బిగ్ బాష్‌లోకి స్మృతి మందన | India's Smriti Mandhana signed by Brisbane Heat for Women's Big Bash League | Sakshi
Sakshi News home page

బిగ్ బాష్‌లోకి స్మృతి మందన

Published Wed, Sep 28 2016 1:07 AM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM

బిగ్ బాష్‌లోకి స్మృతి మందన

బిగ్ బాష్‌లోకి స్మృతి మందన

న్యూఢిల్లీ: మహిళల బిగ్ బాష్ లీగ్‌లో మరో భారత బ్యాట్స్‌వుమన్‌కు చోటు దక్కింది. బ్రిస్బేన్ హీట్ ఫ్రాంచైజీ స్మృతి మందనతో ఏడాది పాటు ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే హర్మన్‌ప్రీత్ కౌర్ డిఫెండింగ్ చాంపియన్ సిడ్నీ థండర్ తరపున బరిలోకి దిగనున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆసీస్‌తో హోబర్ట్‌లో జరిగిన తొలి వన్డేలో స్మృతి తొలి అంతర్జాతీయ సెంచరీని నమోదు చేసింది. ఆ తర్వాత కూడా తను వరుసగా 55, 55, 46 పరుగులతో రాణించింది. దీంతో హీట్స్ జట్టులోని ఇతర మహిళా క్రికెటర్లు అంతా ఆమె పేరునే సూచించినట్టు ఆ జట్టు కోచ్ ఆండీ రిచర్డ్స్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement