టెరసా (స్పెయిన్): అసలైన మ్యాచ్‌ల్లో గెలుపొందలేకపోయిన భారత మహిళల హాకీ జట్టు వర్గీకరణ పోటీల్లో వరుస విజయాలు సాధించి ప్రపంచకప్‌లో తొమ్మిదో స్థానంతో ముగించింది. బుధవారం 9 నుంచి 12 స్థానాల కోసం జరిగిన మ్యాచ్‌లో భారత్ 3–1తో జపాన్‌పై విజయం సాధించింది. ఫార్వర్డ్ ప్లేయర్ నవ్‌నీత్ కౌర్ (30వ, 45వ ని.) రెండు ఫీల్డ్ గోల్స్ చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించింది.
జట్టులో మరో గోల్‌ను దీప్ గ్రేస్ ఎక్కా పెనాల్టీ కార్నర్ ద్వారా (38వ నిమిషం) సాధించింది. జపాన్ జట్టులో నమోదైన ఏకైక గోల్‌ను యు అసయ్ 20వ నిమిషంలో చేసింది. జపాన్‌కు లభించిన పెనాల్టీ కార్నర్‌ను యు అసయ్ పొరపాటు చేయకుండా గోల్‌పోస్ట్ లోకి పంపడంతో 1–0తో మ్యాచ్‌లో పైచేయి సాధించింది. భారత శిబిరంలో ఒత్తిడి నెలకొన్నప్పటికీ మూడో క్వార్టర్లో దీప్ గ్రేస్, నవ్‌నీత్ గోల్స్‌తో భారత్ తిరుగులేని ఆధిక్యం సంపాదించింది.
Comments
Please login to add a commentAdd a comment