
'ప్రభుత్వానికి సరైన ట్రీట్ మెంట్ ఇవ్వాలి'
వరంగల్ : వరంగల్ లోక్సభ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి సరైన ట్రీట్ మెంట్ ఇవ్వాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. వరంగల్ పట్టణంలో ఆయన బుధవారం నాడు మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో సర్కార్ పాలన గాడి తప్పిందని పేర్కొన్నారు. వరంగల్ ఎంపీ స్థానానికి నేడు నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు.
ఉద్యమాల పునాదులపై నిర్మించిన తెలంగాణను బంగారు తెలంగాణగా మారుస్తానన్న సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని కాకుండా ఆయన కుటుంబాన్ని బంగారుమయంగా చేసుకుంటున్నారని మంగళవారం ఖమ్మం జిల్లా పర్యటనలో కిషన్‌రెడ్డి మండిపడ్డ విషయం విదితమే.