‘ఆరోగ్య సేతు బాడీగార్డ్‌గా పని చేస్తుంది’ | Kishan Reddy Inaugurates Medical Portal In Hyderabad BJP Office | Sakshi
Sakshi News home page

‘ఆరోగ్య సేతు బాడీగార్డ్‌గా పని చేస్తుంది’

Published Sat, Apr 25 2020 1:51 PM | Last Updated on Sat, Apr 25 2020 2:10 PM

Kishan Reddy Inaugurates Medical Portal In Hyderabad BJP Office - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వాలు కరోనాను ఎదుర్కొనేందుకు అంకితభావంతో పని చేస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. బీజేపీ మెడికల్ సెల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ జిల్లా కార్యాలయంలో ‘మెడికల్ పోర్టల్’ శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో  వృద్ధులు, మహిళలు, దివ్యాగులకు ఈ పోర్టల్ ద్వారా అత్యవసర వైద్య సేవలు అందించనున్నామని తెలిపారు. కొన్ని నగరాలల్లో అధికంగా కరోనా వైరస్‌ పాజిటివ్ కేసులు వస్తున్నాయని, ఇందుకు కారణం మర్కజ్ ప్రార్తనలు చేసిన సభ్యులు తెలంగాణతో పాటు, దేశంలోని అన్ని రాష్ట్రాలకు వెళ్లారని తెలిపారు. 60 శాతం మర్కజ్‌కు వచ్చిన వారి కేసులే ఉన్నాయిని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడం, సలహాలిచ్చేందుకు కేంద్ర అధికారుల బృందాన్ని కేంద్ర ప్రభుత్వం పంపిందని ఆయన తెలిపారు. కొన్ని మినహాయింపులు కేంద్రం ఇచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో లాక్‌డౌన్‌ చేసిందని ఆయన అన్నారు. సింకింద్రాబాద్‌లో స్థానిక కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో  విస్తృతంగా కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా బీజేపీ కార్యకర్తలు పాటిస్తున్నారని మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. (ఆకలితో ఉంటే ఈ నెంబర్‌కి కాల్‌ చేయండి)

ఆసుపత్రుల్లో ఓపీలను మూసివేశారు. ఎమర్జెన్సీ కేసులు పూర్తిగా తగ్గిపోయాయి. ఏదైనా జబ్బు వస్తే ఎక్కడికి వెళ్లాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉందని, అలాంటి వారిని ఆదుకోవాలని ఆయన తెలిపారు. ‘ఆరోగ్య సేతు’ యాప్‌లో ఆరోగ్య వివరాలు పొందుపరిస్తే, కరోనాకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతుందని ఆయన చెప్పారు. ప్రజలంతా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే మీ చుట్టూ ఉన్న వారికి కరోనా ఉంటే అలర్ట్ చేస్తుందని మంత్రి కిషన్‌రెడ్డి వివరించారు. అది బాడీగార్డులా పని చేస్తుందని ఆయన అన్నారు. పేదలను వైద్యపరంగా ఆదుకునేందుకు డాక్టర్ల బృందంతో మాట్లాడి ప్రతి నియోజకవర్గంలో సేవలందించడానకి సిద్దంగా ఉన్నామని ఆయన చెప్పారు. చాలా మంది డాక్టర్లు ప్రజలకు సేవలందిస్తామని చెబుతున్నారని, ఒత్తిడిలో ఉన్నా ప్రజాసేవకు ముందుకు వచ్చిన వారికి అభినందనలు తెలిపారు. (సఫాయీ.. ఓ సిపాయి)

ప్రతి అసెంబ్లీలో నియోజకవర్గంలో సేవకులు ఉంటారని, ఏదైనా అనారోగ్యంతో బాధపడితే సంబందిత డాక్టర్లకు ఫోన్ చేసి మెడికల్ అసిస్టెంట్ తీసుకోవచ్చని, అన్ని విభాగాల డాక్టర్లు ఇందులో ఉన్నారని తెలిపారు. హైదరాబాద్ పరిధిలో ఒక్కో డాక్టర్‌కు ఇద్దరు బీజేపీ కార్యకర్తలు అసిస్టెంట్లుగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమం వృద్దులు, మహిళలు, దివ్యాంగుల కోసం ఏర్పాటు చేశామని తెలిపారు. వారికే మొదటి ప్రాధాన్యం ఉంటుందన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ఈ డాక్టర్ల సేవలను వినియోగించుకోవాలని ప్రజలను మంత్రి కోరారు. (అసలు సమస్య ఆ 6%)

సంపత్ కుమార్ ఈ కార్యక్రమాన్ని కో ఆర్డినేట్ చేస్తారని, దివ్యాంగులు, వృద్దులకు ఇంటికే మెడిసిన్ తెచ్చిస్తారని కిషన్‌రెడడ్డి చెప్పారు. ప్రజలు లాక్‌డౌన్‌కు సహకరించడం లేదు, దీంతో కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన అన్నారు. సెల్ఫ్ క్వారెంటైన్ చేసుకొని కుటుంబ సభ్యలను కాపాడుకోగలమని, కోవిడ్‌కు వ్యతిరేకంగా పోరాడుతూ సేవలు అందిస్తున్న వారు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రజల ఏ సేవ చేసేందుకు ముందుకు వచ్చినా సామాజిక దూరం పాటించాన్నారు. కమాండ్ కంట్రోల్ రూంలో ఉండే సిబ్బంది పేదలు, వృద్దులు, మహిళలు ఏ సేవలు అడిగినా విసుక్కోకుండా సేవ చేయాలన్నారు. హెల్త్ ఎమర్జెన్సీ ఉన్నవారు మా హెల్ప్‌ లైన్‌ నంబర్‌ 9959261273 లేదా కిషన్‌రెడ్డి అనే వెబ్‌సైట్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌లో పెట్టిన లిస్ట్ చూసి సంప్రదించాలని ఆయన కోరారు. 180 మంది డాక్టరు ఆయా సమయాల్లో  అందుబాటులో ఉంటారని మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు ప్రకాష్ రెడ్డి, గౌతమ్ రావు, అజయ్, డాక్టర్లు సురేష్ గౌడ్ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement