
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శ్వేత పత్రం, బీఆర్‌ఎస్ స్వేద పత్రం రెండూ అవినీతి పత్రాలేనని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి జయంతి కార్యక్రమం సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 28న తెలంగాణలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన ఉంటుందని తెలిపారు.
ఈ పర్యటనలో భాగంగా రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో పార్టీ మండల అధ్యక్షులు, ఆ పై స్థాయి నేతలతో అమిత్ షా సమావేశమవుతారని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతపై ఈ సమావేశంలో పార్టీ శ్రేణులకు అమిత్ షా దిశా నిర్దేశం చేస్తారని తెలిపారు.
ఈ సమావేశం తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలతోనూ అమిత్ షా భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలతో భేటీ తర్వాత బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచిన విషయం తెలిసిందే. వీరంతా తెలంగాణ మూడవ అసెంబ్లీ తొలి సమావేశాలకు కూడా హాజరయ్యారు. అయితే ఇప్పటివరకు బీజేఎల్పీ నేత ఎంపిక మాత్రం పెండింగ్‌లోనే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment