టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధన మహిళల బిగ్‌బాష్ లీగ్ సీజన్-10లో డిఫెండింగ్ ఛాంపియన్స్ అడిలైడ్ స్ట్రయికర్స్‌తో జతకట్టనుంది. స్మృతి డబ్ల్యూబీబీఎల్ ప్రీ డ్రాఫ్ట్ కాంట్రాక్ట్ సైన్ చేసిన తొలి ఓవర్సీస్ ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పింది. మంధన గతంలో బ్రిస్బేన్ హీట్ (2016-17), హోబర్ట్ హరికేన్స్ (2018-19), సిడ్నీ థండర్ (2021) ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించింది.
వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కారణంగా మంధన 2022, 2023 ఎడిషన్లలో పాల్గొనలేదు. అడిలైడ్ స్ట్రయికర్స్‌లో మంధన ఆర్సీబీ హెడ్ కోచ్ లూక్ విలియమ్స్‌తో కలిసి పని చేయనుంది. లూక్ అడిలైడ్ స్ట్రయికర్స్‌కు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. మహిళల బిగ్‌బాష్ లీగ్ 2024 ఎడిషన్ అక్టోబర్ 27 నుంచి ప్రారంభం కానుంది.
డ్రాఫ్ట్‌లో 19 మంది భారత ప్లేయర్లు..
మహిళల బిగ్‌బాష్ లీగ్ ప్లేయర్స్ డ్రాఫ్ట్‌లో 19 మంది భారత క్రికెటర్లు పాల్గొననున్నారు. ప్లేయర్ల డ్రాఫ్ట్ వచ్చే ఆదివారం జరుగనుంది. డ్రాఫ్ట్‌లో పాల్గొంటున్న భారత స్టార్ ప్లేయర్లలో హర్మన్‌ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగెజ్, దీప్తి శర్మ ముఖ్యులు. వీరితో పాటు శ్రేయాంక పాటిల్, టైటాస్ సాధు, ఆశా శోభన, రాధా యాదవ్, అమన్‌జోత్ కౌర్, యస్తికా భాటియా, శిఖా పాండే, స్నేహ్ రాణా, హేమలత దయాలన్, సంజన సంజీవన్, మన్నత్ కశ్యప్, మేఘన సబ్బినేని, వేద కృష్ణమూర్తి, మోనా మెష్రమ్, మేఘన సింగ్ డ్రాఫ్ట్‌లో పాల్గొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment