
'రైతులను చూడకుండా.. చైనా వెళతారా'
నిజామాబాద్: సీఎం కేసీఆర్ సొంత జిల్లాలోనే 100 మంది రైతులు మరణించి, కరువు విలయతాండవం చేస్తోందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో 17 నెలల్లో 1200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. నిజామాబాద్లో బీజేపీ నిర్వహించిన రైతు మహాధర్నాలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ..రైతుల్లో ఆత్మస్తైర్యం నింపకుండా చైనా పర్యటనేంటని మండిపడ్డారు. యుద్ధ ప్రతిపాదికన కరువు మండలాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిజాం పాలన విముక్తి ఉత్సవాలపై కేసీఆర్ బహిరంగ చర్చకు సిద్ధమా అని కిషన్ రెడ్డి సవాలు విసిరారు.
దేశానికి, రాష్ట్రానికి పట్టిన దరిద్రం కాంగ్రెస్ పార్టీ అని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో రైతుల ఆత్మహత్యలు, సంక్షేమ పథకాలపై చర్చిస్తామని కిషన్ రెడ్డి అన్నారు.