12 మంది అధికారులను ఎస్‌ఐటీలో నియమించిన ప్రభుత్వం
గురువారం నుంచే ప్రారంభం కానున్న దర్యాప్తు
బెంగళూరు: లోకాయుక్తపై వచ్చిన అవినీతి ఆరోపణల విచారణకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పా టు చేసిన ప్రత్యేక విచారణ బృందానికి(ఎస్‌ఐటీ) గాను అధికారుల నియామకం పూర్తైది. ఈ విచారణ బృందానికి రాష్ట్ర జైళ్ల శాఖ ఏడీజీపీ కమల్‌పంత్ నేతృత్వం వహించనున్న విషయం తెలిసిందే. కాగా ఈ బృందంలో కేఎస్‌ఆర్‌టీసీ విజిలెన్స్ విభాగం డెరైక్టర్ సోమేందు ముఖర్జీ, బెంగళూరు పశ్చిమ విభాగం డీసీపీ లాబూరామ్‌లతో పాటు మొత్తం 12 మంది అధికారుల ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ బృందం నేటి(గురువారం) నుంచే విచారణను ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ బృందంలోని సభ్యుల నియామకానికి సం బంధించి డీజీపీ ఓం ప్రకాష్ రావు ఇప్పటికే ము ఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు రాష్ట్ర హోం శాఖ మంత్రి కె.జె.జార్జ్‌కు నివేదిక అందజేయ గా, సిద్ధరామయ్యతో పాటు జార్జ్ సైతం అం గీకారం తెలిపినట్లు విశ్వసనీయ సమాచారం. తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి సమగ్ర విచారణ జరిపించాలంటూ లోకాయుక్త వై.భాస్కర్‌రావే స్వయంగా గత నెల 28న రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిన నేపథ్యంలో ప్రత్యేక విచారణ బృందాన్ని (ఎస్‌ఐటీ) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
అశ్విన్‌రావ్‌పై మరో ఫిర్యాదు
లోకాయుక్త సంస్థ పేరును అడ్డు పెట్టుకుని అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న లోకాయుక్త న్యాయమూర్తి వై.భాస్కర్‌రావు కుమారుడు అశ్విన్‌రావుపై మరో ఫిర్యాదు నమోదైంది. తన వద్ద రూ.20లక్షలు తీసుకుని మోసం చేశారంటూ బెంగళూరుకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కృష్ణమూర్తి ప్రత్యేక విచారణ బృందం అధికారి కమల్‌పంత్‌కు బుధవారమిక్కడ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి విలేకరులతో మాట్లాడుతూ....‘రియల్ ఎస్టేట్ వ్యవహారానికి సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యే మునిరత్న నాకు రూ.8కోట్లు బాకీ పడ్డారు. ఈ మొత్తాన్ని చాలా రోజుల వరకు ఇవ్వకుండా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. దీంతో ఈ మొత్తాన్ని నాకు ఇప్పిం చాల్సిందిగా నేను అశ్విన్‌రావును కోరాను. ఇందుకు అశ్విన్‌రావు తనకు రూ.2కోట్లు ఇస్తే మునిరత్న నుంచి రూ.8కోట్లు ఇప్పిస్తానని చెప్పారు. అయితే నేను అంత మొత్తాన్ని ఒకేసారి ఇచ్చుకోలేనని చెప్పాను. దీంతో రెండు విడతల్లో ఒక్కొసారి రూ.10లక్షల చొప్పున మొత్తం రూ.20లక్షలు అందజేశాను. ఈ డబ్బులు తీసుకున్న తర్వాత అశ్విన్‌రావు నా నుంచి తప్పించుకు తిరుగుతున్నారు’ అని తెలిపారు. తాను అశ్విన్‌రావుకు ఇచ్చి న రూ.20లక్షలను ఎలాగైనా సరే తనకు ఇప్పించాలని కమల్‌పంత్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు కృష్ణమూర్తి వెల్లడించారు.
లోకాయుక్తపై విచారణకు సిట్
Published Thu, Jul 9 2015 1:51 AM | Last Updated on Sun, Sep 3 2017 5:08 AM
Advertisement
Advertisement