చర్చించకుండా కొత్త జిల్లాలను ప్రకటించొద్దు
స్పీకర్‌నే అవమానించేలా అసెంబ్లీ ప్రోరోగ్: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో చర్చించి, నిర్ణయం తీసుకునే వరకు జిల్లాల విభజనపై తుది ప్రకటనను వాయిదా వేయాలని అసెంబ్లీ బీజేపీ పక్ష నేత జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజా ఆందోళనను విస్మరించి జిల్లాల ఏర్పాటును జరపొద్దని సూచించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సెప్టెంబర్ 20 నుంచి పది పనిదినాలు అసెంబ్లీ జరిగే విధంగా స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయించగా.. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీని ప్రోరోగ్ చేసిందని దీన్ని తమ పార్టీ ఖండిస్తోందన్నారు. బీఏసీలో, ఇతర పక్షాలతో చర్చించకుండా ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. స్పీకర్‌ను అవమానించేలా ప్రభుత్వం వ్యవహరించిందని విమర్శించారు.