
'రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం..'
హైదరాబాద్: గత ప్రభుత్వం రైతులకు చేసిన అన్యాయాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం సరిదిద్దాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సూచించారు. హైదరాబాద్లోని ధర్నా చౌక్ వద్ద బీజేపీ చేపట్టిన రైతు దీక్షలో మంగళవారం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కరువు మండలాలు ప్రకటించడంపై జాప్యం ఎందుకు జరుగుతుందని మండిపడ్డారు.
రైతులకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడకుండా ప్రభుత్వం భరోసా కల్పించాలన్నారు.