
అంబర్‌పేట్ నుంచి కిషన్‌రెడ్డి పోటీ
బీజేపీ టీ అభ్యర్థుల జాబితాలు విడుదల
న్యూఢిల్లీ: తెలంగాణలో బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల మలి, తుది విడత జాబితాలను కేంద్ర నాయకత్వం బుధవారం విడుదల చేసింది. తెలంగాణలో టీడీపీతో పొత్తులో బీజేపీకి 8 లోక్‌సభ, 47 అసెంబ్లీ స్థానాలు కేటాయించిన విషయం విదితమే. మంగళవారం రాత్రి తొలి జాబితాలో 8 లోక్‌సభ, 21 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది.
బుధవారం ఉదయం విడుదల చేసిన మలి జాబితాలో 15 మంది, మధ్యాహ్నం 2.30 గంటలకు విడుదల చేసిన తుది విడత జాబితాలో 11 మంది అసెంబ్లీ అభ్యర్థుల పేర్లను బీజేపీ అధినాయకత్వం ప్రకటించింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సిట్టింగ్ స్థానం అంబర్‌పేట్ నుంచి బరిలో దిగనున్నారు.