సాక్షి,నారాయణపేట: మక్తల్‌లో కృష్ణా నది వద్ద కృష్ణమ్మ విగ్రహానికి పూజలు చేసి బీజేపీ విజయ సంకల్ప యాత్రను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేతలు డీకే అరుణ, ఏపీ జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అంతకుముందు ఉదయం నారాయణపేటకు బయలుదేరే ముందు కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసంలో సాక్షి టీవీతో మాట్లాడారు. ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చి సమ్మక్క, సారక్క గిరిజన యూనివర్సిటీకి శంఖుస్థాపన చేస్తారని తెలిపారు. పదేళ్ళలో కేంద్రం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను యాత్రల్లో ప్రజలకు వివరిస్తామని చెప్పారు.
‘గతంలో బీఆర్‌ఎస్ చేసిందేమీ లేదు. కాంగ్రెస్ చేయబోయేది ఏమీ లేదు. బీజేపీపై ప్రజలకు విశ్వాసం ఉంది. తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసి మెజార్టీ ఎంపీ సీట్లు గెలుస్తాం. కంటి వైద్యం కోసమో కాంగ్రెస్ అధిష్టానాన్ని కలవడం కోసమో కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నట్లు ఉంది. బీఆర్‌ఎస్‌తో మాకు పొత్తు ప్రసక్తే లేదు’ అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఒక్క వరంగల్ తప్ప రాష్ట్రంలోని 17 ఎంపీ నియోజకవర్గాల్లో బీజేపీ విజయసంకల్ప యాత్రలు క్లస్టర్ల వారిగా ప్రారంభమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment