'ఖాసీం రజ్వీ, వికారుద్దీన్లకు భారతరత్న ఇవ్వమంటారా? | kishan reddy fires on Asaduddin Owaisi comments | Sakshi
Sakshi News home page

'ఖాసీం రజ్వీ, వికారుద్దీన్లకు భారతరత్న ఇవ్వమంటారా?

Published Tue, May 5 2015 5:24 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

'ఖాసీం రజ్వీ, వికారుద్దీన్లకు భారతరత్న ఇవ్వమంటారా? - Sakshi

'ఖాసీం రజ్వీ, వికారుద్దీన్లకు భారతరత్న ఇవ్వమంటారా?

హైదరాబాద్: మాజీ ప్రధాని వాజ్ పేయి, సీనియర్ నేత అద్వానీలపై ఏఐఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. మతోన్మాదాన్ని విరజిమ్మే ఎంఐఎం దిగజారుడు మాటలు మాట్లాడుతోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజ్యాంగవిరుద్ధంగా మాట్లాడిన ఒవైసీ ఎంపీ పదవిని వెంటనే రద్దు చేయాలన్నారు. తీవ్రవాద చర్యలను సమర్థించే మజ్లిస్ పార్టీ.. ఖాసీం రజ్వీ, వికారుద్దీన్లకు భారతరత్న ఇవ్వమంటుందా అని ప్రశ్నించారు.

బాబ్రీ మసీదు విధ్వంస అభియోగాలను ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని వాజ్‌పేయి, మాజీ ఉపప్రధాని ఎల్‌కే అద్వానీలకు భారతరత్న, పద్మవిభూషణ్ అవార్డులతో కేంద్ర ప్రభుత్వం సత్కరించడం దుర్మార్గమని  ఒవైసీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

అంతే కాకుండా ఆర్టీసీ సమ్మె నివారణకు సీఎం కేసీఆర్ జోక్యం చేసుకోవాలని కిషన్ రెడ్డి అన్నారు. పార్టీకి, ప్రభుత్వానికి ఉన్న లక్ష్మణ రేఖను టీఆర్ఎస్ చేరిపేస్తోందని విమర్శించారు . హైకోర్టు విభజన పై గవర్నర్, ఇరు రాష్ట్రాల సీఎంలు, చీఫ్ జస్టిస్ కూర్చొని నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement