vijay sankalp yatra rally
-
తెలంగాణలో దూకుడు పెంచిన బీజేపీ
-
విజయ సంకల్ప యాత్ర ప్రారంభించిన కిషన్‌రెడ్డి
సాక్షి,నారాయణపేట: మక్తల్‌లో కృష్ణా నది వద్ద కృష్ణమ్మ విగ్రహానికి పూజలు చేసి బీజేపీ విజయ సంకల్ప యాత్రను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేతలు డీకే అరుణ, ఏపీ జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఉదయం నారాయణపేటకు బయలుదేరే ముందు కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసంలో సాక్షి టీవీతో మాట్లాడారు. ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చి సమ్మక్క, సారక్క గిరిజన యూనివర్సిటీకి శంఖుస్థాపన చేస్తారని తెలిపారు. పదేళ్ళలో కేంద్రం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను యాత్రల్లో ప్రజలకు వివరిస్తామని చెప్పారు. ‘గతంలో బీఆర్ఎస్ చేసిందేమీ లేదు. కాంగ్రెస్ చేయబోయేది ఏమీ లేదు. బీజేపీపై ప్రజలకు విశ్వాసం ఉంది. తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసి మెజార్టీ ఎంపీ సీట్లు గెలుస్తాం. కంటి వైద్యం కోసమో కాంగ్రెస్ అధిష్టానాన్ని కలవడం కోసమో కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నట్లు ఉంది. బీఆర్ఎస్తో మాకు పొత్తు ప్రసక్తే లేదు’ అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఒక్క వరంగల్ తప్ప రాష్ట్రంలోని 17 ఎంపీ నియోజకవర్గాల్లో బీజేపీ విజయసంకల్ప యాత్రలు క్లస్టర్ల వారిగా ప్రారంభమయ్యాయి. ఇదీ చదవండి.. హస్తినలో సీఎం రేవంత్ -
బీజేపీ విజయ సంకల్ప యాత్ర
-
100 రోజుల్లో పెనుమార్పులు
రోహ్తక్(హరియాణా): ఎన్డీయే ప్రభుత్వం రెండో సారి అధికారం చేపట్టాక 100 రోజుల పాలనలో దేశంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. దేశంలో అభివృద్ధి, విశ్వాసం, భారీ మార్పులు చోటుచేసుకున్నాయని వ్యాఖ్యానించారు. తమ పాలనలో ప్రజలకు ప్రభుత్వంపై విశ్వాసం ఏర్పడిందని తెలిపారు. వ్యవసాయ రంగం, జాతీయ భద్రత వంటి అంశాల్లో తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు 130 కోట్ల మంది భారతీయులే స్ఫూర్తి అని పేర్కొన్నారు. ప్రజల మద్దతు వల్లే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రోహ్తక్లో జరిగిన ‘విజయ్ సంకల్ప్’ ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు. ఎన్డీయే ప్రభుత్వం 100 రోజుల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని పలు అంశాలను ప్రస్తావించారు. ముస్లిం మహిళల హక్కులకు రక్షణ కల్పించడం, ఉగ్రవాదాన్ని రూపుమాపడం వంటి వాటి కోసం కీలక చట్టాలు తీసుకొచ్చామని ప్రధాని పేర్కొన్నారు. గత 60 ఏళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా పార్లమెంట్ సమావేశాల్లో అత్యధిక బిల్లులు పాసయ్యాయని వెల్లడించారు. దీనికి సహకరించిన ప్రతిపక్షాలకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఇటీవల కొన్ని చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో రాబోయే రోజుల్లో దేశం ఎంతో ప్రయోజనం పొందుతుందని ఉద్ఘాటించారు. ఏ రంగంలోనైనా చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకునే ముందు చాలా కసరత్తు చేస్తామని చెప్పారు. జమ్మూ కశ్మీర్ అంశం, తాగునీటి సంక్షోభం సహా పలు సవాళ్లు తమ ముందున్నాయని, వాటిని ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసని ఉద్ఘాటించారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను తమ ప్రభుత్వం పరిష్కరించిందని వ్యాఖ్యానించారు. ఇండియా తనకు ఎదురైన సవాళ్లను సవాల్ చేసే స్థాయికి ఎదిగిందని అన్నారు. చంద్రయాన్–2 దేశాన్ని ఏకం చేసింది.. ఇస్రో చేపట్టిన చంద్రయాన్–2 ప్రయోగం దేశ ప్రజలను ఏకం చేసిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. చంద్రయాన్–2 ప్రయోగంలో చివరి 100 సెకన్లు గెలుపు, ఓటముల నిర్వచనాలను మార్చేశాయని తెలిపారు. దేశ ప్రజలు గెలుపు, ఓటముల పరిధిని దాటి ఆలోచిస్తున్నారని.. అలా చేసినప్పుడే దేశం తన లక్ష్యాలను సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. క్రీడాకారుల స్ఫూర్తిలాగా ప్రస్తుతం ఇస్రో స్ఫూర్తి కొనసాగుతోందని అన్నారు. దేశమంతా మార్పుపై విశ్వాసంతో ముందుకు సాగుతోందని అన్నారు. -
'నో కాంప్రమైజ్.. బడ్జెట్ ఫిబ్రవరి 1నే'
-
'నో కాంప్రమైజ్.. బడ్జెట్ ఫిబ్రవరి 1నే'
పంజాబ్: గతంలో దేశ రక్షణ కోసం భారత సరిహద్దు దాటిన దమ్మే గత ప్రభుత్వానికి లేకుండాపోయిందని(సర్జికల్ దాడిని పరోక్షంగా చెబుతూ), తమలాగా నల్లధనం, అవినీతిపై ఇంత పెద్ద మొత్తంలో దాడి ఏ ప్రభుత్వం చేయలేదని కేంద్రం ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు దూషణలతోనే సరిపెడుతుందని అన్నారు. ఫిబ్రవరి 1నే బడ్జెట్‌ను ప్రవేశపెట్టి తీరుతామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మరోసారి స్పష్టం చేశారు. తాము ప్రవేశ పెట్టనున్న బడ్జట్‌ను మూడు నెలల కిందటే ఫైనల్ చేశామని ఆయన చెప్పారు. ఆదివారం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో బీజేపీ నిర్వహిస్తున్న విజయ్ సంకల్ప్ యాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఐదు రాష్ట్రాలకు ఎన్నికల తేదీలను ప్రకటించిన నేపథ్యంలో బడ్జెట్‌ను వాయిదా వేయాలని ఇప్పటికే విపక్షాలు డిమాండ్ చేస్తూ ప్రధాన ఎన్నికల కమిషన్‌ను కూడా కలిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన జైట్లీ బడ్జెట్ పెట్టితీరుతామన్నారు. బడ్జెట్‌ను వాయిదా వేసే సంప్రదాయం ఎప్పుడూ లేదని అన్నారు. ఇక పంజాబ్ రాజకీయాల గురించి 2002 నుంచి 2007 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పంజాబ్‌కు ఒక్కపనైనా చేసిందా? అని ప్రశ్నించారు. ఎంతసేపటికి ఆ పార్టీ కక్షపూరిత రాజకీయాలతో, ఇతరులపై నిందలు వేస్తూ ముందుకెళ్లిందని గట్టిగా ఆరోపించారు. నియంత్రణ రేఖ దాటే దమ్ము గతంలో ఏ ప్రభుత్వానికి లేకుండా పోయిందని, నల్లధనం, అవినీతిపై ఇంత పెద్ద మొత్తంలో దాడి చేయలేకపోయిందని అరుణ్ జైట్లీ చెప్పారు.