న్యూఢిల్లీ: ఆదివారం లార్డ్స్‌లో జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో గుండెపగిలే ఓటమి ఎదురైనా.. కోట్లాది హృదయాలను గెలుచుకుంది భారత మహిళా క్రికెట్ జట్టు. ప్రపంచకప్‌లో ఆద్యంత స్ఫూర్తిదాయకమైన పోరాటపటిమను కనబర్చిన వుమెన్ క్రికెట్ టీమ్‌ను ఘనంగా సత్కరించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. టీమ్ సభ్యులు బుధవారం నుంచి విడతలు విడతలుగా భారత్ రానున్నారు. జట్టు సభ్యులందరి కోసం ఘనమైన సత్కార వేడుకను నిర్వహించాలని, ఈ కార్యక్రమంలో మహిళా క్రికెటర్లు ఒక్కొక్కరికీ రూ. 50 లక్షల చొప్పున చెక్కులు అందజేయాలని, సహాయక సిబ్బందికి రూ. 25 లక్షల చొప్పున చెక్కులు అందజేయాలని బీసీసీఐ నిర్ణయించింది. ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు ముందే వారికి ఈ భారీ నజరానాను బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇక, భారత మహిళా క్రికెట్ జట్టు ప్రధానమంత్రి నరేంద్రమోదీని కూడా కలిసే అవకాశముంది. ఇందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 12 ఏళ్ల తర్వాత అద్భుతమైన ఆటతీరుతో భారత్‌ను ఫైనల్‌కు చేర్చిన వుమెన్ టీమ్‌పై ప్రధాని మోదీ ఇప్పటికే ప్రశంసల జల్లు కురిపించారు.
'వుమెన్ ఇన్ బ్లూ'కు భారీ సత్కారం!
Published Mon, Jul 24 2017 5:03 PM | Last Updated on Tue, Sep 5 2017 4:47 PM
Advertisement
Advertisement