డోన్ సీఐపై కొరడా | Don CI whipto change position vr | Sakshi
Sakshi News home page

డోన్ సీఐపై కొరడా

Published Mon, Mar 21 2016 2:37 AM | Last Updated on Sun, Sep 3 2017 8:12 PM

డోన్ సీఐపై కొరడా

డోన్ సీఐపై కొరడా

అవినీతి ఆరోపణలతో వీఆర్‌కు

కర్నూలు: జిల్లా పోలీసు శాఖలో మరో సీఐపై వేటు పడింది. అవినీతి ఆరోపణలతో పాటు విధుల పట్ల అలసత్వం వహిస్తున్నాడన్న కారణంతో డోన్ సీఐ ఇస్మాయిల్‌పై రాయలసీమ ఐజీ గోపాలకృష్ణ కొరడా ఝుళిపించారు. నెల రోజుల వ్యవధిలోనే ఐదుగురు సీఐలను వీఆర్‌కు పంపడం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఈనెల మొదటి వారంలో సీఐలు గంటా సుబ్బారావు, రామకృష్ణ, శ్రీధర్, సురేంద్రబాబులను వీఆర్‌కు వెళ్లారు. తాజాగా డోన్ సీఐ ఇస్మాయిల్‌ను కూడా వీఆర్‌కు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

శాఖాపరమైన చర్యల్లో భాగంగా ఆదోని టూటౌన్, త్రీటౌన్ సీఐలను వీఆర్‌కు రప్పించినప్పటికీ అక్కడ ఇంకా అధికారులను నియమించలేదు. నాల్గో పట్టణ సర్కిల్‌కుమాత్రం వీఆర్‌లో ఉన్న నాగరాజు రావును ఇటీవలనే నియమించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరు సీఐలపై త్వరలో వేటు పడే అవకాశం ఉందని పోలీసు శాఖలో చర్చ జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement