధ్యతలను KPMGకు అప్పగించినట్లు వెల్లడించారు.ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్స్ ను ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్‌కు ఇప్పటికే పంపినట్లు చెప్పారు మారుతీ సుజుకీ ఛైర్మన్. కాగా దేశంలోని తయారీ ప్లాంట్లకు అవసరమైన 95 శాతం ముడిసరుకు సప్లయిర్ల నుంచే కొనుగోలు చేస్తుంది మారుతి సుజుకీ. 84 శాతం సప్లయిర్లు.. తయారీ ప్లాంట్లకు వంద కిలోమీటర్ల దూరంలోనే ఉంటారు. ఈ క్రమంలో భారీ ఎత్తున అవకతవకలు జరిగినట్టు పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. -
ఆర్యన్‌ను వదిలేయడానికి రూ.25 కోట్లు?
ముంబై: ముంబై క్రూయిజ్ మాదక ద్రవ్యాల కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో అరెస్టయిన బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూక్‌ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌ను విడిచిపెట్టడానికి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులతో రూ.25 కోట్లకు డీల్ కుదిరిందని ప్రభాకర్ సాయిల్ అనే సాక్షి సంచలన ఆరోపణలు చేశారు. ఆ మొత్తంలో రూ.8 కోట్లు ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడేకి ముట్టజెప్పాలని ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా ప్రభాకర్ తాను సమర్పించిన అఫిడవిట్లో ఆరోపించారు. ఇదే విషయాన్ని ఆయన ఆదివారం మీడియాకి చెప్పారు. ప్రైవేట్ డిటెక్టివ్ కె.పి. గోసవికి వ్యక్తిగత అంగరక్షకుడినని చెప్పుకుంటున్న ప్రభాకర్ అక్టోబర్ 2న క్రూయిజ్ నౌకపై దాడి జరిగిన సమయంలో అక్కడే ఉన్నారు. దీంతో ఎన్సీబీ గోసవిని, ప్రభాకర్‌ని సాక్షులుగా చేర్చి విచారించింది. ఈ అరెస్ట్‌ల తర్వాత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయని శామ్ డిసౌజా అనే వ్యక్తితో కేపీ గోసవి ఫోన్లో ఈ డీల్ గురించి మాట్లాడుతుంటే తాను అదే కారులో ఉండి విన్నానని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత షారూక్‌ఖాన్ మేనేజర్ పూజా దడ్లానితో కారులోనే ఈ డీల్ గురించి 15 నిముషాల సేపు చర్చించారంటూ ప్రభాకర్ తెలిపారు. ఎన్సీబీ అధికారులు తనని తొమ్మిది నుంచి 10 ఖాళీ కాగితాలపై సంతకం చేయాలంటూ ఒత్తిడి తీసుకువచ్చారని ఆరోపించారు. మరోవైపు కేపీ గోసవితో ఆర్యన్ ఖాన్ దిగిన సెల్ఫీ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ప్రస్తుతం గోసవి కనిపించకుండా పోవడం, అతనిపై పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేయడం చూస్తుంటే ఈ కేసు ఇంకా అనూహ్య మలుపులు తిరగడం ఖాయంగా అనిపిస్తోంది. అక్టోబరు 3న అరెస్టయిన ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం ముంబైలోని అర్థర్ రోడ్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. అతని బెయిల్ పిటిషన్ మంగళవారం బాంబే హైకోర్టులో విచారణకు రానుంది. గట్టి జవాబు ఇస్తాం: సమీర్ ప్రభాకర్ సాయిల్ చేసినవన్నీ తప్పుడు ఆరోపణలని ఎన్సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖెడే తోసిపుచ్చినట్టుగా ఎన్సీబీ వర్గాలు వెల్లడించాయి. వారికి సరైన రీతిలో జవాబు చెబుతానని వాంఖెడే హెచ్చరించారు. సాక్షి అడ్డం తిరిగాడని, ఎన్సీబీ ప్రతిష్టను మంట కలిపేందుకే ఈ ఆరోపణలు చేస్తున్నాడని, కార్యాలయంలో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని అలాంటి మీటింగ్లేవీ జరగలేదని ఆ వర్గాలు తెలిపాయి. మరోవైపు ప్రభాకర్ ఆరోపణల్ని తోసిపుచ్చుతూ ఎన్సీబీ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ప్రభాకర్ ఈ కేసులో సాక్షి మాత్రమే. ఈ కేసు విచారణ జరుగుతోంది. ఆయన చెప్పుకునేది ఏమైనా ఉంటే కోర్టులు ఉన్నాయి. సోషల్ మీడియాలో చెప్పుకునే బదులు న్యాయమూర్తి సమక్షంలోనే తన గోడు చెప్పుకోవాల్సింది. అతని అఫిడవిట్‌ను ఎన్సీబీ డైరెక్టర్ పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటారు’’ అని ఆ ప్రకటన పేర్కొంది. మహారాష్ట్ర పరువు తీస్తారా?: శివసేన ఫైర్ ఆర్యన్‌ఖాన్ విడుదలకు ఎన్సీబీ ముడుపులు డిమాండ్ చేసిందన్న ఆరోపణలు షాకింగ్‌గా ఉన్నాయని శివసేన సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ అన్నారు. మహారాష్ట్ర పరువు తీయడానికే ఈ కేసులు పెట్టారని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే భావిస్తున్నారని ఒక ట్వీట్లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌తో పాటుగా సంజయ్ రౌత్ ఒక వీడియో క్లిప్పింగ్ షేర్ చేశారు. ఆ వీడియోలో ఎన్సీబీ కార్యాలయంలో గోసవి ఫోన్ చేతిలో పట్టుకొని (స్పీకర్ ఆన్ చేసి) ఉండగా... ఆర్యన్ ఖాన్ ఎవరితోనో మాట్లాడుతున్న దృశ్యాలున్నాయి. ఈ ముడుపుల వ్యవహారంపై మహారాష్ట్ర పోలీసులు విచారణ చేపట్టాలని రౌత్ డిమాండ్ చేశారు. మరోవైపు మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నాయకుడు నవాబ్ మాలిక్ ఎన్సీబీ జోనల్ చీఫ్ సమీర్ వాంఖెడేపై సిట్‌తో దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో మహారాష్ట్ర ప్రభుత్వం ఎన్సీబీపై తరచుగా విమర్శలు చేస్తోంది. నాపై కుట్ర జరుగుతోంది: పోలీసుల్ని ఆశ్రయించిన వాంఖెడే తప్పుడు ఆరోపణలతో తనపై కుట్రకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎన్సీబీ ముంబై జోనల్ చీఫ్ సమీర్ వాంఖెడే ఆందోళన వ్యక్తం చేశారు. తనపై చట్టపరమైన చర్యలు చేపట్టకుండా రక్షణ కల్పించాలంటూ నగర పోలీసు కమిషర్ హేమంత్ నగ్రాలేకి లేఖ రాశారు. ‘‘ముడుపుల ఆరోపణలకు సంబంధించి గుర్తు తెలియని కొందరు వ్యక్తులు నాపై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నారని తెలిసింది. ఇప్పటికే ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ముత్తా అశోక్ ఈ అంశాన్ని ఎన్సీబీ డైరెక్టర్ జనరల్ పరిశీలనకు పంపారు. దురద్దేశపూర్వకంగా నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారి నుంచి రక్షణ కావాలి’’ అని కోరారు. -
యాక్సిడెంటల్ హోం మినిస్టర్
ముంబై/నాగపూర్: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కి అనూహ్యంగా ఆ పదవి లభించిందని, ఆయన యాక్సిడెంటల్ హోం మినిస్టర్ అని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. పార్టీ పత్రిక సామ్నాలో ఆదివారం రాసిన సంపాదకీయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సీనియర్ ఎన్సీపీ నేతలు జయంత్‌పాటిల్, దిలీప్ వాల్సే హోం మంత్రి పదవిని చేపట్టేందుకు సుముఖత వ్యక్తం చేయని కారణంగానే, అనిల్‌దేశ్‌ముఖ్‌కు అవకాశం లభించిందని రౌత్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల సంకీర్ణ ప్రభుత్వలో నష్ట నివారణ యంత్రాంగం సరిగా లేదని రౌత్ పేర్కొన్నారు. నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలని అనిల్ దేశ్‌ముఖ్ ఆదేశించారని ముంబై మాజీ సీపీ పరమ్‌వీర్ సింగ్ చేసిన ఆరోపణలను ఎదుర్కొనే విషయంలో ఈ విషయం రుజువైందన్నారు. మరోవైపు, కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షాతో అహ్మదాబాద్‌లో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఆ పార్టీ సీనియర్ నాయకుడు ప్రఫుల్ పటేల్ రహస్యంగా సమావేశమయ్యారన్న వార్తలపై రెండు పార్టీలు స్పందించాయి. దీనిపై మీడియా ప్రశ్నకు షా సమాధానమిస్తూ.. అన్ని విషయాలు వెల్లడించలేమని వ్యాఖ్యానించారు. కాగా, కావాలనే షా అలా మాట్లాడారని, గందరగోళం సృష్టించాలనే అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని, బీజేపీ పద్ధతే అదని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ పేర్కొన్నారు. హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై పదవీ విరమణ పొందిన హైకోర్టు న్యాయమూర్తి విచారణ జరుపుతారని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ వెల్లడించారు. ఆ విచారణలో అన్ని వాస్తవాలు బయటకి వస్తాయన్నారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరపాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను కోరానన్నారు. -
బాధ్యతలు చేపట్టిన కాసేపటికే రాజీనామా
పట్నా: బాధ్యతలు చేపట్టిన కొద్ది గంటల్లోనే బిహార్ విద్యా శాఖ మంత్రి రాజీనామా చేశారు. జేడీయూ నేత మేవా లాల్ చౌధరి గురువారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ.. ఆయనకు మంత్రి పదవి ఇచ్చారన్న విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. చౌధరి రాజీనామాను ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సిఫారసు మేరకు, గవర్నర్ ఫగు చౌహాన్ ఆమోదించారు. కొన్నేళ్ల క్రితం ఒక వ్యవసాయ వర్సిటీకి వీసీగా ఉన్న సమయంలో అక్కడ నియామకాల విషయంలో అక్రమాలు జరిగాయని ఆయనపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలకు సంబంధించి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కాసేపటికి చౌధరి వివరణ ఇచ్చారు. ఈ ఆరోపణలకు సంబంధించి తనను ఏ కోర్టు కూడా దోషిగా తేల్చలేదని, ఏ దర్యాప్తు సంస్థ కూడా తనపై చార్జిషీటు దాఖలు చేయలేదని వివరించారు. ‘వ్యవసాయ విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్‌గా నియామకాల విషయంలో నేను నేరుగా పాలు పంచుకోలేదు. నిపుణుల కమిటీకి చైర్మన్‌గా మాత్రమే ఉన్నాను’ అని తెలిపారు. రాజీనామా చేసేముందు చౌధరి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో కాసేపు భేటీ అయ్యారు. -
సిట్టింగ్ జడ్జిపై సీబీఐ విచారణ
న్యూఢిల్లీ: ఉన్నత న్యాయ వ్యవస్థలో అవినీతిని సహించేది లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ చెప్పారు. ఎంబీబీఎస్ ప్రవేశాల్లో ఓ ప్రైవేట్ మెడికల్ కళా శాల పట్ల ఉదారంగా వ్యవహరించిన కేసులో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎన్.శుక్లాపై విచారణ జరిపేందుకు సీబీఐకి అనుమతించారు. శుక్లా తీరుపై మాజీ సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా సూచన మేరకు ప్రాథమిక విచారణ జరిపామని, అవినీతిపై ఆధారాలు లభించాయని దర్యాప్తు సంస్థ పేర్కొంది. శుక్లాపై ఉన్న అవినీతి ఆరోపణలు తీవ్రంగా పరిగణించాల్సి ఉందన్న కమిటీ నివేదిక ఆధారంగా గొగోయ్ విచారణకు అనుమతించారు. దర్యాప్తు జరిపేందుకు వీలుగా అనుమతి కోరుతూ ప్రాథమిక విచారణపై ఒక సంక్షిప్త నివేదికను కూడా సీబీఐ అందజేసింది.‘శుక్లా అవినీతి దర్యాప్తు అంశంపై మీ లేఖలో జోడించిన గమనికను పరిగణించడం జరిగింది. విచారణకు అనుమతి మంజూరు చేస్తున్నాం’అని గొగోయ్ చెప్పారు. సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తిపై కేసు నమోదు చేయడానికి అనుమతి ఇవ్వడం ఇదే మొదటిసారి. కొన్ని నెలల తరువాత జస్టిస్ శుక్లా కేసు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. అప్పటిదాకా శుక్లాను న్యాయవ్యవస్థకు దూరంగా ఉండేలా ఆదేశాలు జారీ చేశారు. -
మారని వైస్ చాన్సలర్ తీరు!
సాక్షి, అమరావతి: ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ దామోదరనాయుడు అవినీతి, అక్రమాలపై విమర్శలు కొనసాగుతున్నాయి. ఆయన తీరు సరిగా లేదని, మమ్ములను ఇబ్బంది పెడుతున్నారని యూనివర్సిటీ ఉద్యోగులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో విచారణ అధికారిగా మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్నను ప్రభుత్వం నియమించింది. ఈయన వర్సిటీ రికార్డులను పరిశీలించి సిబ్బందిని విచారణ చేస్తున్నారు. అయితే వైస్ చాన్సలర్ దామోదర్‌నాయుడు మాత్రం రికార్డులు తారు మారు చేసి, విచారణ అధికారిని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వర్సిటీలోని సిబ్బంది వీసీని దీర్ఘకాలిక సెలవుపై పంపి సీఐడీతో పూర్తిస్థాయి విచారణ జరిపించాలని కోరుతున్నారు. వర్సిటీ రిజిస్ట్రార్‌ను ప్రస్తుత వీసీనే నియమించడంతో, వీసీ అక్రమాలకు ఆయన దన్నుగా నిలుస్తున్నారని ఆరోపిస్తున్నారు. వర్సిటీ రిజిస్ట్రార్‌ను సైతం సస్పెన్షన్ చేసి, రికార్డులు తారు మారు చేయకుండా పారదర్శకంగా విచారణ జరిగేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే వీసీ మాత్రం తనకు బీజేపీ అగ్రనేతల అండదండలు ఉన్నాయని, తనను ఎవరూ ఏమీ చేయలేరంటూ విచారణకు హాజరైన ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విచారణాధికారికి సైతం ఇప్పటికే ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఐఆర్ 27 శాతం సైతం ఉద్యోగులకు అమలు చేయకుండా వీసీ ఇబ్బంది పెడుతున్నారు. దీంతో ఉద్యోగులు యూనివర్సిటీ ఎదుట గత బుధవారం ఆందోళనకు దిగారు. ఉద్యోగోన్నతుల నిరాకరణ 2018లో చేసిన సీఏఎస్ఏ (కాసా) ఉద్యోగోన్నతుల్లో వింత నిబంధనలతో 57 మంది అర్హత ఉన్న ఉద్యోగులకు ఉద్యోగోన్నతులను వీసీ నిరాకరించారు. అక్రమ బదిలీల వేధింపులపై కోర్టు తీర్పును అమలు చేయకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడటమే కాకుండా ప్రతివాదులుగా ఉన్న ఉద్యోగుల జీతాలు నిలుపుదల చేసి వేధింపులకు గురిచేశారు. ఆడిట్ అభ్యంతరాలు, చిన్న చిన్న కారణాలతో ఉద్యోగుల హక్కు అయిన మెడికల్ రీయింబర్స్‌మెంట్‌ను ఏడాది కాలంగా నిలుపుదల చేశారు. సుమారు 200 మందికి పైగా విచారణ అధికారి, మార్కెటింగ్ కమిషనర్ ఎదుట ప్రత్యక్షంగా రెండు దఫాలుగా హాజరై తాము పడుతున్న ఇబ్బందులను వివరించారు. 500 మందికిపైగా సిబ్బంది, విద్యార్థులు ఈమెల్స్ ద్వారా వీసీపై ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ జరుగుతున్నప్పటికీ దామోదర్‌నాయుడు వివిధ వ్యక్తుల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధిత సిబ్బంది, విద్యార్థులను బెదిరింపులకు గురిచేస్తున్నారు. గత శనివారం 13వ తేదీ సుమారు వంద మందికిపైగా బాధిత సిబ్బంది వీసీ బెదిరింపు దోరణిపై విచారణ అధికారికి రాత పూర్వక ఫిర్యాదు చేశారు. ఉపకులపతిని ప్రభుత్వం దీర్ఘకాలిక సెలవుపై పంపి పూర్తి స్థాయి విచారణ సీఐడీతో పారదర్శకంగా జరిపించాలని ఉద్యోగులు, విద్యార్థులు కోరుతున్నారు. అవినీతి ఆరోపణలు ఇవే.. ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్మెంట్ నిలుపుదల చేసి ఇబ్బందుల పాలు చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ జాక్ట్ (టైపిస్టు) నియామక రాత పరీక్షల లీకేజీలో కీలక పాత్ర పోషించారు. ––ఎన్నికల కోడ్‌ను అతిక్రమించి డి.ఎస్.కోటేశ్వరరావును నోడల్ అధికారిగా నియమించారు. వర్సిటీ వాహనాలను కుటుంబ సభ్యులు అడ్డగోలుగా వాడుకున్నారు. వర్సిటీ రిజిస్ట్రార్ కంట్రోలర్ రవాణా అధికారి అండదండలతో అక్రమాలు, ఆగడాలకు పాల్పడ్డారు. సొంత సామాజిక వర్గానికి పెద్ద పీట వేశారు. వర్సిటీ నిధులు ప్రైవేటు బ్యాంకుకు బదిలీ చేసి కుమారుడికి క్విడ్ ప్రోకో ద్వారా ఉద్యోగంతో పాటు, ప్రమోషన్ పొందారు. అక్రమ బదిలీలు, వేధింపులు, ఉద్యోగోన్నతుల్లో కీలక పాత్ర పోషించారు. వైఎస్సార్ సీపీ అనుకూల ముద్ర వేసి తాత్కాలిక ఉద్యోగులను తొలగించారు. కాంట్రాక్టు, టైమ్ స్కేల్ లేబర్ న్యాయమైన కోరికలను సైతం నిరాకరించారు. మహిళా ఉద్యోగుల పట్ల అనుచితంగా ప్రవర్తించారు. వీటన్నింటికి సంబంధించి ఆధారాలను విచారణాధికారికి వర్సిటీ ఉద్యోగులు అందించారు. -
రెవెన్యూలో అవినీతి జలగలు.!
సాక్షి, ఖాజీపేట(కడప) : ఖాజీపేట మండలంలో గత 20 ఏళ్లుగా కొందరు వీఆర్ఓలు రెవెన్యూ గ్రామాలు మారుతూ ఇక్కడే తిష్ట వేశారు. దీంతో వచ్చిన తహసీల్దార్లను మచ్చిక చేసుకుని అంతా తామై నడిపిస్తున్నారు. ప్రతి పనికి ఒక రేటు నిర్ణయించారు. దాని ప్రకారం రైతుల నుంచి వసూళ్లు చేస్తున్నారు. డబ్బులు ముట్టజెప్పిన రైతులు నెలల తరబడి వారి చుట్టూ తిరిగినా పనులు జరగడం లేదు. పనులు చేయిస్తామని భారీగా వసూళ్లు ఖాజీపేట మండలంలో గతంలో పనిచేసిన తహసీల్దార్ పార్వతితో పాటు వీఆర్ఓ శ్రీనివాసులరెడ్డి మరికొందరు వీఆర్ఓలు భూ సమస్యలు పరిష్కరిస్తామంటూ భారీగా డబ్బు వసూలు చేసినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఇలా తుడుమలదిన్నె, తిమ్మారెడ్డిపల్లె, సన్నపల్లె, పుల్లూరు తదితర గ్రామాల్లో అధికంగా వీఆర్ఓల బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. చుక్కల భూముల క్రమబద్ధీకరణ కోసం వచ్చిన ప్రతి రైతు నుంచి వారి అవసరాన్ని బట్టి రూ.10 వేల నుంచి 20 వేల వరకు వసూలు చేశారని రైతుల ఆరోపణ. అలాగే ఆన్లైన్ నమోదు, పాసుపుస్తకాల కోసం, డీకేటీ పట్టా పొందిన రైతుల భూముల ఆన్లైన్ పేరుమార్పు, ఇతరుల పేరుతో ఉన్న ఆన్‌లైన్‌ను తొలగించి తిరిగి భూమి కలిగిన రైతు పేరున మార్చేందుకు ఇలా అనేక రైతుల సమస్యలకు రేటు నిర్ణయించి వసూళ్లకు పాల్పడుతున్నారు. తహసీల్దార్ పార్వతితో పాటు వీఆర్ఓ శ్రీనివాసులరెడ్డి తదితరులు డబ్బులు గుంజారు. బదిలీపై అధికారులు ఖాజీపేట మండలంలో తహసీల్దార్ గా పనిచేసిన పార్వతి తోపాటు వీఆర్ఓ శ్రీనివాసులరెడ్డి బదిలీ అయ్యారు. వీరు రైతుల నుంచి పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేసి పనులు చేయకుండా తిరిగి రైతులకు డబ్బు ఇవ్వకుండా వెళ్లిపోవడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పనులు చేయలేదు, కనీసం తమ డబ్బయినా తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు. అయినా వీఆర్ఓలు పట్టించుకోక పోవడంతో సోమవారం కలెక్టరేట్లో జరిగిన స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. తీరు మారదంతే.. ఖాజీపేట రెవెన్యూ కార్యాలయంలోని అధికారుల తీరు ఎంత చేసినా మారడంలేదు. గతంలో పనిచేసిన తహసీల్దార్ శివరామయ్య దొంగ పట్టాలు ఇచ్చారు. ఆన్లైన్లో ఒకరికి తెలియకుండా ఒకరి భూముల పేర్లు మార్చారు. ఇలా అనేక అవకతవకలకు పాల్పడ్డారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు తహసీల్దార్‌ను సస్పెండ్ చేశారు. అలాగే గతంలో పనిచేసిన అధికారుల్లో తహసీల్దార్ కృష్ణయ్య తోపాటు ఆర్ఐ రాధాకృష్ణ, వీర్‌ఓలు, సర్వేయర్ ఏసీబీకి దొరికారు. మరో వీఆర్ఓ చెన్నూరు మండలానికి వెళ్లి అక్కడ ఇసుక ట్రాక్టర్ల దగ్గర డబ్బు వసూలు చేస్తుండగా పోలీసులు కేసు నమోదు చేసి సస్పెండ్ చేశారు. సా...గుతున్న విచారణ వీఆర్ఓల అక్రమాలపై అప్పటి కలెక్టర్ బాబూరావు నాయుడుకు 2018లోనే రైతులు ఫిర్యాదు చేశారు. ఆమేరకు విచారణ అధికారిగా ప్రత్యేక కలెక్టర్ రోహిణిని నియమించారు. విచారణ అధికారికి మండలంలోని రైతులు పెద్ద ఎత్తున రాతపూర్యకంగా ఫిర్యాదులు ఇచ్చారు. అయితే విచారణకు కావాల్సిన రికార్డులు ఇచ్చేందుకు తహసీల్దార్ పార్వతి సహకరించలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రికార్డులు ఇవ్వని కారణంగా నివేదిక ఆలస్యం విచారణకు వచ్చిన నాకు ఖాజీపేట తహసీల్దార్ రికార్డులు ఇవ్వలేదు. 95 రికార్డులు అడిగితే 60 రికార్డులు మాత్రమే ఇచ్చారు. మిగిలినవి ఉన్నాయో లేదో తెలియదు. లేక పోతే మా వద్ద లేవు అని రాతపూర్వకంగా ఇవ్వాలని తహసీల్దార్‌ను అడిగాను. ఇదే విషయమై అనేక నోటీసులు ఇచ్చినా తహసీల్దార్ స్పందించ లేదు. అసంపూర్తిగా నివేదిక ఇవ్వలేం. తహసీల్దార్ రాతపూర్వకంగా ఇస్తే కలెక్టర్‌కు నివేదిస్తాను. – రోహిణి, ప్రత్యేక కలెక్టర్ -
సీబీఐ డైరెక్టర్ నాగేశ్వర రావుపై ఆంక్షలు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణను కేంద్ర నిఘా కమిషన్ (సీవీసీ) రెండు వారాల్లోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు గడువు విధించింది. ఈ విచారణను సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఏకే పట్నాయక్ పర్యవేక్షిస్తారంది. అలోక్ వర్మ, సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానాల మధ్య వర్గపోరు నేపథ్యంలో వారిద్దరినీ కేంద్రం విధుల నుంచి తప్పించి సెలవుపై పంపడం తెలిసిందే. దీంతో తనను ప్రభుత్వం అక్రమంగా విధుల నుంచి తప్పించిందనీ, సీబీఐ స్వతంత్ర అధికారాల్లో కేంద్రం జోక్యం చేసుకుందని ఆరోపిస్తూ అలోక్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింది. సీబీఐలో జేడీగా ఉన్న, ప్రస్తుతం డైరెక్టర్ విధులు నిర్వహిస్తున్న నాగేశ్వర రావు ఎలాంటి విధానపరమైన, కీలక నిర్ణయాలూ తీసుకోకూడదని కోర్టు ఆంక్షలు విధించింది. డైరెక్టర్ విధులను తాత్కాలికంగా నాగేశ్వర రావుకు కట్టబెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఏయే అధికారులను బదిలీ చేశారు, ఇప్పటికే విచారణలో ఉన్న కేసులను ఎవరి నుంచి ఎవరికి అప్పగించారు తదితర వివరాలన్నింటినీ సీల్డ్ కవర్లో అందజేయాలని కోర్టు ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌ల ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. తదుపరి విచారణను వచ్చే నెల 12కు వాయిదా వేస్తూ, అప్పటిలోగా నాగేశ్వర రావు నిర్ణయాలకు సంబంధించిన వివరాలను అందించాలని స్పష్టం చేసింది. తనను విధుల నుంచి తప్పించడాన్ని సవాల్ చేస్తూ అస్థానా కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినప్పటికీ ఆ కేసును తర్వాత విచారిస్తామని ధర్మాసనం వెల్లడించింది. ప్రభుత్వంపై పైచేయి కాదు.. జస్టిస్ ఏకే పట్నాయక్ పర్యవేక్షణలో విచారణ జరగాలని తాము చెప్పడాన్ని ప్రభుత్వంపై ఆధిపత్యంలా చూడకూడదని జడ్జీలు వ్యాఖ్యానించారు. ఈ కేసులో ఉన్న విపరీత ఆరోపణల కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవడం తప్పనిసరైందన్నారు. నాగేశ్వర రావు నిర్ణయాలను అమలు చేయకూడదని తొలుత చెప్పిన కోర్టు.. తర్వాత మాత్రం ఇకపై ఆయన ఏ కీలక నిర్ణయాలూ తీసుకోకుండా నిలువరిస్తూ, ఇప్పటికే చేపట్టిన చర్యలను సమీక్షించిన అనంతరం ఓ నిర్ణయానికి వస్తామంది. అలోక్ పిటిషన్‌పై కేంద్రం, సీవీసీల స్పందనలను కోరింది. సీబీఐ అధికారులపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో విచారణ జరిపించాలంటూ కామన్‌కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ తరఫున సీనియర్ లాయరు ప్రశాంత్ భూషణ్ వేసిన పిటిషన్‌నూ ఇదే బెంచ్ విచారించింది. ఈ పిటిషన్‌పై నవంబర్ 12లోగా స్పందించాల్సిందిగా కేంద్రం, సీబీఐ, సీవీసీ, అలోక్, అస్థానా, నాగేశ్వర రావులను ఆదేశించింది. కేంద్రం తరఫున అటార్నీ జనరల్ వేణుగోపాల్, సీవీసీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్, అలోక్ తరఫున సీనియర్ న్యాయవాది ఫాలీ నారీమన్ వాదనలు వినిపించారు. సీవీసీ విచారణను పది రోజుల్లోనే పూర్తి చేయాలన్న ధర్మాసనం.. ఇంకాస్త ఎక్కువ సమయం ఇవ్వాలని తుషార్ మెహతా కోరడంతో గడువును రెండు వారాలకు పెంచింది. సీవీసీకి చిత్తశుద్ధి లేదని కాదు: అధికారి అలోక్ వర్మపై సీవీసీ విచారణను పర్యవేక్షించేందుకు జస్టిస్ ఏకే పట్నాయక్‌ను కేంద్రం నియమించిందంటే సీవీసీకి చిత్తశుద్ధి లేనట్లేమీ కాదని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు ఢిల్లీలో వ్యాఖ్యానించారు. ‘అలోక్, అస్థానాలను బాధ్యతల నుంచి తప్పిస్తూ, డైరెక్టర్ విధులను నాగేశ్వర రావుకు అప్పగిస్తూ సీవీసీ, కేంద్రం ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టేయలేదు. విశ్రాంత జడ్జి పర్యవేక్షణలో విచారణ జరగాలని చెప్పినంత మాత్రాన సీవీసీ చిత్తశుద్ధిని శంకించినట్లు కాదు. విచారణను సీవీసీయే చేస్తుంది కదా. ఈ కేసులో ఉన్న కొన్ని అసాధారణ అంశాల వల్ల కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది’ అని అధికారి వివరించారు. సానుకూల పరిణామం: జైట్లీ కోర్టు ఇచ్చిన తాజా ఉత్తర్వులు గొప్ప సానుకూలాంశమని ఆర్థిక మంత్రి జైట్లీ అన్నారు. ఈ ఆదేశాలతో నిజాలు బయటకొచ్చి దేశ ప్రయోజనాలు నిలబడతాయని అన్నారు. సీబీఐ సమగ్రత, నిబద్ధతను పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందనీ, ఒక నిర్దిష్ట వ్యక్తికి అనుకూలంగా, మరొకరికి వ్యతిరేకంగా వ్యవహరించే ఉద్దేశం తమకు లేదన్నారు. నిజం నిలిచింది: కాంగ్రెస్ సుప్రీంకోర్టు ఆదేశాలను కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తూ నిజం నిలబడిందని వ్యాఖ్యానించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఓ ట్వీట్ చేస్తూ ‘తమ చెప్పుచేతల్లో ఉండే మనుషులను నియమించుకుని సీబీఐని చేజిక్కించుకోవాలన్న మోదీ ప్రభుత్వ దుష్ట ప్రయత్నం విఫలమైంది. సుప్రీంకోర్టులో ఎప్పుడైనా నిజం నిలబడుతుంది. సీబీఐ స్వతంత్రతను దెబ్బతీయాలని చూసిన నిరంకుశ పాలకుల చెంప చెళ్లుమనేలా ఈ తీర్పు ఉంది. మోదీ ప్రభుత్వ పావుగా సీవీసీ ఇక వ్యవహరించలేదు. జస్టిస్ ఏకే పట్నాయక్ పర్యవేక్షణలో విచారణ పారదర్శకంగా జరుగుతుంది’ అని అన్నారు. ‘పంజరం చిలుక’కు స్వేచ్ఛనిచ్చిన వ్యక్తి సీవీసీ విచారణను పర్యవేక్షించేందుకు నియమితులైన సుప్రీంకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ అనంగ కుమార్ పట్నాయక్ గతంలో సీబీఐకి సంబంధించిన పలు కేసుల్లో కీలక తీర్పులు వెలువరించారు. సంయుక్త కార్యదర్శి లేదా ఆపై స్థాయి అధికారులపై సీబీఐ విచారణ ప్రారంభించాలంటే ముందుగా ప్రభుత్వ అనుమతిని తప్పనిసరి చేస్తూ నాటి ప్రధాని వాజ్‌పేయి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కొత్త నిబంధనలను తెచ్చింది. ఈ నిబంధనలను 2014లో కొట్టేసి, సీబీఐకి స్వేచ్ఛనిచ్చిన ఐదుగురు జడ్జీల్లో జస్టిస్ పట్నాయక్ ఒకరు. 1949లో ఒడిశాలో జన్మించిన ఆయన మధ్యప్రదేశ్ హైకోర్టు సీజేగా చేశారు. తర్వాత సుప్రీంకోర్టులో ఉండి పలు కీలక తీర్పులను ఇచ్చారు. కోల్‌కతాలోని అమెరికన్ సెంటర్‌పై ఉగ్రదాడికి ప్రధాన సూత్రధారులు అఫ్తాబ్ అన్సారీ, జములుద్దీన్ నజీర్లకు ఉరిశిక్షను రద్దు చేసిన ద్విసభ్య ధర్మాసనంలో ఈయన ఒకరు. అహ్మదాబాద్‌లోని అక్షరధామ్ ఆలయంపై జరిగిన దాడి కేసులోనూ ఆరుగురు నిందితులను నిర్దోషులుగా విడుదల చేసిన బెంచ్‌లో పట్నాయక్ సభ్యుడు. బీసీసీఐ చీఫ్ పదవి నుంచి శ్రీనివాసన్ దిగిపోవాలని ఆదేశించిన కోర్టు, 2జీ స్పెక్ట్రం కేటాయింపుల కుంభకోణానికి సంబంధించిన అన్ని కేసులనూ విచారించేందుకు నియమితమైన ద్విసభ్య బెంచ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏవైనా కేసుల్లో దోషులుగా తేలినప్పటికీ, పై కోర్టుల్లో వారు అప్పీల్ చేసుకున్నప్పుడు ఆయా ప్రజాప్రతినిధులకు లాభం కలిగించేలా ప్రజాప్రతిధుల చట్టంలో ఉన్న సెక్షన్ 8(4)ను రద్దు చేసిన ధర్మాసనాల్లోనూ పట్నాయక్ సభ్యుడే. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఏకే పట్నాయక్ వివాదం పూర్వాపరాలు.. 2017 జనవరి 19: సీబీఐ డైరెక్టర్‌గా అలోక్ వర్మ నియామకం. అక్టోబర్ 22: సీబీఐ స్పెషల్ డైరెక్టర్‌గా రాకేశ్ అస్థానాకు పదోన్నతి కల్పించిన ప్రభుత్వం. నవంబర్ 2: అస్థానా నియామకాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన లాయర్ ప్రశాంత్ భూషణ్. పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు. 2018 జూలై 12: పదోన్నతులు, కొత్త నియామకాలపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేసిన సీవీసీ. అప్పటికే అలోక్ విదేశాలకు వెళ్లారనీ, ఆయన స్థానంలో ఈ భేటీకి హాజరయ్యే అధికారం అస్థానాకు లేదని చెప్పిన సీబీఐ. ఆగస్టు 24: అలోక్‌పై అవినీతి ఆరోపణలు చేస్తూ కేబినెట్ కార్యదర్శికి లేఖ రాసిన అస్థానా. విషయాన్ని సీవీసీకి అప్పగించిన కేంద్రం. సెప్టెంబర్ 21: అస్థానానే 6 అవినీతి కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారని సీవీసీకి వివరణ ఇచ్చిన సీబీఐ. అక్టోబర్ 15: అస్థానా, సీబీఐ డీఎస్పీ దేవేంద్ర కుమార్, మధ్యవర్తులు మనోజ్ ప్రసాద్, సోమేశ్ ప్రసాద్‌లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ. అక్టోబర్ 22: సోదాల అనంతరం అస్థానా బృందంలోని డీఎస్పీ దేవేంద్ర కుమార్ అరెస్ట్. అక్టోబర్ 23: అస్థానాపై చర్యల విషయంలో యథాతథ స్థితి విధించిన ఢిల్లీ హైకోర్టు. దేవేంద్రకు కస్టడీ విధించిన సీబీఐ కోర్టు. అలోక్, అస్థానాలను విధుల నుంచి తప్పించి నాగేశ్వర రావుకు డైరెక్టర్ బాధ్యతలు అప్పగించిన కేంద్రం. అక్టోబర్ 24: సీబీఐ స్వతంత్రాధికారాల్లో కేంద్రం జోక్యం చేసుకుందంటూ కోర్టుకెళ్లిన అలోక్. అక్టోబర్ 26: విచారణను రెండు వారాల్లో పూర్తి చేయాలని సీవీసీకి సుప్రీంకోర్టు ఆదేశం. ‘సీబీఐ.. పంజరంలో చిలక’ అని చూపుతూ ఢిల్లీలో కాంగ్రెస్ కార్యకర్తల ప్రదర్శన -
‘సిట్’ పిటిషన్‌కు సుప్రీం ఓకే
సాక్షి, న్యూఢిల్లీ: సీబీఐ ఉన్నతాధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణల్ని విచారించేందుకు కోర్టు పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు కోరుతూ దాఖలైన పిల్‌ను అత్యవసరంగా విచారణ చేపట్టే అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. కామన్‌కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ తరఫున ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ ఈ పిల్ వేశారు. సీబీఐని ప్రభావితం చేస్తున్న విస్తృత అవినీతికి సంబంధించిన అంశాలు ఇందులో ఉన్నాయని, వెంటనే విచారణకు చేపట్టాలన్న ఆయన విజ్ఞప్తికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌ల బెంచ్ అంగీకరించింది. పూర్తి వివరాలు సమర్పించాలని, పిటిషన్‌ను అత్యవసరంగా విచారించే అంశాన్ని పరిశీలిస్తామని భూషణ్‌కు తెలిపింది. అలోక్ వర్మను సెలవుపై పంపుతూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను రద్దుచేయాలని భూషణ్ కోర్టును కోరారు. కేబినెట్ సెక్రటరీ, సీవీసీ, రాకేశ్ అస్థానా, అలోక్ వర్మ, నాగేశ్వరరావులను ఈ కేసులో ప్రతివాదులుగా చేర్చారు. ‘ప్రతివాదులు దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ స్వతంత్రతను దెబ్బతీయాలని చూశారు. సీబీఐ డైరెక్టర్ పదవీకాలం రెండేళ్లు ఉన్నప్పటికీ ఆ నిబంధనను పక్కనబెడుతూ ఆయన్ని సెలవులోకి పంపి తాత్కాలిక డైరెక్టర్‌ను నియమిస్తూ చట్టబద్ధమైన నియామక ప్రక్రియను ఉల్లంఘించారు. ఒకవేళ సీబీఐ డైరెక్టర్‌పై ఫిర్యాదులు వస్తే సీవీసీ నేరుగా తొలగించకూడదు. ప్రధాని, ప్రతిపక్ష నేత, సీజేఐలతో కూడిన హైపవర్డ్ కమిటీ నిర్ణయం తీసుకోవాలి’ అని అన్నారు. దురుద్దేశపూర్వకం.. సీబీఐ డైరెక్టర్, స్పెషల్ డైరెక్టర్లను విధుల నుంచి తప్పిస్తూ సీవీసీ, ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులు దురుద్దేశపూర్వకమని ప్రశాంత్ భూషణ్ ఆరోపించారు. ‘రాకేష్ అస్థానాపై చర్యలు తీసుకున్నందుకే సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను బాధితుడిగా చేసినట్లు తెలుస్తోంది. రాకేష్ అస్థానాను స్పెషల్ డైరెక్టర్‌గా నియమించినప్పుడే అలోక్ వర్మ అభ్యంతరాలు వ్యక్తంచేశారు. అస్థానాపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని అలోక్ 2017 అక్టోబరు 21న కేబినెట్ కన్సల్టేషన్ కమిటీకి లేఖ రాశారు. సంబంధిత ఆరోపణలు ఉన్న కేసులను సీబీఐ దర్యాప్తు చేస్తోందని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. సీనియర్ ఐటీ అధికారులు ముగ్గురు గుజరాత్‌కు చెందిన స్టెర్లింగ్ బయోటెక్, సందేసర గ్రూప్ కంపెనీల నుంచి లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలపై సీబీఐ ఢిల్లీ యూనిట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ కేసులో అస్థానా పాత్ర కూడా ఉంది. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. సతీష్ బాబు సానా అస్థానాకు లంచం ఇచ్చారన్న మరో కేసు కూడా దర్యాప్తులో ఉంది. దీనిపై అవినీతి నిరోధక చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసు నమోదవగానే అస్థానా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసులో దర్యాప్తు కొనసాగించవచ్చని ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. అదే రోజు రాత్రి కేంద్రం, సీవీసీలు..డైరెక్టర్, స్పెషల్ డైరెక్టర్లను తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చాయి’ అని పిటిషన్లో పేర్కొన్నారు. -
అక్కడ అద్భుతం- ఇక్కడ అవినీతిమయం
ఢిల్లీ: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)లో అక్రమాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆరోపించారు. హెచ్‌సీఏలో వివేక్ అవినీతికి పాల్పడుతున్నాడని, ఇప్పటికి రూ.12 కోట్లు దోచుకున్నాడని అన్నారు. ఆర్బిట్రేషన్ పేరుతో రూ.25 కోట్లకు స్కెచ్ వేశారన్నారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అద్భుతంగా పనిచేస్తుంటే హెచ్ సిఎ అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్‌సీఏ అక్రమాలపై దృష్టి పెట్టాలని వీహెచ్ విజ్ఞప్తి చేశారు. -
దక్షిణ కొరియాలో రాజకీయ సంక్షోభం
అధ్యక్షురాలిని పదవి నుంచి తొలగించిన రాజ్యాంగ న్యాయస్థానం సియోల్: అవినీతి ఆరోపణల నేపథ్యంలో అభిశంసనను ఎదుర్కొంటున్న దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ గెన్ హేను అధికారికంగా పదవి నుంచి తొలగిస్తూ ఆ దేశ రాజ్యాంగ న్యాయస్థానం శుక్రవారం చారిత్రక తీర్పు వెలువరించింది. ప్రాసిక్యూటర్లు ఇప్పటికే పార్క్ పేరును నిందితుల జాబితాలో చేర్చడంతో ధర్మాసనం ఆమెపై క్రిమినల్ ప్రొసీడింగ్స్‌కు అనుమతిచ్చింది. పార్క్ చర్యలు రాజ్యాంగాన్ని, చట్టాలను ఉల్లంఘించడమేనని, ప్రజల నమ్మకానికి ద్రోహం చేయడమే అని చీఫ్ జస్టిస్ జంగ్–మీ పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు కోర్టు ప్యానెల్ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుందని పార్క్ గెన్ హేను పదవి నుంచి తొలగిస్తున్నామని ప్రకటించారు. తన స్నేహితురాలైన చోయ్ సూన్ సిల్‌తో కుమ్మక్కై పార్క్ అవినీతికి పాల్పడ్డారని, కంపెనీల నుంచి లక్షల డాలర్లను వసూలు చేశారని, చోయ్‌ను ప్రభుత్వ కార్యకలాపాల్లో పాలుపంచుకునేలా అవకాశం కల్పించారని కోర్టు పేర్కొంది. -
నాకు తెలియాలి!
► కార్పొరేషన్ వ్యవహారాలపై మేయర్, కమిషనర్‌కు మంత్రి నారాయణ ఆదేశం ► మంత్రిపై సీఎం అసహనం నేపథ్యంలో టెలి కాన్ఫరెన్స్ సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఇక మీదట ఏ నిర్ణయాలైనా నాకు చెప్పే తీసుకోవాలని మంత్రి నారాయణ మేయర్ అబ్దుల్ అజీజ్, కమిషనర్ వెంకటేశ్వర్లుకు స్పష్టం చేశారు. ఒక వైపు సొంత పార్టీ నేతల అవినీతి ఆరోపణలు, మరో వైపు ఏసీబీ దాడులతో జిల్లాలో పార్టీ పరువు పోయిందనీ, సొంత కార్పొరేషన్లోనే పరిస్థితి అదుపులో పెట్టక పోతే రాష్ట్రం మొత్తం ఎలా పాలన సాగిస్తావని సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నారాయణ శుక్రవారం విజయవాడ నుంచి మేయర్ అజీజ్, కమిషనర్ వెంకటేశ్వర్లుతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలో ఒక ఇంటి నిర్మాణ అనుమతి కోసం అసిస్టెంట్ సిటీ ప్లానర్ (ఏసీపీ) మునిరత్నం రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ లంచాల్లో కమిషనర్ నుంచి కింది స్థాయి వరకు అందరికీ వాటాలు ఉన్నట్లు ఏసీపీ ఏసీబీ అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు. ఈ వివాదం కాస్తా మేయర్ అబ్దుల్ అజీజ్, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి బహిరంగ యుద్ధానికి దారి తీసింది. నగరంలో ముస్లిం మైనారిటీలు సైతం వీధికెక్కి వివేకా మీద విమర్శలు గుప్పించారు. ఈ వ్యవహారంతో జిల్లాలో పార్టీ పరువు బజారున పడింది. ఈ వ్యవహారం సీఎం చంద్రబాబుదృష్టికి వెళ్లింది. జిల్లాలో పార్టీ అంతంత మాత్రంగా ఉన్న సమయంలో ఇలాంటి ఆరోపణలు, అవినీతి వ్యవహారాల వల్ల జనంలో మరింత పలుచబడి పోతుందని మంత్రి నారాయణమీద సీఎం అసహనం వ్యక్తం చేసినట్లు మూడు రోజుల కిందటే టీడీపీ వర్గాల్లో చర్చ నడిచింది. రాజధాని వ్యవహారాల్లో తీరిక లేకుండా ఉన్నప్పటికీ సంబంధిత శాఖ మంత్రిగా సొంత కార్పొరేషన్నే అదుపులో పెట్టలేక పోతే ఎలా అని మంత్రి మీద చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. నారాయణ చేతిలోకి కార్పొరేషన్ నెల్లూరులో తాజా పరిణామాలు, సీఎం చంద్రబాబు స్పందన నేపథ్యంలో కార్పొరేషన్ వ్యహారాలను తన చేతిలోకి తీసుకోవాలని మంత్రి నారాయణ నిర్ణయించారు. శుక్రవారం విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి మేయర్ అజీజ్, కమిషనర్ వెంకటేశ్వర్లుతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్పొరేషన్లో ఇక మీదట ఏ నిర్ణయాలైనా తనకు చెప్పే తీసుకోవాలని ఇద్దరినీ ఆదేశించారు. కింది స్థాయి సిబ్బంది అవినీతికి పాల్పడినా మీ ఇద్దరే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. సిబ్బంది, అధికారులు ఎవరైనా అవినీతికి పాల్పడినట్లు గుర్తిస్తే అక్కడికక్కడే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. నెల్లూరును మోడల్ కార్పొరేషన్‌గా తయారు చేయాలని తాను ప్రయత్నిస్తుంటే సొంత పార్టీ నేతలే అవినీతి ఆరోపణలు చేసుకోవడం ఇబ్బందిగా తయారైందని అజీజ్, వివేకా మీద అసహనం వ్యక్తం చేశారని తెలిసింది. అవినీతిని కట్టడి చేయకపోతే రాజకీయంగా దెబ్బతింటామని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారని సమాచారం. పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాల వలవన్, డెరైక్టర్ కన్నబాబు టెలి కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. -
అవినీతి సొమ్ముతోనే ఎమ్మెల్యేల కొనుగోళ్లు
► చంద్రబాబు రెండేళ్ల పాలన అవినీతిమయం ► విభజన హామీలపై నోరుమెదపని కేంద్రమంత్రులు ► పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి ► వైఎస్సార్ సీపీ నేత సామినేని ఉదయభాను జగ్గయ్యపేట అర్బన్ : స్వతంత్ర భారతం ఏనాడూ కనీవినీ ఎరుగని రీతిలో, ఏ రాష్ట్రంలో లేనివిధంగా ముఖ్యమంత్రి, మంత్రులు అవినీతికి పాల్పడుతూ ఆ సొమ్ముతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు వలవిసిరి కొనుగోళ్లకు పాల్పడుతున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు సామినేని ఉదయభాను పేర్కొన్నారు. శనివారం ఆయన స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ ఒక పార్టీలో ఎన్నికైన ఎమ్మెల్యేలను అధికారపార్టీలోకి ఫిరాయించేలా ప్రలోభపెట్టడం హేయమన్నారు. ఒకపార్టీ గుర్తుపై గెలిచిన వారు వేరే పార్టీలోకి చేరాలంటే ముందుగా రాజీనామా చేయాలన్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీరామారావు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు పార్టీ ఫిరాయింపులను పూర్తిగా వ్యతిరేకించారని, కానీ ఆయన అల్లుడు చంద్రబాబు ఆ విలువలను తుంగలో తొక్కి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఉదయభాను ఆరోపించారు. విపక్ష ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి మారితే వారి నియోజకవర్గంలో ప్రథమ పౌరుడిస్థాయి నుంచి చివరిస్థాయికి దిగజారినట్లేనని ఎద్దేవా చే శారు. ఇలాంటి నేతలకు భవిష్యత్‌లో విలువ ఉండదన్నారు. కేంద్రప్రభుత్వానికి నిజాయతీ ఉంటే ఏపీలో జరుగుతున్న ఫిరాయింపులపై విచారణ చేపట్టాలని కోరారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై న్యాయపోరాట ం చేస్తామన్నారు. అవినీతి ఎమ్మెల్యేలు, మంత్రులపై చర్యలు తీసుకోకపోవడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. విభజన హామీలపై కేంద్ర మంత్రులు నోరుమెదపాలని డిమాండ్ చేశారు. మునిసిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, మాజీ చైర్మన్ ముత్యాల చలం, కౌన్సిలర్ నీలం నరసింహారావు, పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రభాకర్,యువజన అధ్యక్షుడు షేక్ రఫీ, ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.సునీల్‌కుమార్ పాల్గొన్నారు. -
డోన్ సీఐపై కొరడా
అవినీతి ఆరోపణలతో వీఆర్‌కు కర్నూలు: జిల్లా పోలీసు శాఖలో మరో సీఐపై వేటు పడింది. అవినీతి ఆరోపణలతో పాటు విధుల పట్ల అలసత్వం వహిస్తున్నాడన్న కారణంతో డోన్ సీఐ ఇస్మాయిల్‌పై రాయలసీమ ఐజీ గోపాలకృష్ణ కొరడా ఝుళిపించారు. నెల రోజుల వ్యవధిలోనే ఐదుగురు సీఐలను వీఆర్‌కు పంపడం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఈనెల మొదటి వారంలో సీఐలు గంటా సుబ్బారావు, రామకృష్ణ, శ్రీధర్, సురేంద్రబాబులను వీఆర్‌కు వెళ్లారు. తాజాగా డోన్ సీఐ ఇస్మాయిల్‌ను కూడా వీఆర్‌కు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. శాఖాపరమైన చర్యల్లో భాగంగా ఆదోని టూటౌన్, త్రీటౌన్ సీఐలను వీఆర్‌కు రప్పించినప్పటికీ అక్కడ ఇంకా అధికారులను నియమించలేదు. నాల్గో పట్టణ సర్కిల్కుమాత్రం వీఆర్‌లో ఉన్న నాగరాజు రావును ఇటీవలనే నియమించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరు సీఐలపై త్వరలో వేటు పడే అవకాశం ఉందని పోలీసు శాఖలో చర్చ జరుగుతుంది. -
నువ్వెంత..నువ్వెంత..?
నిమ్స్‌లో డిష్యుం..డిష్యుం ఉన్నతాధికారుల మధ్య వాగ్వాదం సిటీబ్యూరో: ‘ఆస్పత్రి ఫర్నీచర్‌ను దొంగతనంగా ఇంటికి తెచ్చుకున్నావు, నీపై ఇప్పటికే అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఏసీబీ విచారణ కూడా జరుగుతోంది. నువ్వా నాకు నీతులు చెప్పేది?’ అని అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్ నిలదీస్తే..‘పరిశోధనపత్రాలు పబ్లిష్ కాకముందే అయినట్లు సెలక్షన్ కమిటీకి తప్పుడు సమాచారం ఇచ్చావు. అర్హత లేక పోయినా అక్రమ మార్గంలో పదోన్నతి పొందా వు’అంటూ డిప్యూటి మెడికల్ సూపరింటెండెంట్ ఇలా ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ప్రతిష్టాత్మక నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(నిమ్స్) వేదికగా నాలుగు రోజుల క్రితం ఆస్పత్రి అడ్మినిస్ట్రేషన్ విభాగంలోని ఇద్దరు సీనియర్ వైద్యాధికారుల మధ్య జరిగిన వాగ్వాదం ఇది. నిమ్స్‌లో అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ల మధ్య పచ్చ గడ్డివేస్తే భగ్గుమంటోంది. జూనియర్లకు ఆదర్శంగా ఉండాల్సిన సీనియర్ వైద్యాధికారులే రోడ్డున పడి సంస్థ పరువును బజారుకీడుస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏఎంఎస్‌పై డెరైక్టర్‌కు ఫిర్యాదు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పదోన్నతులపై 2012లో ఇంటర్వ్యూలు నిర్వహించారు. నిబంధనల ప్రకారం సీనియార్టీతో పాటు పరిశోధన పత్రాల ఆధారంగా పదోన్నతులు కల్పించాల్సి ఉంది. అయితే ప్రస్తుత అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణారెడ్డి పరిశోధనా పత్రాలు పబ్లిష్కాకుండానే ఇంటర్వ్యూకు హాజరైనట్లు ఆరోపణలు ఉన్నాయి. పరిశోధన పత్రాలను సమర్పించకుండానే 2011లోనే పబ్లిషైనట్లు కమిటీకి తప్పుడు సమాచారం ఇచ్చి అక్రమ పద్ధతిలో అడి షినల్ ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి అక్రమాలకు పాల్పడిన డాక్టర్ కృష్ణారెడ్డిపై చర్య తీసుకోవాలని కోరుతూ డిప్యూటి మెడికల్ డెరైక్టర్ డాక్టర్ కె.థామస్‌రెడ్డి ఇటీవల నిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్రనాథ్ సహా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, శాఖ ముఖ్య కార్యదర్శి, తెలంగాణ వైద్యుల సంఘానికి ఫిర్యాదు చేశారు. అవినీతిపై నిలదీసినందుకే అవినీతిపై నిలదీసినందునే అందరూ కలిసి నాపై కక్ష్య కట్టారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే నాటికి పరిశోధన పత్రాలు సమర్పించాను. పబ్లిషింగ్కు కొంత సమయం పడుతుందని, ఇందుకు నెల గడువు కావాలని కమిటీ సభ్యుల నుంచి అనుమతి కూడా తీసుకున్నా . పరిశోధనా పత్రాలను ఇంటర్నెట్లో పెట్టడంలో జాప్యం జరిగింది. నాపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదు. డాక్టర్ కె.వి.కృష్ణారెడ్డి, అసిస్టెంట్ మెడికల్ సూపరెంటెండెంట్ అందరి ముందు తిట్టారు వారం రోజుల క్రితం నిమ్స్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో జరిగిన సమావేశంలో సహోద్యోగులతో పాటు జూనియర్లు, ఇతర ఉద్యోగుల సమక్షంలోనే ఆయన నోటికొచ్చినట్లు మాట్లాడారు. తప్పుడు విద్యార్హతలు చూపడంతో పాటు సహోద్యోగుల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్న ఏఎంఎస్‌పై శాఖాపరమైన చర్య తీసుకోవాల్సిందే. డాక్టర్ కె.టి.రెడ్డి, డిప్యూటి మెడికల్ సూపరింటెండెంట్ -
కార్మిక శాఖలో ఫైళ్లు మాయం
విచారణ ఫైళ్లకు తిలోదకాలు విజిలెన్స్ విభాగంలో అవినీతి తిష్ట ఉన్నతాధికారుల ప్రేక్షక పాత్ర కమిషనరేట్ అవినీతి మయం సిటీబ్యూరో: కార్మిక శాఖ కమిషనరేట్‌లో ఫైళ్ల మాయమవడం కలకలం రేపుతోంది. సాక్షాత్తూ పరిపాలన, విజిలెన్స్ విభాగాలకు అధికారికంగా అందుతున్న ఫైళ్లే మాయమవుతున్నాయి. మరోవైపు అవినీతి ఆరోపణలకు సంబంధించిన విచారణ ఫైళ్లు ఏళ్ల తరబడి పెండింగ్‌లో మగ్గుతున్నాయి. అధికారులు వాటిపై నివేదికలు తెప్పించుకోవడంలోనూ నిర్లక్ష్యం వహించడం విస్మయానికి గురిచేస్తోంది. విజిలెన్స్ విభాగంలో దీర్ఘకాలంగా తిష్టవేసిన అవినీతి తిమింగలంపై అభియోగాలు వచ్చినా స్థాన చలనం కలుగడం లేదు. కొత్తగా కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఈ వ్యవహారాలపై ప్రేక్షక పాత్ర పోషించడం కార్మిక శాఖ కమిషనరేట్‌లో చర్చనీయాంశంగా మారింది. లేదని చెబుతూ... కార్మిక శాఖలోని అంతర్గత అవినీతి ఆరోపణలపై రెండేళ్ల క్రితం పరిపాలన, విజిలెన్స్ విభాగానికి అధికారికంగా (లెటర్ నంబర్ ఏ/5002/2013/ తేది. 07-11-2013) ఒక ఫైలు చేరింది. అందులో ‘కార్మిక శాఖలో పోస్టింగ్ ఉత్తర్వులు లేకుండా ఒక అధికారి హైదరాబాద్-2 డీసీఎల్‌గా విధుల్లో చేరి 13 నెలల పాటు జీతాన్ని అక్రమంగా డ్రా చేసుకున్నారు’ అనే అభియోగాలకు సంబంధించిన పూర్తి స్థాయి ఆధారాలతో అధికారికంగా పరిపాలన, విజిలెన్స్ విభాగానికి ఫైలు అందింది. కానీ రెండేళ్లు గడిచినా దానిపై విచారణ జరుగలేదు. తాజాగా ఆ ఫైలు పురోగతిపై ఆరా తీస్తే .. కొం దరి చేతివాటంతో మాయమైనట్లు తెలిసింది. సంబంధిత అధికారులు సైతం ఆ దస్త్రం పరిపాలన, విజిలెన్స్ విభాగాలల్లో లేదని స్పష్టం చేయడం గమనార్హం. నిండా నిర్లక్ష్యమే.. కార్మిక శాఖలో అంతర్గత అవినీతి, అక్రమాలకు సంబంధించిన విచారణ ఫైళ్లు ఏళ్ల తరబడి పెండింగ్‌లో మగ్గుతూనే ఉన్నాయి. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, సంబంధిత విభాగాల పర్యవేక్షకుల అవినీతి, అక్రమాలతో ఇవి కదలడం లేదు. ఉదాహరణకు మూడేళ్ల క్రితం పరిపాలన, విజిలెన్స్ విభాగాలకు (లెటర్ నంబర్ ఏ/ఓపీ1/2012 తేది.25-08-2012) అధికారికంగా ఒక ఫైలు చేరింది. అందులో ‘రంగారెడ్డి జిల్లా డీసీఎల్ అధికారి ఒకరు ఆఫీస్ రికార్డులను ట్యాంపరింగ్ చేసి అక్రమాలకు పాల్పడ్డాడు’ అనే అభియోగాలకు సంబంధించి పూర్తి ఆధారాలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఫైల్ అందిన 15 నెలల తర్వాత సంబంధిత విభాగం నుంచి రంగారెడ్డి జిల్లా జాయింట్ లేబర్ కమిషనర్‌కు ఆఫీస్ మెమో నంబర్ ఏ1/11679/2011. తేదీ 12/11/2013 ద్వారా ఈ వ్యవహారంపై నివేదిక సమర్పించాలని మెమో జారీ అయింది. ఇప్పటి వరకు దానికి సంబంధించి నివేదిక ఆ విభాగానికి చేరలేదు. దాని కోసం వేచిచూస్తున్నామని సంబంధిత అధికారులు చెబుతుండడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. -
ఎం.ఎన్.రెడ్డిపై అవినీతి ఆరోపణ
ఉప లోకాయుక్తకు ఫిర్యాదు చేశానన్న ఏడీజీపీ సుశాంత్ మహాపాత్ర సాక్షి, బెంగళూరు: లోకాయుక్త వై.భాస్కర్‌రావుపై వస్తున్న అవినీతి ఆరోపణల వేడి చల్లారక ముందే మరో ఉన్నత స్థాయి అధికారిపై వస్తున్న అవినీతి ఆరోపణలు ప్రజలతో పాటు అధికారుల్లోనూ ప్రకంపనలు రేపుతున్నాయి. సాధారణంగా నగర పోలీస్ కమిషనర్ నియామకం సమయంలో ఆ స్థానానికి రేసులో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారులు ఒకరిపై ఒకరు ఆరోపణలకు దిగడం షరామామూలే. అయితే ఈ సారి ఈ ఆరోపణల పర్వం మరింత ముందే మొదలైంది. ప్రస్తుత నగర పోలీస్ కమిషనర్ ఎం.ఎన్.రెడ్డి త్వరలోనే ఉద్యోగోన్నతిపై వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కర్ణాటక పోలీస్ హౌసింగ్ సొసైటీ ఏడీజీపీగా ఉన్న సమయంలో కొత్త పోలీస్ స్టేషన్లు, పోలీసుల క్వార్టర్స్ నిర్మాణంలో అవకతవకలకు పాల్పడ్డారంటూ హౌసింగ్ సొసైటీ ప్రస్తుత ఏడీజీపీ సుశాంత్ మహాపాత్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై తాను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి, రాష్ట్ర ఆర్థిక శాఖకు సైతం ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో వీరెవరూ స్పందించకపోవడంతో తాను ఉప లోకాయుక్త సుభాష్ బి.ఆడికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అయితే సుశాంత్ మహాపాత్ర చేసిన ఆరోపణల్లో ఎంతమాత్రం నిజం లేదని నగర పోలీస్ కమిషనర్ ఎం.ఎన్.రెడ్డి వెల్లడించారు. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, ఏ సాక్ష్యాలతో తనపై సుశాంత్ మహాపాత్ర ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారో తెలుసుకున్న తర్వాత ఈ అంశంపై పూర్తిగా స్పందిస్తానని పేర్కొన్నారు. -
లోకాయుక్తపై విచారణకు సిట్
12 మంది అధికారులను ఎస్ఐటీలో నియమించిన ప్రభుత్వం గురువారం నుంచే ప్రారంభం కానున్న దర్యాప్తు బెంగళూరు: లోకాయుక్తపై వచ్చిన అవినీతి ఆరోపణల విచారణకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పా టు చేసిన ప్రత్యేక విచారణ బృందానికి(ఎస్ఐటీ) గాను అధికారుల నియామకం పూర్తైది. ఈ విచారణ బృందానికి రాష్ట్ర జైళ్ల శాఖ ఏడీజీపీ కమల్‌పంత్ నేతృత్వం వహించనున్న విషయం తెలిసిందే. కాగా ఈ బృందంలో కేఎస్ఆర్టీసీ విజిలెన్స్ విభాగం డెరైక్టర్ సోమేందు ముఖర్జీ, బెంగళూరు పశ్చిమ విభాగం డీసీపీ లాబూరామ్లతో పాటు మొత్తం 12 మంది అధికారుల ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ బృందం నేటి(గురువారం) నుంచే విచారణను ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ బృందంలోని సభ్యుల నియామకానికి సం బంధించి డీజీపీ ఓం ప్రకాష్ రావు ఇప్పటికే ము ఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు రాష్ట్ర హోం శాఖ మంత్రి కె.జె.జార్జ్‌కు నివేదిక అందజేయ గా, సిద్ధరామయ్యతో పాటు జార్జ్ సైతం అం గీకారం తెలిపినట్లు విశ్వసనీయ సమాచారం. తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి సమగ్ర విచారణ జరిపించాలంటూ లోకాయుక్త వై.భాస్కర్‌రావే స్వయంగా గత నెల 28న రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిన నేపథ్యంలో ప్రత్యేక విచారణ బృందాన్ని (ఎస్ఐటీ) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అశ్విన్రావ్పై మరో ఫిర్యాదు లోకాయుక్త సంస్థ పేరును అడ్డు పెట్టుకుని అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న లోకాయుక్త న్యాయమూర్తి వై.భాస్కర్‌రావు కుమారుడు అశ్విన్‌రావుపై మరో ఫిర్యాదు నమోదైంది. తన వద్ద రూ.20లక్షలు తీసుకుని మోసం చేశారంటూ బెంగళూరుకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కృష్ణమూర్తి ప్రత్యేక విచారణ బృందం అధికారి కమల్‌పంత్‌కు బుధవారమిక్కడ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి విలేకరులతో మాట్లాడుతూ....‘రియల్ ఎస్టేట్ వ్యవహారానికి సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యే మునిరత్న నాకు రూ.8కోట్లు బాకీ పడ్డారు. ఈ మొత్తాన్ని చాలా రోజుల వరకు ఇవ్వకుండా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. దీంతో ఈ మొత్తాన్ని నాకు ఇప్పిం చాల్సిందిగా నేను అశ్విన్‌రావును కోరాను. ఇందుకు అశ్విన్‌రావు తనకు రూ.2కోట్లు ఇస్తే మునిరత్న నుంచి రూ.8కోట్లు ఇప్పిస్తానని చెప్పారు. అయితే నేను అంత మొత్తాన్ని ఒకేసారి ఇచ్చుకోలేనని చెప్పాను. దీంతో రెండు విడతల్లో ఒక్కొసారి రూ.10లక్షల చొప్పున మొత్తం రూ.20లక్షలు అందజేశాను. ఈ డబ్బులు తీసుకున్న తర్వాత అశ్విన్‌రావు నా నుంచి తప్పించుకు తిరుగుతున్నారు’ అని తెలిపారు. తాను అశ్విన్‌రావుకు ఇచ్చి న రూ.20లక్షలను ఎలాగైనా సరే తనకు ఇప్పించాలని కమల్‌పంత్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు కృష్ణమూర్తి వెల్లడించారు. -
ఏ ఫిర్యాదులు తీసుకోకండి...
సిబ్బందికి లోకాయుక్త మౌఖిక ఆదేశాలు ! లోకాయుక్త రాజీనామాపై శుక్రవారం సైతం కొనసాగిన ఆందోళనలు బెంగళూరు: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న లోకాయుక్త న్యాయమూర్తి వై.భాస్కర్‌రావు లోకాయుక్తలో ఫిర్యాదుల స్వీకరణకు తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు సమాచారం. స్వయంగా లోకాయుక్త పైనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే వరకు ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు స్వీకరించరాదని ఆయన లోకాయుక్త సిబ్బందికి మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. లోకాయుక్త వై.భాస్కర్‌రావు కుమారుడు అశ్విన్‌రావుపై కోట్ల రూపాయల్లో అవినీతి ఆరోపణలు వస్తుండడంతో పాటు ఇందుకు భాస్కర్‌రావు సైతం మద్దతుగా నిలిచారనే ఆరోపణల మధ్య లోకాయుక్త రాజీనామా చేయాలంటూ ప్రజాసంఘాలు, న్యాయవాదులు లోకాయుక్త కార్యాలయంతో పాటు ఆయన నివాసం ఎదుట సైతం నిరసనకు దిగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారుల అవినీతికి సంబంధించి ఆర్టీఐ కార్యకర్తలు, సాధారణ ప్రజలు ఇచ్చే ఫిర్యాదులను స్వీకరించవద్దని, ఎలాంటి విచారణను చేపట్టవద్దని లోకాయుక్త భాస్కర్‌రావు, లోకాయుక్త ఏడీజీపీ ప్రేమ్‌శంకర్ మీనాను ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఫిర్యాదులు చేసేందుకు వస్తున్న సామాన్యులను లోకాయుక్త కార్యాలయం ఎదుట ఉన్న పోలీసులు బయటి నుంచే పంపించి వేస్తున్నారు. తమను ఇబ్బంది పెట్టే అవినీతి అధికారుల గురించి ఫిర్యాదు చేసేందుకు ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి నగరానికి వచ్చిన సామాన్యులు తమ ఫిర్యాదులు నమోదు చేసుకోకుండానే వెనక్కు పంపేస్తుండడంతో ఏం చేయాలో దిక్కుతోచక తీవ్ర ఆవేదనతో లోకాయుక్త కార్యాలయం నుంచి వెనుదిరుగుతున్నారు. శుక్రవారం సైతం కొనసాగిన ఆందోళనలు.... ఇక లోకాయుక్త వై.భాస్కర్‌రావు తక్షణమే రాజీనామా చేయాలనే డిమాండ్‌తో శుక్రవారం సైతం ఆందోళనలు కొనసాగాయి. లోకాయుక్త రాజీనామాను డిమాండ్ చేస్తూ కర్ణాటక రక్షణా వేదిక కార్యకర్తలు నగరంలో ర్యాలీని నిర్వహించారు. గాంధీనగర నుంచి ర్యాలీగా బయలుదేరిన కరవే కార్యకర్తలు లోకాయుక్త కార్యాలయానికి చేరుకొని, లోకాయుక్తను ముట్టడించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలో కొంతమంది కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక బార్‌కౌన్సిల్ సభ్యులు సైతం లోకాయుక్త కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ఈ కేసును సీబీఐకి అప్పగించే వరకు తమ పోరాటాన్ని ఆపబోమని న్యాయవాదులు, ప్రజాసంఘాల నేతలు తెలిపారు. ఇక లోకాయుక్త పై వచ్చిన ఆరోపణలను సాకుగా చూపుతూ కొన్ని చిన్న చేపలను బలిపశువులు చేసి ఎన్నో పెద్ద తిమింగళాలు తప్పించుకునే ప్రయత్నం చేస్తునానయని ‘న్యాయక్కాగి నావు’ సంస్థ విమర్శించింది. శుక్రవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంస్థ పదాధికారుల్లో ఒకరైన అగ్ని శ్రీధర్ మాట్లాడుతూ....‘ఎంతో కాలంగా లోకాయుక్తలో అవినీతి జరుగుతూనే ఉంది. ఈ అవినీతిని అడ్డుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఇందుకు ప్రజల నుంచి భారీ ఎత్తున స్పందన రావాలి’ అని పేర్కొన్నారు. కాగా, ఈ విషయంపై ప్రముఖ న్యాయవాది ఎ.కె.సుబ్బయ్య స్పందిస్తూ అవినీతి ఆరోపణలు వచ్చినంత మాత్రాన లోకాయుక్త పదవిలో ఉన్న వారు రాజీనామా చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ఆరోపణలు రుజువైతేనే రాజీనామా కోరాల్సి ఉంటుందంటూ భాస్కర్‌రావుకు మద్దతుగా నిలిచారు. -
మహాభియోగ తీర్మానం !
లోకాయుక్తను తొలగించడానికి బీజేపీ, జేడీఎస్ సహా 57 మంది ఎమ్మెల్యేల సంతకాలు బెంగళూరు: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న లోకాయుక్త భాస్కర్‌రావ్‌ను వాయిదా తీర్మానం ద్వారా (మహాభియోగం) ఆ పదవి నుంచి దించడానికి విపక్షాలు తమ ప్రయత్నాలను ఉ దృతం చేశాయి. అందులో భాగంగా లోకాయుక్తను పదవి నుంచి తొలగించే విషయమై రూపొందించిన పత్రంలో శాసనభలో ప్రధాన విపక్షమైన భారతీయ జనతా పార్టీ, జేడీఎస్‌తో సహా 57 మంది శాసనసభ్యులు సంతకాలు చేశారు. శాసనసభ్యుల సంతకాలతో కూడిన ప్రతిని శాసనసభలో ఆయా పార్టీల ఫ్లోర్లీడర్లయిన జగదీష్‌శెట్టర్, కుమారస్వామిలు స్పీకర్ కాగోడు తిమ్మప్పకు శుక్రవారమే అందజేశారు. అనంతరం వారు బెళగావిలోని సువర్ణ విధానసౌధలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. లోకాయుక్త భాస్కర్ రావు, ఆయన కొడుకు అశ్విన్రావుతో కలిసి అక్రమాలకు పాల్పడుతూ ఎంతో పవిత్రమైన ఆ పదవికి కళంకం తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందువల్లే భా స్కర్రావును ఆ పదవి నుంచి తొలగించాలని బీజేపీ, జేడీఎస్‌లు నిర్ణయించుకున్నాయని స్పష్టం చేశారు. నిబంధనలను అనుసరించి మహాభియోగ తీర్మానం ద్వారా ఆయన్ను తొలగించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఏదేని వ్యక్తిని ఓ పదవి నుంచి మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించాలంటే చట్టసభలో మొదటగా నోటీసు ఇచ్చి అటుపై చర్చ జరగాల్సి ఉంటుందన్నారు. నోటీసుపై శాసనసభ సంఖ్యాబలంలో 20 శాతం మంది శాసనసభ్యులు సంతకాలు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు తాము రూపొందించిన నోటీసుపై 56 మంది శాసనసభ్యులు సంతకాలు చేశారని తెలిపారు. ఈ నోటీసును స్పీకర్ కాగోడు తిమ్మప్పకు అందజేసినట్లు వెల్లడించారు. శాసనసభ వ్యవహారాల సలహా సమితితో సంప్రదించి ఈ నోటీసుపై చట్టసభలో చర్చించడానికి అవకాశం కల్పించనున్నట్లు స్పీకర్ కాగోడు తిమ్మప్ప భరోసా ఇచ్చారన్నారు. లోకాయుక్త ప్రతిష్టను నిలపడానికి రాజకీయాలకు అతీతంగా అందరూ మద్దతు ఇస్తున్నారన్నారు. ఈ క్రమంలో స్వతంత్ర అభ్యర్థులతో పాటు కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా తమతో కలిసి నడవడానికి ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ శాసనసభ్యుడు ఏ.ఎస్ పాటిల్ కూడా మహాభియోగ తీర్మానానికి మద్దతు తెలుపుతూ నోటీసుపై సంతకం చేశారని తెలిపారు. -
గంటా వర్గానికి ముకుతాడు
యనమలకు ఇన్చార్జి బాధ్యతలు మంత్రుల ఆదిపత్యానికి అడ్డుకట్ట యనమలతో అయ్యన్నకు సాన్నిహిత్యం గంటా వర్గానికి ప్రతికూల పరిణామం విశాఖపట్నం : గతేడాది అధికారుల బదిలీల సమయంలో జిల్లా మంత్రులపై వెల్లువెత్తున అవినీతి ఆరోపణలు రాష్ర్ట స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ ఏడాది ఆ పరిస్థితి తలెత్తకుండా బదిలీల్లో స్థానిక మంత్రుల పెత్తనానికి చెక్ పెట్టేందుకు జిల్లాకో ఇన్చార్జి మంత్రిని నియమించింది. మన జిల్లాకు రాష్ర్ట ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడ్ని నియమించడంతో జిల్లా మంత్రులకు చెక్ పడుతుందో లేక..ఆదిపత్యపోరు మరింత ఆజ్యం పోస్తుందోననే చర్చ పార్టీలో జరుగుతోంది. సాధారణంగా ఎమ్మెల్యేలకు కేటాయించే ఏసీడీపీ, ఎస్డీఎఫ్, సీడీపీ వంటి నిధులను ఖర్చు చేసే విషయంలో పెత్తనం జిల్లా ఇన్చార్జి సాక్షి, విశాఖపట్నం: విశాఖ మహానగరంతో పాటు జిల్లాలోని ఎనిమిది మండలాల్లో తీరం ఉంది. 134 కిలోమీటర్ల తీర ప్రాంతంలో 62 మత్స్యకార గ్రామాలున్నాయి. సుమారు లక్షా 20 వేల మంది మత్స్యకారులున్నారు. వీరిలో సుమారు 35వేలమంది పూర్తిగా చేపలవేటే జీవనోపాధిగా జీవిస్తున్నారు. 650 మెక నైజ్డ్ బోట్లు, 1500కు పైగా ఇంజన్ బోట్లు ఉన్నాయి. వందలాదిగా తెప్పలు,నావలు ఉన్నాయి. వేట నిషేధ సమయంలో మెకనైజ్డ్, ఇంజన్ బోట్లు లంగరేయాల్సిందే. మెకనైజ్డ్ బోటుపై 8 నుంచి 10 మంది, ఇంజన్ బోటుపై ఆరు నుంచి ఎనిమిది మంది వరకు మత్స్యకారులు పని చేస్తుంటారు. ఇక పరోక్షంగా మరో 10వేల నుంచి 15వేల మంది వరకు జీవనోపాధి పొందుతుంటారు. ప్రతీ ఏటా ఏప్రిల్-15వ తేదీ నుంచి మే-31వ తేదీ వరకు వేట నిషేధం అమలులో ఉండేది. గతేడాది వరకు 47రోజులు పాటు ఉండే వేటనిషేధ సమయాన్ని ఈ ఏడాది నుంచి ఏకంగా 61రోజులకు పెంచారు. గతంలో నిషేధ సమయంలో కుటుంబానికి 31 కిలోల బియ్యంతో సరిపెట్టేవారు. ఏటా నిషేధ సమయంలో జీవనోపాధి కోల్పోయే మత్స్యకారుల జాబితాలు మారుతుంటాయి. కొన్ని సార్లు పెరుగుతుంటాయి.. మరి కొన్ని సార్లు తగ్గుతుంటాయి. అలాంటిది గతేడాది మంజూరైన సాయం ఈ ఏడాది పంపించడం.. ఈ ఏడాది సాయం వచ్చే ఏడాది పంచిపెట్టడం పరిపాటిగా మారిపోయింది. గతేడాది నిషేధ సమయంలో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు నేటికీ బియ్యం పంపిణీ జరగలేదు. ఇక ఈ ఏడాది నుంచి నిషేధసమయం పెంచడంతో బియ్యం స్థానంలో నగదు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కుటుంబానికి రూ.2వేల చొప్పున వారి బ్యాంకు ఖాతాలోనే జమచేయనున్నారు. నిషేధం అమలు లోకి వచ్చిసగం రోజులు గడిచినా అది ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంది. మెకనైజ్డ్, ఇంజన్ బోట్లపై ఆధారపడి జీవించే సుమారు ఐదువేల మంది మత్స్యకారులతో పాటు వీటిపై పరోక్షంగా ఆధారపడిజీవించే మరో 15వేల మంది మత్స్యకారులకు లబ్ధి చేకూర్చే విధంగా రూ.4కోట్లతో జిల్లా మత్స్యశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఆర్థిక లోటు కారణంగా ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. దీంతో సాపాటు లేక..సాయం లేక గంగపుత్రులు ఈ ఏడాది పస్తులతో అలమటించాల్సిన పరిస్థితి దాపురించింది. -
తప్పించాల్సిందే..
నలుగురు అవినీతి మంత్రులపై బీజేపీ ఆగ్రహం విధానసౌధలోని గాంధీజీ విగ్రహం వద్ద ధర్నాకు యత్నం అదుపులోకి తీసుకున్న పోలీసులు బెంగళూరు : భూ ఆక్రమణలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు డీకే శివకుమార్, ఖమరుల్ ఇస్లాం, దినేష్ గుండూరావు, మహదేవప్రసాద్ను తక్షణమే మంత్రి వర్గం నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు ధర్నాకు దిగేందుకు విఫలయత్నం చేశారు. గురువారమిక్కడి విధానసౌధ ప్రాంగణానికి చేరుకున్న బీజేపీ నేతలు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ విధానసౌధ తూర్పు వైపు ప్రవేశ ద్వారం గాంధీజీ విగ్రహం వైపు కదిలారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు విధానసౌధ ప్రాంగణంలో ధర్నాకు అవకాశం లేద ంటూ బీజేపీ నేతలను అడ్డుకున్నారు. ఈ సందర్భంలో బీజేపీ నేతలు, పోలీసుల నడుమ వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులను తోసుకుంటూ బీజేపీ నేతలు గాంధీజీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఆందోళన కారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని అక్కడి నుంచి తరలించారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్‌జోషి, ఆ పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహరాల ఇన్చార్జ్ మురళీధరవ్రావు, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, జగదీష్ శెట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప, ఎంపీ శోభాకరంద్లాజే తదితరులను పోలీసులు ఈ సందర్భంగా అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వైఖరిపై మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలిపే అవకాశాన్ని సైతం కల్పించకపోవడం దారుణమంటూ ధ్వజమెత్తారు. శాసన సభ్యుల హక్కుల ఉల్లంఘన.... విధానసౌధ ప్రాంగణంలో తాము నిర్వహించతలపెట్టిన ధర్నా కార్యక్రమాన్ని అడ్డుకోవడం ద్వారా శాసనసభ్యుల హక్కుల ఉల్లంఘనకు రాష్ట్ర ప్రభుత్వం పాల్పడిందని మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ మండిపడ్డారు. ఈ విషయంపై రానున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. అవినీతి పరులను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోందని, అందుకే అవినీతికి పాల్పడ్డ రాష్ట్ర మంత్రులను సైతం వెనకేసుకొస్తోందని మండిపడ్డారు. డిసెంబర్ 2న మరోసారి రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని వెల్లడించారు. -
నిర్లక్ష్యంపై ఐజీ వేటు
నెల్లూరు(క్రైమ్): విధి నిర్వహణలో నిర్లక్ష్యంతో పాటు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పొదలకూరు సీఐ హైమారావుపై గుంటూరు రేంజ్ ఐజీ పీవీ సునీల్‌కుమార్ గురువారం సస్పెండ్ వేటు వేశారు. పొదలకూరు సీఐగా ఎం.హైమారావు ఈ ఏడాది ఫిబ్రవరిలో బాధ్యతలు చేపట్టారు. నాటి నుంచి పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పొదలకూరు సర్కిల్ పరిధిలోని మూగసముద్రం గ్రామంలో ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఓ వర్గానికి చెందిన వృద్ధుడితో పాటు కొందరు గాయాలపాలయ్యారు. అప్పట్లో 324 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. గాయాలపాలైన వృద్ధుడు నెల తర్వాత గుండెపోటుతో మృతి చెందాడు. దీన్ని సాకుగా తీసుకున్న సీఐ ప్రత్యర్థి వర్గంపై 302 కింద కేసు నమోదు చేసి మృతుడి తరఫు వారి నుంచి భారీగా ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. అలాగే పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు రమేష్ విద్యార్థినులను లైంగికంగా వేధించాడు. ఈ ఘటనపై పోలీసులు ఫోక్సాయాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఉపాధ్యాయుడికి కొమ్ముకాసే విధంగా దర్యాప్తు సాగింది. నిందితున్ని అరెస్ట్ చేయడంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు లేకపోలేదు. మరో ఫోక్సాయాక్ట్ కేసులో ఇదే విధంగా సీఐ వ్యవహరించారు. అంతేకాకుండా బాధితురాలిని సకాలంలో వైద్యపరీక్షలకు తీసుకెళ్లలేదు. దర్యాప్తులోనే అలసత్వం వహించారని ఆరోపణలు వచ్చాయి. నిందితులను తప్పించేలా వ్యవహరించారని విమర్శలు గుప్పుమన్నాయి. ఈ ఘటనలపై ఎస్పీ ఎస్.సెంథిల్‌కుమార్‌కు ఫిర్యాదులు అందాయి. సమగ్ర దర్యాప్తు చేపట్టారు. అనంతరం నివేదికను ఐజీకి పంపారు. గుంటూరు రేంజ్ ఐజీ నివేదికను పరిశీలించి పొదలకూరు సీఐ హైమారావుపై సస్పెండ్ వేటు వేశారు. ఆది నుంచీ అవినీతి ఆరోపణలు హైమారావు ఆది నుంచీ అనేక అవినీతి ఆరోపణలు మూటగట్టుకున్నారు. ఆర్టీసీకి చెందిన ఓ వ్యక్తిని బినామీగా నియమించుకుని అవినీతికి పాల్పడ్డాడన్న విమర్శలున్నాయి. అతని ఆధ్వర్యంలో పంచాయితీలు, సివిల్ వివాదాలు నెరిపారన్న ఆరోపణలున్నాయి. ఇటీవల కలువాయికి చెందిన కొందరు ఎర్రచందనం రవాణా విషయంలో సీఐ తమను వేధిస్తున్నారని ఎస్పీ సెంథిల్‌కుమార్‌కు లిఖితపూర్వక ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దీంతో సీఐ వ్యవహారశైలిపై ఎస్పీ సమగ్ర విచారణ జరిపి నివేదికను ఐజీకి అందజేసినట్టు తెలుస్తోంది. వరుస ఘటనలతో సిబ్బంది బెంబేలు అవినీతి, అక్రమాలకు పాల్పడితే వేటు తప్పదన్న సంకేతాలతో పోలీసు అధికారులు బెంబేలు ఎత్తుతున్నారు. క్రమశిక్షణతో నడచుకోకపోతే చర్యలు తప్పవని ఐజీ ఇప్పటికే పలుమార్లు సిబ్బందిని హెచ్చరించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎన్నికల విధుల్లో ఉన్న ఓ అధికారిని అక్రమంగా నిర్బంధించి అనుచితంగా ప్రవర్తించిన ఘటనలో సీఐ చెంచురామారావును ఐజీ సస్పెండ్ చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడి ధనార్జనే ధ్యేయంగా వ్యవహరించిన వాకాడు ఎస్ఐ వాసును ఏకంగా సర్వీసు నుంచి తొలగించారు. బొగ్గు కుంభకోణం కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలతో కృష్ణపట్నం పోర్టు ఎస్ఐను సస్పెండ్ చేశారు. తాజాగా సీఐ హైమారావును సస్పెండ్ చేశారు. -
వజ్ర కిరీటంపై సమగ్ర విచారణ
సాక్షి ప్రతినిధి, ఏలూరు : అవినీతి ఆరోపణలు రుజువైతే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, విధుల నుంచి తొలగిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు హెచ్చరించారు. శుక్రవారం ఏలూరులో తనను కలిసిన విలేకరులతో మంత్రి మాట్లాడారు. నగరంలోని ఆర్ఆర్ పేట వేంకటేశ్వరస్వామి ఆలయంలో వజ్రాల కిరీటం వ్యవహారం, మేనేజర్‌గా పనిచేసిన తల్లాప్రగడ విశ్వేశ్వరరావుపై వెల్లువెత్తుతున్న ఆరోపణల నేపథ్యంలో ‘సాక్షి’లో ప్రచురితమైన వరుస కథనాలపై మంత్రి స్పందించారు. ఈవో వ్యవహార శైలిపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించినట్టు మంత్రి తెలిపారు. ఆరోపణలు వాస్తవాలేనని నిగ్గుతేలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే ఆయన పనితీరుపై తనకు పలుమార్లు ఫిర్యాదులు అందాయని, అవినీతి ఆరోపణలతోపాటు వ్యక్తిగత వ్యవహార శైలిపైనా విమర్శలు రావడంతో వెంటనే బదిలీ చేశామని చెప్పారు. శాఖాపరమైన విచారణను ఈ రీజియన్ అధికారులు చేపడితే అతను కొంత ప్రభావం చూపించే అవకాశం ఉందన్నారు. ఈ దృష్ట్యా ఇతర జిల్లాల అధికారులతో ఓ కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తామని చెప్పారు.