
భారత మహిళా హాకీ జట్టు (PC: Hockey India)
FIH Hockey Nations Cup: నేషన్స్ కప్ అంతర్జాతీయ మహిళల హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. స్పెయిన్‌లో సోమవారం జరిగిన పూల్ ‘బి’ రెండో లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 2–1 గోల్స్ తేడాతో 2018 ఆసియా క్రీడల చాంపియన్ జపాన్‌పై గెలిచింది.
భారత్ తరఫున సలీమా టెటె (5వ ని.లో), బ్యూటీ డుంగ్‌డుంగ్ (40వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. జపాన్ జట్టుకు రుయ్ తకషిమా (49వ ని.లో) ఏకైక గోల్ అందించింది. దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంటే భారత్ సెమీఫైనల్ చేరుతుంది.