సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి బుధవారం లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ ‘భారతమాల’ పథకంలో భాగంగా.. తెలంగాణ రాష్ట్రంలో నిర్మించనున్న వివిధ జాతీయ రహదారులకు అవసరమైన భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన లేఖలో కోరారు. రీజనల్ రింగ్ రోడ్డు(RRR) భూసేకరణ కోసం ఎన్‌హెచ్‌ఏఐకి 50 శాతం నిధులను జమ చేయాలని కిషన్ రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
ఇక.. హైదరాబాద్ రీజినల్ రింగురోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్)లో నిరంతరాయ భూ పరిహారం పంపిణీకి మార్గం సుగమమైంది. ఇందుకు వీలుగా ఆ మార్గంలో అడ్డుగా ఉన్న విద్యుత్ టవర్లు, స్తంభాల తరలింపు, నీటి కాలువల మళ్లింపు, అందుకు తగ్గ నిర్మాణాల (యుటిలిటీ షిఫ్టింగ్) కోసం రూ.364 కోట్ల మొత్తాన్ని డిపాజిట్ చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)కి లేఖ ఇచ్చిన విషయం తెలిసిందే.
చదవండి: నలుగురు బీఆర్‌ఎస్ కార్పొరేటర్ల అరెస్ట్.. కారణం ఇది..
Comments
Please login to add a commentAdd a comment