India Women tour of Bangladesh, 2023- మిర్పూర్: బంగ్లాదేశ్ పర్యటనలో భారత మహిళల క్రికెట్ జట్టు క్లీన్‌స్వీప్ ఆశలకు ఆతిథ్య జట్టు గండికొట్టింది. ఆఖరి టి20లో బంగ్లా ఊహించని షాక్ ఇచ్చింది. గురువారం జరిగిన చివరిదైన మూడో మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ బృందం నాలుగు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ చేతిలో బోల్తా పడింది. దీంతో సిరీస్‌ను 3–0 గెలవాలనుకున్న భారత్ 2–1తో సరిపెట్టుకుంది.
మొదట భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 102 పరుగులే చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన (1), షఫాలీ వర్మ (11) సహా అందరు మూకుమ్మడిగా విఫలమయ్యారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (40; 3 ఫోర్లు, 1 సిక్స్), జెమీమా రోడ్రిగ్స్ (28; 4 ఫోర్లు) ఆదుకున్నారు. ప్రత్యర్థి బౌలర్లలో రబియా ఖాన్ 3, సుల్తానా 2 వికెట్లు తీశారు. తర్వాత బంగ్లా 18.2 ఓవర్లలో 6 వికెట్లకు 103 పరుగులు చేసి గెలిచింది.
ఓపెనర్ షమీమా సుల్తానా (46 బంతుల్లో 42; 3 ఫోర్లు) గెలిపించే బాధ్యత తీసుకుంది. భారత బౌలర్లలో దేవిక వైద్య, మిన్ను మణి చెరో 2 వికెట్లు తీశారు. ఓవరాల్‌గా మహిళల జట్టుకు బంగ్లా చేతిలో ఇది మూడో ఓటమి. ఈ మూడు మ్యాచ్‌లకూ హర్మన్‌ప్రీత్ కౌరే కెపె్టన్‌గా వ్యవహరించింది. ఈ పర్యటనలో తదుపరి మూడు వన్డేల ద్వైపాక్షిక సిరీస్ కూడా ఇదే వేదికపై 16న జరిగే తొలి వన్డేతో మొదలవుతుంది.
చదవండి: Ind Vs WI: ఏరికోరి వచ్చావు! ఏమైందిపుడు? అప్పుడు కూడా ఇలాగే! మార్చుకో..
Comments
Please login to add a commentAdd a comment