
500 ఎకరాలు కేసీఆర్ కుటుంబానికి ఇచ్చుకుంటారా?
హైదరాబాద్: ఓయూలో ఒక్క గజం స్థలాన్ని ప్రభుత్వం తీసుకున్నా బీజేపీ వ్యతిరేకిస్తుందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. యూనివర్శిటీ భూమిని లాక్కొంటే అమవీరుల ఆత్మలను అవమానించినట్లే అవుతుందన్నారు. రెచ్చగొట్టడం, కయ్యానికి కాలు దువ్వడం సీఎం కేసీఆర్ కు తగదని హితవు పలికారు. హార్టీ కల్చర్ యూనివర్సిటీకి 500 ఎకరాలు వద్దంటున్న కేసీఆర్... కుటుంబ సభ్యులకు ఇచ్చుకుంటారా? అని ప్రశ్నించారు.
జీహెచ్ఎంసీపై బీజేపీ జెండా ఎగిరే వరకు శ్రమిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు.