
సాక్షి, హైదరాబాద్ : నాంపల్లి నియోజక వర్గంలోని మంగరు బస్తీలో ఇటీవల గోడకూలి చనిపోయిన ముగ్గురు చిన్నారుల కుటుంబ సభ్యులను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. గోడకూలి ముగ్గురు చిన్నారులు చనిపోవడం చాలా బాధాకరమన్నారు. నగరంలో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ క్వార్టర్స్‌ను వెంటనే కూలగొట్టి కొత్తవాటిని నిర్మించాలని తెలిపారు. మృతి చెందిన చిన్నారుల కుటుంబానికి ఇంకా సహాయం అందలేదని, వెంటనే స్థానిక ప్రభుత్వం పరిహారం చెల్లించాలని సూచించారు. మంగర బస్తీలోని శిథిలావస్థ ఇళ్లను తీసివేసి యుద్ధ ప్రాతిపదికన కొత్త వాటిని నిర్మించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment