
సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ్ ఎన్నికల ముందు బీజేపీ అధిష్టానం భారీ ప్రక్షాళనకు తెరతీసినట్లే కనబడుతోంది. రెండేళ్ల కిందట మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణంలో 12 మంది సీనియర్ మంత్రులను కేబినెట్ నుంచి తొలగించిన బీజేపీ.. ఈసారి కూడా పలువురు మంత్రులకు ఉద్వాసన చెప్పేందుకు దాదాసు సిద్ధమైనట్లే తెలుస్తోంది. ప్రధానంగా త్వరలో ఎన్నికల జరుగనున్న ఐదు రాష్ట్రాల నుంచి ఎక్కువ సంఖ్యలో మంత్రి పదవులు ఇవ్వాలని ప్రణాళిక చేస్తోంది.
అయితే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు సైతం మంత్రి వర్గంలో చోటు దక్కే అవకాశాలు కనబడుతున్నాయి. తెలంగాణ బీజేపీ పగ్గాలు కిషన్‌రెడ్డి అప్పచెప్పి.. బండి సంజయ్‌ను మంత్రిని చేయాలని బీజేపీ అధిష్టానం యోచిస్తోంది. ఇక ఈటల రాజేందర్‌కు బీజేపీ ప్రచార సారథ్య బాధ్యతలు అప్పచెప్పే అవకాశం ఉంది.
బీజేపీలో సంస్థాగత మార్పులపై అధిష్టానం దృష్టిపెట్టింది. దీనిలో భాగంగా పలు రాష్ట్రాల్లో మార్పులు కనిపించే అవకాశాలు ఉన్నాయి. పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకుని బీజేపీ అధిష్టానం మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే భారీ ప్రక్షాళన దాదాపు ఖాయంగా కనబడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment